మళ్లీ మార్కెట్‌లోకి హిట్లర్ మేనిఫెస్టో | sensational mein kampf to hit markets again soon | Sakshi
Sakshi News home page

మళ్లీ మార్కెట్‌లోకి హిట్లర్ మేనిఫెస్టో

Published Sat, Jan 2 2016 2:22 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

మళ్లీ మార్కెట్‌లోకి హిట్లర్ మేనిఫెస్టో

మళ్లీ మార్కెట్‌లోకి హిట్లర్ మేనిఫెస్టో

ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించిన దివంగత జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ రాసిన సంచలనాత్మక మేనిఫెస్టో 'మైన్ కాంఫ్ (నా సంఘర్షణ)' 70 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రచురణకు నోచుకుంది. గతంలోలా యథాతథంగా కాకుండా... హిట్లర్ రాసిన అంశాలను యథాతథంగా ఇస్తూనే ఆయన చెప్పిన అబద్ధాలు, అర్ధ సత్యాలు, హింస ప్రేరేపిత ఉపన్యాసాల్లో నిగూఢంగా దాగున్న ఉద్దేశాలను బయటపెట్టే వ్యాఖ్యానాలు, విశ్లేషణలతో వస్తోంది.

'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ హిస్టరీ' ప్రచురిస్తున్న ఈ పుస్తకం వారంరోజుల్లోనే మార్కెట్లోకి వస్తోంది. దీని ధరను 63 డాలర్లుగా నిర్ణయించారు. ఆయన రాసిన పుస్తకం 600 పేజీలు ఉండగా, ఇప్పుడు తీసుకొస్తున్న పుస్తకం వ్యాఖ్యానాలు, విశ్లేషణలతో 2000 పుటలతో వస్తోంది. ఇంతకుముందు ప్రచురించిన తొలి పుస్తకం హిట్లర్ చనిపోయిన నాటి నుంచి 70 ఏళ్ల కాపీరైట్ హక్కు గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగిసిపోవడంతో ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలని నిర్ణయించారు. ఇప్పటికీ హిట్లర్‌ను, ఆయన ఫిలాసఫీని ఆరాధించే అసాంఘిక అరాచక శక్తులు ఇప్పటికీ జర్మనీలో ఉండడంతో వ్యాఖ్యానాలు, విశ్లేషణలు లేకుండా పుస్తకాన్ని ముద్రించరాదని జర్మనీ అత్యున్నత న్యాయస్థానం ఇదివరకే ఆంక్షలు విధించింది.

హిట్లర్ 'మై కాంఫ్' పుస్తకాన్ని 1923 నుంచి 1933 మధ్య రెండు భాగాలుగా ప్రచురించారు. ఈ పుస్తకాలు 40 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. సమకాలీన ప్రపంచంపై, ముఖ్యంగా యూదులు, ఇతర మైనారిటీ వర్గాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనలో కలిగిన సంఘర్షణ గురించి హిట్లర్ ఈ పుస్తకాల్లో వివరించారు. జాతులను రెచ్చగొట్టే రోమాంచిత ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది సమకాలీన ప్రపంచ చరిత్రకు అవసరం లేకపోయినా గతించిన చరిత్రలోని వాస్తవాలను వెలుగులోకి తీసుకరావాలనే సదుద్దేశంతోని మళ్లీ 'మై కాంఫ్' తీసుకొస్తున్నామని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ హిస్టరీ' వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement