ఇండో-పాక్‌ ఉద్రిక్తత : పెద్దన్న సంప్రదింపులు | US Secretary Of State Mike Pompeo Held High Level Talks | Sakshi
Sakshi News home page

ఇండో-పాక్‌ ఉద్రిక్తత : పెద్దన్న సంప్రదింపులు

Published Wed, Mar 6 2019 10:11 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

US Secretary Of State Mike Pompeo Held High Level Talks - Sakshi

వాషింగ్టన్‌ : భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలతో వియత్నాంలో గత వారం జరిగిన హనోయ్‌ సదస్సు వేదికగా అమెరికా సంప్రదింపులు జరిపింది. భారత్‌, పాకిస్తాన్‌ ప్రతినిధులతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ప్రైవేట్‌ దౌత్య చర్చలు సాగించినట్టు వెల్లడైంది. చర్చల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ పాల్గొన్నారు.

భారత్‌, పాకిస్తాన్‌లతో పాంపియో నేరుగా దౌత్య సంప్రదింపులు జరిపి, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేలా కీలకంగా వ్యవహరించారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి రాబర్ట్‌ పలాడినో తెలిపారు. ఇరు దేశాల నాయకులతో పాంపియో చర్చలు జరిపారని పేర్కొన్నారు. మరోవైపు భారత గగనతలంపై పాకిస్తాన్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని ఉపయోగించడం పట్ల ట్రంప్‌ యంత్రాగం తీవ్రంగా పరిశీలిస్తోందని, ఈ విమానాల వాడకం పరిమితిపై విక్రయ ఒప్పందంలో పొందుపరిచిన నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీస్తోందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

కాగా, ఎఫ్‌ 16 విమానాలను పాక్‌ ప్రయోగించడంపై నివేదికలను తాము తీవ్రంగా పరిశీలిస్తున్నామని రాబర్ట్‌ స్పష్టం చేశారు. కాగా పుల్వామాలో జైషే ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన నేపథ్యంలో భారత్‌ పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడంతో భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement