సిరియాలో కూలిన రష్యన్ విమానం (పాత ఫొటో)
మాస్కో : రష్యాకు చెందిన విమానం ఒకటి సిరియా గడ్డపై కూలిపోయిన ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలోని లటాకియా ఫ్రావిన్స్ హమీమ్ ఎయిర్‌బేర్ వద్ద మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ఈ ఎయిర్‌బేస్ నుంచే సిరియా గగనతలంపై దాడులు నిర్వహిస్తుండటం గమనార్హం.
విమాన ప్రమాదంపై రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రటకట చేసింది. కూలిపోయింది రవాణా విమానమని, అందులో ప్రయాణిస్తున్న 32 మందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయినవారిలో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. కాగా, మిగతావారు సైనికులా, లేక వైమానికదళంలో సహాయకులా అన్నది తెలియాల్సిఉంది.
గతంలో సిరియా తీవ్రవాదులు రష్యన్ విమానాలను పేల్చేసిన ఉదంతాల నేపథ్యంలో నేటి ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రాథమిక అంచనా ప్రకారం ఇది ఉగ్రచర్య కాదని, సాంకేతిక లోపం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. కొద్ది రోజుల కిందటే రష్యాలో.. ఆంటొనోవ్ ఏఎన్–148 జెట్ విమానం పేలిపోయి 71 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment