‘ఫోర్బ్స్’ శక్తిమంత మహిళల్లో సోనియా నం.3
వాషింగ్టన్: ప్రపంచంలోని శక్తిమంతమైన మహిళల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడో స్థానంలో నిలిచారు. ‘ఫోర్బ్స్’ పత్రిక ప్రకటించిన 72 మంది శక్తిమంతుల జాబితాలో సోనియా 21వ స్థానంలో నిలిచారు. జాబితాలోని మహిళల్లో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ (5వ స్థానం), బ్రెజిల్ అధినాయకురాలు దిల్మా రోసెఫ్ (20వ స్థానం) తర్వాత సోనియా ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.
‘ఫోర్బ్స్’ పత్రిక సోనియాను భారత్‌కు ‘మకుటం లేని అధినేత’గా అభివర్ణించింది. శక్తిమంతుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అధిగమించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఒబామా ఈసారి రెండో స్థానానికి పరిమితం కాగా, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మూడో స్థానంలో, పోప్ ఫ్రాన్సిస్ నాలుగో స్థానంలో నిలిచారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ జాబితాలో 28వ స్థానంలో నిలవగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 38వ స్థానంలోను, ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్ 51వ స్థానంలోను నిలిచారు.