అమెరికాలో భారీ అగ్నిప్రమాదం | three dead in Honolulu high rise fire, authorities say | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం

Published Sat, Jul 15 2017 12:44 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం - Sakshi

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం

హోనలూలు: అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హవాయి రాష్ట్ర రాజధాని హోనలూలులోని 31 అంతస్తుల అపార్టుమెంట్‌లో జరిగిన ఆ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మార్కోపోలో అపార్టుమెంట్‌లో 26వ అంతస్తులో మొదట మంటలు చెలరేగాయి. ఇవి 27వ అంతస్తుకు ఎగబాకాయి. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
 
అపార్టుమెంట్‌లో 586 ఫ్లాట్‌లు, నాలుగు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. గాయపడిన వారికి పారామెడికల్‌ సిబ్బంది చికిత్సలు అందించారు. గాయపడిన వారిలో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి నిలకడగా ఉందని అగ్నిమాపక శాఖ అధికారి కెప్టెన్‌ డేవిడ్‌ జెన్‌కిన్స్‌ తెలిపారు. మృతులు ముగ్గురూ 26 వ అంతస్తుకు చెందినవారేనన్నారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement