ఉద్యోగాలు ఫుల్... అభ్యర్థులు నిల్! | Tiny rural New Zealand town with more JOBS than people | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు ఫుల్... అభ్యర్థులు నిల్!

Published Sun, Jul 3 2016 5:13 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

ఉద్యోగాలు ఫుల్... అభ్యర్థులు నిల్!

ఉద్యోగాలు ఫుల్... అభ్యర్థులు నిల్!

ప్రపంచమంతా నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే.. న్యూజిలాండ్‌లోని ఓ పట్టణం వింత సమస్యను ఎదుర్కొంటుంది. ఆ ప్రాంతంలో ఉద్యోగాలు ఫుల్‌గా ఉన్నా అభ్యర్థులు దొరక్క అవస్థలు పడుతోంది. ఉద్యోగాలు చేసేవారు లేక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం ఎదురు చూస్తోంది న్యూజిలాండ్‌లోని క్లుతా జిల్లాలోని కైటంగట అనే మారుమూల పట్టణం. నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ప్రపంచంలోని అనేక దేశాల ప్రభుత్వాలు తలలు పట్టుకుంటుంటే.. అక్కడి ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పట్టణంలో కేవలం 800 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. ఇక్కడ డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పరిశ్రమల్లోనే ఉద్యోగాలు ఎక్కువగా ఉండడం, మారుమూల ప్రాంతం కావడంతో ఉద్యోగార్థులు వెనుకాడుతున్నారని ఆ ప్రాంత మేయర్ చెప్తున్నారు. ఉద్యోగం చేస్తామని ముందుకొచ్చేవారికి ఇల్లు, స్థలం, అధిక వేతనాలు లాంటి బంపర్ ఆఫర్లు ఇస్తామన్నా అభ్యర్థుల నుంచి ఏమ్రాతం స్పందన కనిపించట్లేదట.

అంతే కాదండోయ్ ఈ పట్టణానికి మరో ప్రత్యేకత ఉందట.. ఇక్కడ ఇళ్లకు ఎవరూ తాళాలు వేసుకోర ట, ఇదో ఓల్డ్ ష్యాషన్ కమ్యూనిటీ అని ఇక్కడే డైరీలో పనిచేసే మూడోతరం వ్యక్తి ఎవాన్ అంటున్నారు. ఉద్యోగాలు కావాలన్నా దొరకని నేటి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగాలిస్తాం రండి బాబూ.. అంటూ అభ్యర్థుల కోసం పడిగాపులు పడటం నిజంగా ఆశ్చర్యకరమే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement