ఫోన్ ముందు దగ్గితే చాలు..
మీకు న్యుమోనియా లేదా ఆస్థమా లాంటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయా? వాటి తీవ్రత ఎంత ఉందో డాక్టర్ వద్దకు వెళ్లకుండానే తెలుసుకోవాలనుందా? అయితే సింపుల్‌గా మీ స్మార్ట్ ఫోన్ తీసుకుని దాని ఎదురుగా ఒకసారి దగ్గితే చాలు.. మీకు ఎలాంటి సమస్యలున్నాయో ఇట్టే తెలిసిపోతుంది. ఆస్ట్రేలియాకు చచెందిన డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రొవైడర్ ఈ యాప్‌ను తయారుచేశారు. 'రెస్ యాప్' అనే ఈ యాప్‌ను 524 మంది పిల్లలపై ప్రయోగించి చూశారు.
ఈ ప్రయోగాలలో 89 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు యాప్ డెవలపర్లు తెలిపారు. పేషెంట్లు దగ్గినప్పుడు వారి శ్వాసను గమనించి, వాళ్లకు న్యుమోనియా, ఆస్థమా, బ్రాంకియోలిటిస్, సీఓపీడీ లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే గుర్తిస్తుంది. దీనికి ఇంకా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అది అయిన తర్వాత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.