వాషింగ్టన్: అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల్లో ఏకంగా 71,787 కేసులు నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత నాలుగైదు రోజులుగా రోజుకి కొత్తగా 60 వేలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్, అలస్కా, జార్జియా, లూసియానా, మోంటానా, ఓహియో, ఉటా, విస్కాన్సిన్ రాష్ట్రాలు కోవిడ్ హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. కేసుల తీవ్రత ఇలాగే కొనసాగితే రోజుకి లక్ష కేసులు నమోదయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్న అంచనాలున్నాయి. కోవిడ్ హాట్‌జోన్‌గా మారిన టెక్సాస్‌లో ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటివి పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబెటో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు ఇలాగే నమోదైతే మళ్లీ ఆంక్షలు తప్పనవి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment