ట్రంప్‌పై నెటిజన్ల కుళ్లు జోక్స్‌ | Twitter Says Trump Unable to Close Umbrella  | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 30 2018 1:15 PM | Last Updated on Tue, Oct 30 2018 1:19 PM

Twitter Says Trump Unable to Close Umbrella  - Sakshi

గొడుగు వదిలేస్తున్న ట్రంప్‌

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై సోషల్‌ మీడియాలో కుళ్లు జోకులు పేలుతున్నాయి. వింత చర్యలతో నెటిజన్లకు టార్గెట్‌గా మారే ట్రంప్‌ మరోసారి నవ్వులపాలయ్యారు. ఇల్లినాయిస్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరడానికి సిద్దమైన ట్రంప్‌.. వర్షం కురువడంతో గొడుగు పట్టుకుని విమానం మెట్లు ఎక్కారు. అయితే విమానంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన ఆయనకు గొడుగు ఎలా మూయాలో తెలియలేదు. దీంతో దాన్ని అక్కడే వదిలేసి లోపలికి వెళ్లారు. (చదవండి: అద్భుతం సృష్టించిన నాసా)

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను సాకుగా చూపిస్తూ నెటిజన్లు ట్రంప్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘అవ్వా.. ట్రంప్‌కు గొడుగు మూయడం కూడా తెలీదు’  అని ఒకరు.. ఇది నమ్మశక్యంగా లేదని, అతనికి ఆ సమయం కూడా లేదని మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కనీసం టాయిలెట్‌ ఫ్లష్‌ ఉపయోగించడమన్న తెలుసా? లేదా? అని ట్రోల్‌ చేస్తున్నారు.  ఇటీవల విమాన మెట్లు ఎక్కుతుండగా టాయిలెట్‌ పేపర్‌తో ట్రంప్‌ ఇబ్బంది పడటం.. ఆ వీడియో వైరల్‌ కావడం తెలిసిందే. (చదవండి: ఇండియన్‌ టెకీ దంపతుల దుర్మరణం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement