రష్యా అధికారిక మీడియా సంచలన ప్రకటన చేసింది. మూడో ప్రపంచ యుద్దం మొదలైపోయినట్లేనని పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో.. యుద్ధ నౌక మాస్కోవా మునకతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని రష్యా వన్‌లో ప్రసారం అయ్యింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్.. ఇప్పుడు వైరల్ అవుతోంది.
రష్యా భారీ యుద్ధ నౌక మాస్కోవా అగ్నిప్రమాదంలో.. దెబ్బతిన్నదని క్రెమ్లిన్ ప్రకటించున్న సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ మాత్రం.. తమ నెప్ట్యూన్ క్షిపణి ద్వారా నల్ల సముద్రంలో ఉన్నప్పుడు ఆ ప్రధాన నౌకను నాశనం చేసినట్లు గర్వంగా ప్రకటించుకుంది. ఈ ఘటనను ఉద్దేశిస్తూ రష్యా ప్రభుత్వ ఛానెల్ ‘రష్యా 1’ ఛానెల్ ప్రజెంటర్ ఒల్గా స్కాబెవెయా ఓ డిబెట్‌లో.. అధికారంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ ప్రకటన చేశారు.
‘‘నాటోకు పూర్తి వ్యతిరేకంగా ఇప్పుడు మనం పోరాడుతున్నాము. నాటో గుర్తించకపోయినా.. ఇప్పుడు మనం అది గుర్తించాల్సిందే. ముఖ్యమైన ప్రకటన.. ఇది మూడో ప్రపంచ యుద్ధం.. ఆల్రెడీ మొదలైపోయింది’’ అంటూ వ్యూయర్స్‌ను ఉద్దేశిస్తూ ఆవేశపూరితంగా ఆమె మాట్లాడారు. అదే షోలో గెస్ట్‌గా పాల్గొన్న ఓ వ్యక్తి.. రష్యన్ గడ్డపై దాడికి మాస్కోవా మునిగిపోయింది అంటూ క్రెమ్లిన్ చేసిన అగ్నిప్రమాద ఘటన ప్రకటనకు విరుద్ధంగా కామెంట్లు చేశాడు. అయితే.. ఇది ప్రత్యేక సైనికచర్య అనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన.. సదరు ప్రజెంటర్‌కు గుర్తుచేశారు. అయినప్పటికీ ఆమె మూడో ప్రపంచ యుద్ధం అంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం.
Olga Skabeyeva Russian Media broadcast with commentators calling for all out war after sinking of Moscow, including bombing and possibly discussing dropping "a single bomb on Kyiv" to keep world leaders from visiting. #RussianUkrainianWar pic.twitter.com/R0uOLol0FV
— EyesFromUkraine (@NowInUkraine) April 15, 2022
ఇప్పటిదాకా రష్యా మీడియా ఛానెల్స్ ఏవీ కూడా.. ఉక్రెయిన్‌పై యుద్ధంగా కాకుండా పుతిన్ ప్రకటించినట్లుగానే ‘ప్రత్యేక సైనిక చర్య’గా ఇంతకాలం అభివర్ణిస్తూ వచ్చాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఛానెల్ నుంచి నేరుగా యుద్ధ ప్రకటన.. అదీ మూడో ప్రపంచ యుద్ధం అంటూ వ్యాఖ్యలు రావడం విశేషం. మరో ప్రభుత్వ ఛానెల్‌లో కూడా ఉక్రెయిన్ వ్యతిరేక ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాల ఆదేశాలను శిరసావిస్తూ.. మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు ఉపక్రమిస్తోందని, రక్తపాతం..హింసను ఊహించని స్థాయిలో కోరుకుంటుందేమోనని ఛానెల్ యాంకర్ ఒలెస్యా లోసెవా వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉండగా.. బుచా మారణహోమం, అత్యాచారాలను ఆయుధంగా వాడుకుంటోందంటూ రష్యాపై ఉక్రెయిన్ సహా పాశ్చాత్య దేశాలు ఆరోపణలకు దిగాయి. ఐరాసతో సహా అంతర్జాతీయ సమాజం నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో.. రష్యాకు నష్టమేమీ లేదంటూనే.. ఆ దేశాలకు కౌంటర్ గట్టిగానే ఇవ్వాలని పుతిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రష్యా ప్రైడ్
రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌకే మాస్కోవా. దీనిని మిసైల్స్‌తో పేల్చామని ఉక్రెయిన్ అధికారులు గురువారం ప్రకటించారు. అయితే తమ నౌకలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలో సిబ్బందిని ఖాళీ చేయించామని తెలిపింది. ప్రమాదం పెద్దదే కానీ నౌక మునిగిపోలేదని, దాన్ని దగ్గరలోని నౌకాశ్రయానికి చేర్చామని వెల్లడించింది.
అయితే.. తిరుగు ప్రయాణంలో అది మునిగిపోయినట్లు కాసేపటికే సవరణ ప్రకటన చేసింది. మాస్కోవా నౌక ఒకేమారు 16 లాంగ్ రేంజ్ మిస్సైళ్లను మోసుకుపోతుంది. నౌకలో ఆయుధాలు పేలడంతో నిప్పంటుకుందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు నౌకలో 500మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. సిబ్బందితో పాటు నౌకకున్న మిసైల్ లాంచర్లు సురక్షితమేనని పేర్కొంది.
చదవండి: కీవ్‌పై మిస్సైల్స్ వర్షం తప్పదు.. క్రెమ్లిన్ హెచ్చరికలు
Comments
Please login to add a commentAdd a comment