
‘బొస్సీ’ ది బాస్...
రొమేనియాలోని బుకారెస్ట్ నగరంలో ఉన్న ఓ కంపెనీలో కమ్యూనికేషన్స్ డెరైక్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. దాదాపు 700 మంది దాకా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎట్టకేలకు ఇంటర్వ్యూలు ముగిశాయి. మెరికలాంటి ఓ అభ్యర్థిని సెలెక్ట్ చేసుకుంది ఆ కంపెనీ. ఆ అభ్యర్థి ఎవరో తెలుసా! ఈ తొమ్మిదేళ్ల పిల్లి గారే.. పేరు బొస్సీ. మనుషులతో పోటీ పడి మరీ ఈ ఉద్యోగానికి ఎంపికై ఘనత సాధించింది. కంపెనీ ప్రచారంలో భాగంగా ఫొటో షూట్స్‌లో పాల్గొనడం, వీడియోలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం, డాక్యుమెంట్లపై ముద్రలు వేయడం బొస్సీ డ్యూటీ. మొదటి రోజు డ్యూటీకి కంపెనీ కారులో.. సూటు బూటు వేసుకుని దర్జాగా వచ్చిందట. ఇంతకీ బొస్సీ జీతం ఎంతో తెలుసా... నెలకు రూ.11 వేలు ప్లస్ అలవెన్స్..