రోజురోజుకీ యువతకు టిక్‌టాక్‌పై ఆసక్తి పెరుగుతుందే తప్ప మోజు తీరట్లేదు. లైకుల కోసం వ్యూస్ కోసం నానాపాట్లు పడేవారు కొందరైతే, ఒక్కసారి టిక్‌టాక్ స్టార్ అన్న ముద్ర పడిపోయాక ఏం చేయకపోయినా లక్షల్లో వ్యూస్‌లు, లైకులు తెచ్చుకునేవారు మరికొందరు. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే లాక్‌డౌన్ వల్ల ప్రేమికుల హంగామా టిక్‌టాక్‌లో బొత్తిగా తగ్గిపోయింది. దీంతో వినోదం పంచేందుకు భార్యాభర్తలు రెడీ అవుతున్నారు. వారి కొత్త కాన్సెప్టులు, క్రియేటివిటీలకు జనాలు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ క్రమంలో మైకేల్ అనే వ్యక్తి తన అర్ధాంగి కోసం జీవితంలో మర్చిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. సినిమాలు, షికార్లు గట్రా లేనందున తన భార్య కోసం ఇంటినే థియేటర్‌గా మార్చేశాడు. (‘జోక్ చేస్తున్నారు అనుకున్నాం.. కానీ’)
ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు బయట ఉన్న భార్య మోరిసా దగ్గరకు వెళ్లి 'థియేటర్‌కు వెళ్దామా?' అని అడుగుతాడు. అందుకు ఆశ్చర్యపోయిన ఆమె 'అదేంటీ? అవన్నీ మూసివేశారు కదా?' అని ప్రశ్నిస్తుంది. ఇంతలో టికెట్ అని రాసిన కాగితాన్నిఆమె చేతిలో పెడతాడు. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించేపుడు టికెట్ తనిఖీ చేస్తారు. అనంతరం అక్కడున్న వ్యక్తి పాప్‌కార్న్ అమ్మగా దాన్ని తీసుకుని మెట్లపై నుంచి నడుచుకుంటూ నేరుగా థియేటర్ రూమ్ అదే గదిలోకి వెళ్తారు. లైట్లతో జిగేల్‌మంటున్న గదిలో కలిసి సినిమా చూస్తారు. ఈ వీడియో ఆరున్నర మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీనిపై నెటిజన్లు అద్భుతమంటూ కామెంట్లు చేస్తున్నారు. నాకు ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి అని ఓ అమ్మాయి ముచ్చటపడుతూ కామెంట్ చేసింది. (పాపం! ఏదో అనుకుంది: ఇంకేదో అయ్యింది)
Comments
Please login to add a commentAdd a comment