నిన్నటివరకు ట్రంప్‌ను తిట్టి.. ఇప్పుడు యూటర్న్‌! | Rubio Called Trump A Dangerous Con Man, Now He Says Trump Should Be President | Sakshi
Sakshi News home page

నిన్నటివరకు ట్రంప్‌ను తిట్టి.. ఇప్పుడు యూటర్న్‌!

Published Sat, May 28 2016 12:31 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

నిన్నటివరకు ట్రంప్‌ను తిట్టి.. ఇప్పుడు యూటర్న్‌! - Sakshi

నిన్నటివరకు ట్రంప్‌ను తిట్టి.. ఇప్పుడు యూటర్న్‌!

డొనాల్డ్ ట్రంప్ ఓ మాయాగాడు. ప్రమాదకారి. భారీ అణ్వాయుధాలు ఉన్న అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడు కావడానికి ట్రంప్ అనర్హుడు. అతడికి మనిషికి ఉండే లక్షణాలు లేవు. అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ ట్రంప్‌కు దక్కితే రిపబ్లికన్‌ పార్టీ నిలువునా చీలిపోతుంది.. అంటూ నిన్నటివరకు ట్రంప్‌ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మార్క్‌ రూబియో ఇప్పుడు మాట మార్చారు. ఫ్లోరిడా సెనెటర్‌ అయిన ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోరాడారు. రిపబ్లికన్‌ ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై తీవ్రస్థాయిలో రుబియో ధ్వజమెత్తారు. ఒకదశలో రిపబ్లికన్‌ పార్టీ ఆయనకే మద్దతు ఇస్తుండటంతో తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు.

కానీ ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగడం ఖాయమవ్వడంతో ఆయనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమంటూ రుబియో స్పష్టం చేశాడు. క్లీవ్‌లాండ్‌లో జరగనున్న రిపబ్లికన్‌ జాతీయ సదస్సుకు హాజరవుతానని, అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ట్రంప్‌కు అండగా నిలువడాన్ని గౌరవంగా భావిస్తానని రుబియో తాజాగా సీఎన్‌ఎన్‌ చానెల్‌కు తెలిపారు. హిల్లరీ క్లింటన్‌ అధక్ష్య పదవి అధిష్టించకూడదని, అందుకే ట్రంప్‌కు తాను మద్దతు ఇస్తున్నానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement