కన్నతల్లిని కత్తితో 30 సార్లు పొడిచింది! | The Case Of A Teen Accused Of Killing Her Parents | Sakshi
Sakshi News home page

కన్నతల్లిని కత్తితో 30 సార్లు పొడిచింది!

Published Sun, Mar 20 2016 7:23 PM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

కన్నతల్లిని కత్తితో 30 సార్లు పొడిచింది! - Sakshi

కన్నతల్లిని కత్తితో 30 సార్లు పొడిచింది!

వాషింగ్టన్: తన ప్రేమను వ్యతిరేకించారన్న కారణంతో ఓ యువతి తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసింది. తండ్రిని గన్తో కాల్చి చంపిన ఆ యువతి.. తల్లిని కత్తితో ముప్పై సార్లు విచక్షణారహితంగా పొడిచి చంపింది. అమెరికాలోని నార్తర్న్ విస్కాన్సిస్కు చెందిన మార్టిన్సన్ అనే యువతి తన తల్లిదండ్రుల హత్యకు పాల్పడిన కేసు ఇప్పుడు కోర్టు విచారణలో ఉంది. మరో రెండు నెలల్లో ఆమెకు ఈ నేరంపై 120 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నార్త్ విస్కాన్సిస్లోని చిన్న పట్టణం పీల్లో మార్టిన్సన్ తల్లిదండ్రల మృతదేహాలను గత ఏడాది పోలీసులు కనుగొన్నారు. ఆ సమయంలో మార్టిన్ సన్ తన బాయ్ఫ్రెండ్తో ఇండియానాకు పారిపోయినట్లు వారు గుర్తించారు. ఒకవేళ కూతురే ఈ హత్యలకు పాల్పడి ఉంటుందా అన్న కోణంలో విచారణ జరిపిన అధికారులకు అదే నిజమని త్వరలోనే తెలిసింది.

తరువాత ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. తన బాయ్ఫ్రెండ్ అంటే తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని,  తనను కలుసుకోవద్దని వారు తన బాయ్ఫ్రెండ్ను బెదిరించారని, అంతేకాక తనను ఇంట్లో బందీ చేశారని తెలిపింది. అలా ఇంట్లో బంధించిన సమయంలో తుపాకీతో తన తండ్రిని కాల్చేశానని, ఆ తరువాత తల్లి తనపై కత్తితో దాడికి ప్రయత్నించడంతో.. ఆ కత్తిని లాక్కొని ఆమెను పొడిచేశానని తెలిపింది. తల్లి మృతదేహంపై 30 చోట్ల బలమైన కత్తి గాట్లను పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు రెండు రోజుల ముందే ఆమె తన ఫేస్బుక్ పేజీలో 'వెల్కమ్ టూ హెల్' అని పోస్ట్ చేసినట్లు ఆమె సన్నిహితులు పోలీసులకు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement