లాస్ ఏంజిల్స్ : రైల్వే ట్రాక్ దాటుతున్న కారును రైలు వేగంగా వచ్చి ఈడ్చుకెళ్లిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో కారును రైలు ఈడ్చుకెళ్లిన దృశ్యం చూస్తే ఎవరికైనా భయం కలగాల్సిందే... అయితే ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయినా డ్రైవర్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడటం విశేషం. ఈ ఘటన లాస్ ఏంజిల్స్‌లో చోటుచేసుకుంది. కాగా ఈ సన్నివేశం మొత్తం అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్ వద్ద గేటు లేకపోతే జరిగే ప్రమాదం ఎలా ఉంటుందనడానికి ఇదే ఉదాహరణ. దీనిని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తమ అధికారిక ట్విటర్‌లో షేర్ చేశారు.
ఆ వీడియాలో కారు రైల్వే క్రాసింగ్ దగ్గరకు మెల్లిగానే వచ్చినట్లు తెలుస్తుంది. అయితే గేట్ లేకపోవడంతో మొదటి లెవల్ క్రాసింగ్ వద్దకు రాగానే రైలు వస్తుందో లేదో గమనించి కారును ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో ఒక రైలు వేగంగా వచ్చి కారును ఈడ్చుకెళ్లింది. ' ఈ ఘటనను మేం అస్సలు ఊహించలేదు. ప్రమాదంలో కారు మొత్తం నుజ్జయినా డ్రైవర్ మాత్రం చిన్న గాయాలతో బయటపడడం అదృష్టమనే చెప్పాలి. కానీ ఈ సన్నివేశం అందరికి ఒక గుణపాఠం కావాలి. రైల్వే గేటు లేకున్నా.. సిగ్నల్స్, రైలు వస్తుంది..లేనిది గమనించి వెళితే బాగుంటుంది. అనవసర రిస్క్‌లు తీసుకుంటూ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు' అంటూ పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కారు డ్రైవర్‌దే తప్పు ఉందంటూ.. రైలు వస్తుందో..లేదో గమనించి వెళితే బాగుండేదని కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment