
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తూ రూపొందించిన బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. హెచ్ 1–బీ వీసాదారుల కనీస వార్షిక వేతనాన్ని 60 వేల డాలర్ల నుంచి 90 వేల డాలర్లకు పెంచడంతో పాటు అనేక నిబంధనల్ని ఈ బిల్లులో చేర్చారు. ‘ద ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్(హెచ్‌ఆర్ 170)’గా పేర్కొనే ఈ బిల్లును బుధవారం ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషి యరీ కమిటీ ఆమోదించింది. దీనిని ఆమోదం కోసం కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనున్నారు.. ఈ బిల్లును సెనెట్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఉభయ సభలు ఆమోదించాక అధ్యక్షుడు ట్రంప్ సంతకంతో ఇది చట్టంగా అమల్లోకి వస్తుంది. హెచ్‌ఆర్ 170 చట్టంగా మారితే అమెరికా వ్యాపారాలకు నష్టం తప్పదని, వేలాది ఉద్యోగులకు ముప్పని నాస్కాం అధ్యక్షుడు చంద్రశేఖర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment