థీమ్‌ పార్క్‌లో లేజర్‌వార్‌ | theme park lazer war | Sakshi
Sakshi News home page

థీమ్‌ పార్క్‌లో లేజర్‌వార్‌

Published Mon, Jul 24 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

థీమ్‌ పార్క్‌లో లేజర్‌వార్‌

థీమ్‌ పార్క్‌లో లేజర్‌వార్‌

మీకు స్టార్‌వార్స్‌ సినిమా గురించి తెలుసు కదా.. అనుకున్న వెంటనే ఒక గ్రహం నుంచి ఇంకోదానికి.. ఒక గెలాక్సీ నుంచి ఇంకోదానికి వెళ్లిపోతూంటారు దీంట్లో. అంతేనా.. చేతిలో చిన్న పరికరం (ట్రైకార్డర్‌) ఉంటే చాలు.. ఒంటిలో ఉన్న జబ్బులేమిటి అన్నది తెలుసుకోవడమే కాకుండా.. ఆ వెంటనే చికిత్సలు కూడా ఠకీఠకీమని అయిపోతూంటాయి. నక్షత్రాలు, గ్రహాలు, వింత జంతువులు సెకనుసెకనుకూ కనిపించే ఈ సినిమా ప్రపంచం ఇప్పుడు వాస్తవంగా కొలువుదీరింది. ‘స్టార్‌ వర్డ్స్‌: గెలాక్సీ ఎడ్జ్‌’ పేరుతో వాల్ట్‌ డిస్నీ వరల్డ్‌ రిసార్ట్స్‌లో రూపుదిద్దుకుంటోంది. అనహీమ్‌ అనే ప్రాంతంలో ఇటీవల జరిగిన డీ23 ప్రదర్శనలో వాల్ట్‌ డిస్నీ చైర్మన్‌ బాబ్‌ బాపెక్‌ దీని వివరాలను వెల్లడించారు. ఈ అద్భుత ప్రపంచం. సినిమాలో మాదిరిగానే ఒకవైపున ఫస్ట్‌ ఆర్డర్‌.. ఇంకోవైపున రెనెసైన్స్‌ వర్గాలు లేజర్‌కత్తులతో యుద్ధాలు చేస్తూంటారు.

ఇంకోవైపున గ్రహాంతర వాసుల మధ్య వ్యాపారాలు జరుగుతూంటాయి. థీమ్‌పార్క్‌ను సందర్శించే వారు.. అందులో ఉన్న దుకాణాల్లో ఉండే వాళ్లు అందరూ స్టార్‌వార్స్‌లోని పాత్రల మాదిరిగానే దుస్తులు ధరించి తిరగవచ్చు. మొత్తం థీమ్‌పార్క్‌లో ఇమ్మర్సివ్‌ ఎక్స్‌పీరియన్స్‌ టెక్నాలజీ ఆధారంగా జరుగుతూంటుంది కాబట్టి.. మొత్తం సినిమా వాతావరణాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయవచ్చు. దీంతోపాటు ఈ థీమ్‌పార్క్‌లో రెండు ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి. అతిథులు మిలీనియం ఫాల్కన్‌ అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తూ శత్రుమూకలపై లేజర్ల కిరణాలతో దాడులు చేయవచ్చు. రెండో ఆకర్షణలో అతిథులకు ఓ పనిని అప్పగిస్తారు. దీనికోసం స్టార్‌వార్స్‌లో మాదిరిగా స్టార్‌ డిస్ట్రాయర్‌ అనే యుద్ధనౌకను మీకు అప్పగిస్తారు. దాంట్లో వెళుతూ ఇచ్చిన పని పూర్తి చేయాలన్నమాట.  ప్రస్తుతానికి నిర్మాణంలో ఉన్న ఈ గెలాక్సీ ఎడ్జ్‌ థీమ్‌ పార్క్‌ ముందుగా వాల్ట్‌ డిస్నీ వరల్డ్‌ రిసార్ట్‌లో 2019లో తెరుచుకుంటుంది. ఆ తరువాత డిస్నీల్యాండ్‌ రిసార్ట్‌లోనూ దీన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకో విషయం ఈ రెండు థీమ్‌పార్క్‌లు 2019లో ఓపెన్‌ కానున్నాయి.
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement