తిన్నా, తిరిగినా, ఏది చేసినా అన్నీ ఇంట్లోనే, అడుగు బయట పెట్టడానికి లేదు. మరి కాలుకాలిన పిల్లిలా ఒక చోట కుదురుగా ఉండలేని యువతకు ఇది పెద్ద కష్టమే. కానీ కష్టాన్ని కూడా పోగొట్టి చిన్నా పెద్ద అందరికీ కాలక్షేపాన్నిస్తోంది టిక్‌టాక్. ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్‌తో నిత్యనూతనంగా కనిపించే ఈ యాప్ ఈసారి ఏకంగా కరోనా వైరస్ మీదే పడింది. అవును, టిక్‌టాక్ యూజర్లు ఇంట్లోనే వీడియోలు చేయడానికి కారణం కరోనానే కదా! అందుకే "గో కరోనా గో.." అంటూ దాన్ని భయపెట్టారు. "మమ్మల్ని ఆదుకునేందుకు డాక్టర్లు, పోలీసులు ఉన్నారం"టూ వీడియోలతో వివరించి చెప్పారు. అయినా ఇంకా దాని ప్రతాపం తగ్గట్లేదేంటీ చెప్మా! అని డౌట్ వచ్చి కరోనాతోనే సమాధానం కక్కించాలని దాన్ని ఇంటర్వ్యూ చేశారు. (కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్)
ఇక్కడ కరోనా వైరస్‌గా కనిపించేది కూడా టిక్‌టాక్ యూజర్లే అన్న విషయాన్ని గమనించగలరు. ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఆ కరోనా.. తన ఇంటి పేరు వైరస్ అని, ముద్దుగా కోవిడ్ అని పిలుచుకుంటారని చెప్పుకొస్తోంది. పనిలో పనిగా తనకు వయసు 19 అని చెప్పుకొచ్చింది. తన తల్లి పేరు చైనా అని తెలిపింది. తనకో బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నారట. ఎవరనుకునేరూ.. అత్యధిక కరోనా కేసులతో ప్రపంచంలోనే ముందు వరుసలో ఉన్న అమెరికా. అయితే ఈ దేశం కన్నా ముందు ఇద్దరు ముగ్గుర్ని కూడా వలలో వేసుకుందట. అవే ఇటలీ, ఇరాన్, స్పెయిన్. ఇన్ని దేశాలు తన లిస్టులో ఉన్నా తనకో క్రష్ ఉందని, అది భారత్ అని సిగ్గులు గుమ్మరిస్తోంది. ఇంకేముందీ.. టిక్‌టాక్ యూజర్లు ఈ ఇంటర్వ్యూకు బాగా కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ఇలాంటి వీడియోలు బోలెడు లైకులతో దూసుకుపోతున్నాయి. (కరోనా నేర్పుతున్న పాఠం)
Comments
Please login to add a commentAdd a comment