ఆస్ట్రేలియాలో ముగ్గురు భారతీయులపై అభియోగాలు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో ముగ్గురు భారతీయ యువకులు మొబైల్ చాటింగ్ ద్వారా ఒక మహిళను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ చాటిం గ్‌తో ఆమెను పరిచయం చేసుకుని, బెదిరించి, అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డారు.ఈమేరకు అజిత్‌పాల్ సింగ్(31), రణధీర్ సింగ్(20)పై పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో మరో భారతీయ వ్యక్తి ఉన్నప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. శనివారం ఏసీటీ మేజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు ఈ కేసు వివరాలను తెలిపారు. గతనెల 25న మొబైల్ అప్లికేషన్ టాంగో చాట్ ద్వారా బాధితురాలికి ఒక వ్యక్తి నుంచి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ (స్నేహం కోసం అభ్యర్థన) వచ్చింది. దానిని ఆమోదించిన తర్వాత ఆమె, అతడు సెప్టెంబర్ 26న కిప్పక్స్ ఫెయిర్ షాపింగ్ సెంటర్ వద్ద కలుసుకోవాలనుకున్నారు.
తీరా ఆ మహిళ వచ్చి చూసేసరికి కారులో ముగ్గురు భారతీయులు ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. తమతో రావాలని రణధీర్ కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో అతడు బెదిరింపులకు దిగాడు. ‘నీకు పెళ్లయిందని తెలుసు. మన చాటింగ్ మెస్సేజ్‌లను నీ భర్తకు చూపిస్తా. అంతేకాదు స్కూలుకెళ్లే నీ పిల్లలకు హాని తలపెడతాం’ అని బెదిరించి ఆమెను ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
చాటింగ్‌తో పరిచయం... ఆపై అత్యాచారం
Published Mon, Oct 14 2013 2:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
Advertisement