
వాషింగ్టన్: డీఏసీఏ (బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా) పథకానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. కింది కోర్టులు పరిశీలించిన తర్వాతనే తాము విచారిస్తామని జడ్జీలు పేర్కొన్నారు.
చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు అమెరికా వచ్చి, అక్కడే అక్రమంగా స్థిరపడిపోయిన వారిని స్వాప్నికులు(డ్రీమర్స్) అంటారు. వీరు దాదాపు 7 లక్షల మంది ఉంటారు. వీరందరూ అమెరికాలోనే నివసించేందుకు అనుమతులిస్తూ మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన పథకమే డీఏసీఏ. దీన్ని రద్దు చేయాలని ట్రంప్ చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment