ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఘాతుకం | Suicide bombing in northern Baghdad kills so many | Sakshi
Sakshi News home page

ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఘాతుకం

Published Sat, Oct 15 2016 4:25 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఘాతుకం - Sakshi

ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఘాతుకం

బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఓ సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతిచెందారు. ఈ ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇరాక్ పోలీసుల కథనం ప్రకారం.. నార్త్ బాగ్దాద్ ఏరియాలో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియల నిమిత్తం వందలాది మంది వచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఆ ప్రాంతంలో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో మొత్తం 31 మంది మృత్యువాత పడగా, మరో 65 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలిపారు.

గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, అయితే బాధితులు ఈ ఘటనపై నోరు విప్పే పరిస్థితిలో లేరని అధికారులు చెప్పారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నార్త్ బాగ్దాద్, మోసుల్ పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఇరాక్ భద్రతా బలగాలు దాడులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని ఓ సిబ్బంది స్థానిక మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement