వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తుల విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమ దేశంలోనే ఉత్పత్తులను తయారు చేయాలంటూ కొన్నాళ్ల క్రితం అల్టీమేటం జారీ చేసిన ఆయన.. డ్రాగన్ కంట్రీతో వాణిజ్య వ్యవహారాలను సమీక్ష దిశగా అడుగులు వేశారు కూడా. అయితే ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గినట్లు అనిపిస్తోంది.
చైనా-అమెరికా ఇరుదేశాల వాణిజ్య ఒప్పందాల మూలంగా వర్తక లోటు చాలా భయంకరంగా ఉందని ట్రంప్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. బుధవారం కేబినెట్ అధికారులతో సమావేశం అయిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఒక్క చైనాతోనే కాదు.. దాదాపు ప్రతీ దేశం విషయంలోనే ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొందని ట్రంప్ పేర్కొన్నారంట. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. దీంతో వర్తక ఒప్పందాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పొరుగుదేశాలు కెనడా, మెక్సికోలతో చేసుకున్న ఎన్‌ఏఎఫ్‌టీఏ ఒప్పందం సవరించాల్సిన అవసరం ఉందని, అలా కానీ పక్షంలో ఒప్పందం నుంచి బయటకు వచ్చేయాలని ట్రంప్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
వీసా విధానం మరింత కఠినతరం...
న్యూయార్క్ ట్రక్కు ఉగ్రదాడి ప్రస్తావన ట్రంప్ భేటీలో తెచ్చారు. పాదచారులు, స్కూలు పిల్లలపై దారుణాది దారుణంగా ఉగ్రదాడికి పాల్పడిన వాడు సభ్య సమాజంలో నివసించేందుకు తగిన వ్యక్తి కాదని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాదిని క్వూబాలో ఉన్న గ్వాంటనామా బే జైలుకు తరలిస్తామని చెప్పారు.
వాడిక జీవితాంతం జైల్లోనే ఉంటాడు అని ట్రంప్ తెలిపారు. వలస విధానమే మంచిదని, ఏ దేశం నుంచి పడితే ఆ దేశం నుంచి వచ్చిన వారికి అనుమతులు, వీసాలు ఇస్తూ పోతుంటే, ఇటువంటి అనర్థాలే జరుగుతాయన్నారు. వీసా విధానాన్ని మరింత కఠినం చేసి తీరుతామని, అమెరికాను సురక్షితంగా చేయడమే తన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment