పాక్ మదర్సాకు వెళ్లిన మహిళా ఉగ్రవాది | Tashfeen Malik, California shooter, attended female madrassa in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్ మదర్సాకు వెళ్లిన మహిళా ఉగ్రవాది

Published Mon, Dec 7 2015 8:06 PM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

పాక్ మదర్సాకు వెళ్లిన మహిళా ఉగ్రవాది - Sakshi

పాక్ మదర్సాకు వెళ్లిన మహిళా ఉగ్రవాది

ముల్తాన్: కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడిన పాకిస్థానీ మహిళా ఉగ్రవాది తష్ఫీన్ మాలిక్.. గతంలో పాకిస్థాన్‌లోని ముల్తాన్లో గల ఓ మదర్సాకు వెళ్లి, అక్కడ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. మహిళలకు ఖురాన్ గురించి అవగాహన కల్పించే అల్- హుదా మదర్సాలో తష్ఫిన్ తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇందులో తష్ఫిన్ కోర్సును పూర్తి చేయకుండా మధ్యలోనే మానేసినట్లు మదర్సా సిబ్బంది విచారణ అధికారులకు తెలిపారు.

అల్- హుదా మదర్సా అమెరికాతో పాటు పలు దేశాల్లో శాఖలను నిర్వహిస్తుంది. అయితే ఈ సంస్థ తాలిబాన్ బావజాలాన్ని వ్యాప్తి చేస్తుందనే విమర్శలు ఉన్నా, ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు లేవు. తాజా సమాచారంతో సంస్థ కార్యకలాపాలను నిఘా అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement