కిటికీ అద్దంతో సౌరశక్తి
ఫొటో చూశారుగా... ఈయ న పేరు డాక్టర్ హామండ్. న్యూ ఎనర్జీ టెక్నాలజీస్ అనే కంపెనీ శాస్త్రవేత్త. ఈయన చేతిలో ఉన్నది... సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చేయగల సోలార్ ప్యానెల్. అదేమిటి? రంగు అద్దం మాదిరిగా ఉంది కదా.. అంటున్నారా? నిజమే.
కాకపోతే ఆ రంగునిచ్చేది సూర్యుడి శక్తిని తనలో దాచుకోగల పదార్థం. ఈ పదార్థాన్ని గాజుపై స్ప్రే చేయడం ద్వారా సోలార్ ప్యానెల్స్ తయారవుతాయన్నమాట. అంతేకాదు... పారదర్శకంగా ఉంటూ సూర్యుడి వెలుగును లోపలికి ప్రసరింపజేయగల ఈ కిటికీ... గది లోపల రాత్రిపూట వెలిగే దీపాల వెలుగుతోనూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. కావాల్సిన రంగులోనూ తయారు చేసుకోవచ్చు.