డ్రోన్ దాడుల్లో 80 వేలమందిపైగా మృతి
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని అణిచివేసే చర్యల్లో భాగంగా అమెరికా పాకిస్థాన్లో డ్రోన్ ద్వారా జరిపిన బాంబు దాడుల్లో గత పదేళ్లలో 80 వేలమంది చనిపోయినట్లు ఓ నివేదిక తెలిపింది. వారిలో 48వేల మంది పౌరులు ఉన్నట్లు పేర్కొంది. ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ అనే సంస్థ 'బాడీ కౌంట్: క్యాజ్వాలిటీ ఫిగర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ వార్ అండ్ టెర్రర్' అనే పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు పేర్కొంది.
2004 నుంచి 2013మధ్య కాలంలో ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ఈకాలంలో అమెరికా డ్రోన్ల ద్వారా చేసిన దాడులు.. ప్రతిగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మొత్తం 81,325 నుంచి 81,860 మంది చనిపోయారని వారిలో 48,504 పౌరులు ఉండగా వారిలో 45 మంది పత్రికా విలేకరులు ఉన్నారని నివేదిక వెల్లడించింది. అలాగే, 26,862 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. 5,498 మంది రక్షణ దళ అధికారులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.