![Trump reimposes sanctions on Iran - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/7/trumnp.jpg.webp?itok=NZ0zJ6WB)
వాషింగ్టన్: అణు ఒప్పందాన్ని అనుసరించి ఇరాన్‌పై అమెరికా 2015లో ఎత్తేసిన ఆంక్షలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి సోమ విధించారు. మంగళవారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో ఇరాన్–అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని ట్రంప్ ఈ ఏడాది మే నెలలోనే రద్దు చేయడం తెలిసిందే.
మరింత సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆంక్షలను తొలగించేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికా తాజాగా విధించిన ఆంక్షల ప్రభావం భారత్ వంటి పలు దేశాలపై తీవ్రంగా ఉండనుంది. అమెరికా తాజా నిర్ణయంతో ఆటోమొబైల్ రంగం, బంగారం సహ ఇతర విలువైన లోహాలు, ముడి చమురు తదితరాల్లో ఇరాన్‌తో ఇతర దేశాలు వ్యాపారాన్ని నిలిపేయడమో తగ్గించుకోవడమో చేసుకోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment