జపాన్ లో కొత్త ట్రెండ్ 'రైస్ బాల్ బేబీ'
ఆ మధ్య సోషల్ మీడియాలో 'ఐస్ బక్కెట్ ఛాలెంజ్' చేసిన సందడి అంతా ఇంతాకాదు. ఓ వ్యాధి చికిత్స కోసం ప్రారంభమైన ట్రెండ్ ని కాలేజ్ స్టూడెంట్ నుంచి సెలబ్రిటీల వరకూ, రాజకీయ నాయకుల నుంచి కార్పోరేట్ దిగ్గజాల వరకూ అంతా ఐస్ బక్కెట్ ఛాలెంజతో సందడి చేశారు.
తాజాగా... జపాన్ లో ఇలాంటి ట్రెండ్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదే 'రైస్ బాల్ బేబీస్'. ట్విట్టర్ లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ క్యూట్ ఛాలెంజ్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. జపాన్ వంటకం 'రైస్ బాల్' షేప్ లో తమ చిన్నారుల ఫేస్ స్క్వీజ్ చేసి.. ఆ క్యూట్ ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది తమ పప్పీల ఫోటోలు సైతం 'రైస్ బాల్ బేబీ' హ్యాష్ ట్యాగ్ తో షేరు చేసుకుంటున్నారు. అంతే కాదు.. నిజం రైస్ బాల్ కంటే.. ఈ బేబీస్ భలే ముద్దొస్తున్నారంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ పాస్ చేస్తున్నారు.
గత జూన్ లో పాపులర్ జపానీస్ కమెడియన్ మషహిరో ఎహ్రా తన ముద్దులు బిడ్డ ఫేస్ ని స్క్వీజ్ చేసి.. ట్విట్టర్ లో ఫోటోలు పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ ట్రెంట్ వైరల్ గా మారింది. అంతే కాదు.. ఆ ఫోటోను ఇప్పటికి 28 వేలసార్లు రీ ట్వీట్ చేశారు.