బిడ్డను కారులో వదిలి క్లబ్కు వెళ్లి..
Published Wed, Apr 6 2016 8:40 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM
లాస్ ఏంజిల్స్: తొమ్మిది నెలల పసికందును కారులో వదలిపెట్టి యూత్ క్లబ్కు వెళ్లిన కాలిఫోర్నియా యువకుడికి లాస్ ఏంజెల్స్ కోర్టు ఆరు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అవిన్ డార్జిన్ (24) మార్చి నెలలో తన బిడ్డను కారులో వదిలి క్లబ్లో డాన్స్ చేయడానికి వెళ్లిపోయాడు. కొంతసేపటికి బిడ్డ ఏడుపు వినిపిస్తుండటంతో క్లబ్లో పనిచేసే సిబ్బంది బిడ్డని కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అప్పటికే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన బిడ్డను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. క్లబ్ మేనేజర్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుషారుగా డాన్స్ చేస్తున్న డార్జిన్ను అరెస్టు చేశారు. నిందితుడికి బాలల హక్కుల చట్టం కింద కోర్టు శిక్షను విధించింది.
Advertisement
Advertisement