రష్యా పుండుపై అమెరికా కారం!
వాషింగ్టన్: అగ్ర రాజ్యాలు పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఓ పక్క దెబ్బ తిన్న రష్యా ఆగ్రహంతో కూడిన ప్రకటనలు చేస్తుండగా పుండుమీద కారం చల్లిన తీరుగా అమెరికా వ్యవహరిస్తోంది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కోసమే తమ యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చి వేసిందని, ఆ సంస్థతో దొంగచాటుగా ఆయిల్ వ్యాపారం చేస్తుందని రష్యా ప్రకటనలు చేయగా.. అమెరికా మాత్రం ఆ మాటలను కొట్టి పారేసింది.
టర్కీ ఇస్లామిక్ స్టేట్ తో కలిసి ఆయిల్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. ' సరిహద్దు గుండా టర్కీ ఐఎస్ తో ఆయిల్ స్మగ్లింగ్ చేస్తుందంటున్న రష్యా మాటలను మేం నిర్మోహమాటంగా కొట్టి పారేస్తున్నాం' అని అమెరికా అంది. ఏం ఈ విషయంలో ప్రత్యేకంగా పరిశీలనలు జరిపామని, అలాంటివి ఉన్నట్లు కనీస ఆధారాలు కూడా లభ్యం కాలేదని చెప్పింది.