ట్రంప్ నా చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుని.. | trump unwanted sexual advance with me, says Karena Virginia | Sakshi
Sakshi News home page

ట్రంప్ నా చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుని..

Published Fri, Oct 21 2016 8:40 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

ట్రంప్ నా చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుని.. - Sakshi

ట్రంప్ నా చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుని..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఘట్టం ఫైనల్ రౌండ్, థర్డ్ డిబేట్ ముగిసిన తర్వాత కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది మహిళలు ట్రంప్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించగా.. తాజాగా ఓ యోగా ట్రైనర్ కరెనా వర్జీనియా(45) ట్రంప్ ప్రవర్తనపై తీవ్రంగా విమర్శించింది. పద్దెనిమిది ఏళ్ల కిందట(1998లో) యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్లేయర్స్ కు ట్రైనర్ గా పనిచేయగా.. ఆ సమయంలో ట్రంప్ తనను చూసి అసభ్య కామెంట్లు చేశాడని, ఆపై తన వ్యక్తిగత అవయవాలను హద్దుమీరి తాకాడని వర్జీనియా మండిపడింది.

 'తొలుత ఓ వ్యక్తితో ట్రంప్ మాట్లాడుతూ.. ఆమెను చూడు.. గతంలో ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. ఓసారి ఆమె కాళ్లను గమనించు అని కామెంట్ చేశారు. ఆపై నా చేతి పట్టుకుని నన్ను గట్టిగా దగ్గరకు లాక్కుని వ్యక్తిగత అవయవాలను బలవంతంగా టచ్ చేశాడు' అంటూ వర్జీనియా పేర్కొంది. అప్పుడు తన వయసు 27 ఏళ్లు అని.. ఆ సమయంలో తాను నిస్సహాయురాలిగా ఉండిపోయానని, షార్ట్ డ్రెస్ తో పాటు హై హీల్స్ వేసుకోవడంతో సరిగ్గా స్పందించకలేక పోయానని ఆవేదన వ్యక్తంచేసింది.

అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ మద్ధతుదారులు మాత్రం యోగా ట్రైనర్ వర్జీనియా చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ పై మహిళలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement