Top Stories
ప్రధాన వార్తలు
బాబే మొదటి ముద్దాయి: వైఎస్ జగన్
వైష్ణవులందరికీ మార్గదర్శకంగా నిలిచే ఆలయం తిరుమల. గతంలో లక్షలాది మంది భక్తులు వచ్చినా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగాం. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శాస్త్రం తెలియదు. ఆచరణలు తెలియవు. దేవుడిపై భయం లేదు. భక్తీ లేదు. భయమూ, భక్తి ఉన్న వాడెవడైనా తిరుమల శ్రీవారి ప్రసాదంపై ఇష్టమొచ్చినట్టుగా అబద్ధాలు చెప్పగలుగుతాడా? టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ముఖ్యమంత్రి అనేవాడు చేస్తాడా? ఈ ఘటనలో ముమ్మాటికీ చంద్రబాబే మొదటి ముద్దాయి.తొక్కిసలాట ఒక ప్రాంతంలో జరగలేదు. రకరకాల ప్రదేశాల్లో జరిగింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ లేకపోవడం, కనీస ఏర్పాట్లు లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంబులెన్స్‌లను ప్రోటోకాల్ ప్రకారం పెట్టాలన్న బాధ్యత కూడా లేదు. తొక్కిసలాట తర్వాత అంబులెన్స్ రావడానికి, క్షతగాత్రులను తీసుకెళ్లడానికి ముక్కాలు గంట (45 నిమిషాలు) పట్టిందని బాధితులు చెబుతున్నారు. అది కూడా అప్పుడొకటి.. అప్పుడొకటి వచ్చాయని చెప్పారు. కొంత మంది వాళ్లంతట వాళ్లే కిందా మీద పడి వచ్చామని చెప్పారు. మరికొంత మంది రోడ్డున పోయే వారి సాయంతో వచ్చామని చెబుతున్నారు. ఈ రకమైన పరిస్థితులుండడం ఎంత దారుణం? ఈ ఘటనకు చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, ఎస్పీ, కలెక్టర్.. బాధ్యత వహించాలి. ఇందులో వీరందరి తప్పు ఉంది. చంద్రబాబు నాయుడుకు ఈ పాపం తగలక మానదు. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశానంటూ దేవుడికి, భక్తులకు క్షమాపణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. సిన్సియార్టీ లేదు. చిత్తశుద్ధి అంతకంటే లేదు. తాను చేసిన తప్పును ఇంకొకరి మీద మోపడమే ఆయనకు తెలుసు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చనిపోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చరిత్రలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. టీటీడీ చరిత్రలో ఇది మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ఈ ఘటనలో ముమ్మాటికీ మొదటి ముద్దాయి చంద్రబాబేనని స్పష్టం చేశారు. తొక్కిసలాటలో గాయపడి, పద్మావతి మెడికల్ కాలేజ్ ఆస్పత్రి (స్విమ్స్)లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర టీటీడీలో ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలను అందరూ ఆలోచించాలన్నారు. తొక్కిసలాట ఘటనలో ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వచ్చాయని చెప్పారు. ‘మనం వైకుంఠ ఏకాదశిని ప్రతి ఏటా జరుపుకుంటాం. ఆ రోజు లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని తరలివస్తారు. 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. ఈ విషయాలన్నీ తెలిసీ.. ప్రభుత్వం ఎందుకు టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర భద్రత చర్యలు, ప్రొటోకాల్స్ పాటించలేదు? అసలు చంద్రబాబుకు 10న వైకుంఠ ఏకాదశి అని తెలుసు కదా? అయినా కూడా కుప్పంలో తన ప్రోగ్రాం పెట్టుకున్నాడు. 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలోనే ఉన్నారు. పోలీసు శాఖ మొత్తం ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కుప్పం తరలిపోయింది. 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన జరిగింది. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు, కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉందని తెలిసినప్పుడు పోలీసులు ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు? అందరూ చంద్రబాబు పర్యటనలో మునిగి పోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క సారిగా గేట్లు తెరవడంతో.. బైరాగిపట్టెడ కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులో ఉదయం 8 గంటల నుంచి భక్తులను గుంపుగా నిలబెట్టారు. రాత్రి 8.30 గంటలకు కౌంటర్ వద్దకు తీసుకొచ్చి గేట్లు తెరిచారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెబుతున్నారు. చీకట్లో.. పార్కులో నిలబెట్టిన భక్తులకు ఉదయం నుంచి ఏమైనా ఇచ్చారా? వచ్చిన భక్తులను వచ్చినట్టు ఎందుకు క్యూలైన్లలోకి పంపించలేదు? అన్ని సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. ఆయా సెంటర్లలో లైన్లలోకి పంపించడానికి పోలీసులు ఎక్కడా లేరు. అందుకే గుంపుగా నిలబెట్టి ఒకేసారి విడిచిపెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు పోలీసులు.. చంద్రబాబు దిక్కమాలిన అబద్ధాలు అడుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటన ఒక చోటే జరిగినట్టు చెబుతున్నారు. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయినట్టు, బైరాగిపట్టెడలో ఐదు మంది చనిపోనట్టు ఎఫ్ఐఆర్లలో నమోదైంది. ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడినప్పుడు వివిధ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటల్లో గాయపడినట్టు చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కుప్పంలో 6,7,8 తేదీల్లో ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. పోలీసులు మొత్తాన్ని తన దగ్గరకే పిలిపించుకున్నారు. తిరుపతిలో మాత్రం భక్తుల కోసం ప్రత్యామ్నాయ భద్రత ఏర్పాట్లను గాలికి వదిలేశారు. ఫలితంగా భారీ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేవుడి దయతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ప్రాణపాయం లేదు. రుయా, స్విమ్స్ ఆస్పత్రులను కలుపుకుంటే దాదాపు 50 నుంచి 60 మంది భక్తులు తొక్కిసలాటలో గాయపడినట్టు సమాచారం. ఒక్క స్విమ్స్‌లోనే 35 మంది ఉన్నట్టు తెలుస్తోంది. భక్తుల భద్రత, వసతులపై చిత్తశుద్ధి ఏదీ? మొట్టమొదటి సారిగా తిరుపతిలో ఇలాంటి దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇక్కడి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు, టీటీడీ పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత తెలియకుండా ప్రవర్తించారు. దశాబ్దాలుగా టీటీడీలో ప్రొటోకాల్స్ ఉన్నా, వీళ్లెవ్వరూ పట్టించుకోలేదు. తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత, వసతుల కల్పన గురించి ఆలోచించలేదు. ఉదయం 9 గంటలకు వస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. అక్కడ మనుషులు ఉన్నారని వీళ్లు పట్టించుకుంటే కదా! మా ప్రభుత్వంలో ఐదేళ్లలో గొప్పగా భక్తులకు దైవ దర్శన సేవలందించాం. అలాంటిది ఈ రోజు భక్తులను క్యూలో నిలబెట్టేవారు లేరు. వారి ఆకలి, దప్పికలను కూడా గాలికి వదిలేశారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి.. ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ ఉచిత వైద్యం అందించాలి. వారు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేటప్పుడు కనీసం రూ.5 లక్షలు అందించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి, దేవదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, ఎస్పీ, కలెక్టర్, రెవెన్యూ అధికారులు అందరూ బాధ్యత వహించాల్సిందే. మొత్తం పోలీసు శాఖను తిరుపతిలో లేకుండా చేసి.. పలచగా అక్కడక్కడా బందోబస్తు పెట్టి, భక్తుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారు⇒ గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న ఘతన ఈ చంద్రబాబుది కాదా? తన షూటింగ్ కోసం అందర్నీ ఒకచోట పెట్టాడు. షూటింగ్ బాగా రావాలని చెప్పి గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ⇒ తిరుపతి ఘటనలో జరిగిన వాస్తవాలు ప్రజలకు చెప్పకూడదని చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయాడంటే.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను నేను రాకముందే ఇక్కడ నుంచి షిప్ట్ చేసే కార్యక్రమం చేశారు. దీనికి మీరే సాక్ష్యం. గాయపడిన వారు చాలా మంది మేము పోము.. మా పరిస్థితి ఇంకా బాగోలేదు.. మమ్మల్ని ఎక్కడకు పంపిస్తారు.. మేము ఎందుకు పోవాలని బీష్మించుకొని ఆస్పత్రిలో ఉండిపోయారు.⇒ వారిని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేందుకు నా కాన్వాయ్‌ని పోలీసులు అడ్డగించారు. ట్రాఫిక్ పేరుతో నా కాన్వాయ్ ముందుకు కదలకుండా చేశారు. ఎస్పీకి ఒక మాట చెబుతున్నా.. చంద్రబాబుతో మీరంతా కుమ్మక్కై దారుణంగా వ్యవహరిస్తున్నారు. దేవుని విషయంలో కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారో పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎస్పీ నుంచి చంద్రబాబు వరకు ఆ దేవుడే గట్టిగా మొట్టికాయలు వేస్తాడు.చిన్న కేసుగా పక్కన పడేసే కుట్రభక్తులు మృతి చెందిన ఘటనపై ఎఫ్ఐఆర్లో పేలవమైన సెక్షన్లు నమోదు చేశారు. ఇందులో 194 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు పెట్టారు. దొమ్మీ జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లతో కేసు నమోదు చేస్తారా? ఇది ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఘటనా? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగితే.. 105 బీఎన్ఎస్ సెక్షన్ పెట్టాల్సింది పోయి.. కావాలని కేసును నీరు గార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటనను ఒక చిన్న కేసుగా.. తీసి పక్కన పడేసేందుకు దారుణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే.. వీళ్లకు అసలు మానవత్వం లేదు. చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలనే ఆలోచన అసలే లేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేసి టీటీడీ లడ్డూ విషయంలో ఒక అబద్ధాన్ని సృష్టించారు. దానికి రెక్కలు కట్టి తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్టపాలు చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇదే పెద్ద మనిషి తన చర్యలతో మరోసారి టీటీడీలో బ్లాక్ మార్కుగా నిలిచిపోయే ఘటనకు కారణమయ్యాడు. దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు సురక్షితంగా భగవంతుడి దర్శనం కల్పించడం. అందుకే క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్న విశిష్టత ఎక్కడా లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు టీటీడీలోకి అడుగుపెట్టాలంటే.. అది కూడా చంద్రబాబు లాంటి పాలకుడు ఉన్నప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయోనని చూపించారు.తప్పంతా చంద్రబాబుదే ⇒ చంద్రబాబు.. ఓ షో పుటప్ చేసి, చిన్న స్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ వారిని బదిలీ, సస్పెండ్ చేసే శిక్షలతో సరిపెట్టే కార్యక్రమం చేస్తుండటం బాధాకరం. ఈ ఘటనలో చంద్రబాబు చేసిన తప్పు కన్పించడం లేదా? 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలో పర్యటించ లేదా? పోలీసులందరినీ తన చుట్టూ పెట్టుకోలేదా? భక్తుల కోసం పోలీసుల కేటాయింపు లేకపోవడం వాస్తవం కాదా? జిల్లా ఎస్పీ.. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే తాపత్రయ పడ్డారే తప్ప, లక్షల మంది భక్తులకు సెక్యురిటీ కల్పించాలని ఆలోచించ లేదు. ఈ విషయంలో ఎస్పీది తప్పు కాదా? ⇒ కలెక్టర్‌ది కూడా తప్పు ఉంది. కనీసం అక్కడున్న వారిని క్యూలైన్లలో నిలబెట్టే కార్యక్రమంపై ప్రొటోకాల్ ప్రకారం ఆదేశాలు ఇచ్చేందుకు రివ్యూలు కూడా చేయక పోవడం తప్పు కాదా? కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. అక్కడకు వచ్చిన భక్తులకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. తినడానికి తిండి లేదు. ఇలా గంటల తరబడి భక్తులు పార్కుల్లో ఉండేలా చేశారు. అన్ని కౌంటర్ల వద్ద పోలీసులు లేకుండా చేయడంలో కలెక్టర్‌ది తప్పు కాదా?⇒ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంత మందిని ప్రవేశింప చేయాలనే నిర్ణయం తీసుకున్నది ఈవో, అదనపు ఈవో. వీరందరినీ అజమాయిషీ చేసేది టీటీడీ చైర్మన్. వీరందరిదీ తప్పు కాదా? టోకెన్ల జారీపై రివ్యూలు తీసుకోకుండా ఇంత మంది చావులకు కారణం మీరు కాదా? మొత్తానికి ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే.
హష్ మనీ కేసు: అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్
న్యూయార్క్: హష్ మనీ కేసులో ట్రంప్ నేరాన్ని కోర్టు నిర్థారించింది. జైలు శిక్ష, జరిమానా నుంచి ట్రంప్‌కు మినహాయింపునిచ్చింది. అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. ఆయనకు అన్‌కండిషనల్ డిశ్చార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలినప్పటికీ.. ఎటువంటి జైలు శిక్ష, జరిమానా ఎదుర్కోనవసరం లేదు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే.కాగా, అమెరికా రాజకీయ చరిత్రలో గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని వింత ఘట్టానికి న్యాయమూర్తి జువాన్ ఎం.మర్చన్ తెరలేపారు. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వ్యక్తిని శిక్షిస్తానంటూనే శిక్షాకాలం విధించబోనని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయడానికి సరిగ్గా పది రోజుల ముందు జనవరి పదో తేదీ ఉదయం 9.30 గంటలకు సంబంధిత తీర్పు చెప్తానని జడ్జి ప్రకటించారు.నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌కు అనైతిక నగదు చెల్లింపుల కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు పదో తేదీన శిక్ష ఖరారు చేస్తానని న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ కోర్టు జడ్జి వెల్లడించారు. ‘‘కారాగారంలో జైలుశిక్ష అనుభవించాల్సిన అవసరంలేకుండా ట్రంప్‌ను బేషరతుగా వదిలేస్తూ, కేసుకు ముగింపు పలుకుతూ తీర్పు రాస్తా. అన్‌కండీషనల్ డిశ్చార్జ్ తీర్పు వినేందుకు ట్రంప్ కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరవ్వాల్సి ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.ట్రంప్‌కు ఎలాంటి ప్రొబేషన్ పిరియడ్, జరిమానా విధించబోను’’అని జడ్జి చెప్పారు. గతంలో తనతో శృంగారం జరిపిన విషయం ఎవరికీ చెప్పకుండా దాచేందుకు స్టార్మీ డేనియల్‌కు ట్రంప్ తన లాయర్ ద్వారా 2016 ఏడాదిలో 1,30,000 డాలర్లు ఇచ్చారు. ఈ నగదును లెక్కల్లో తప్పుగా చూపారు. ఈమెకు నగదు ఇచి్చన విషయాన్ని దాచి ఆ నగదును ఎన్నికల జమా ఖర్చు కింద మార్చిరాశారు. ఈ అనైతిక చెల్లింపును ‘హష్ మనీ’గా పేర్కొంటారు.ఎన్నికల విరాళాలను ఇలా అక్రమంగా దుర్వినియోగం చేశారని ట్రంప్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో 34 అంశాల్లో ట్రంప్ దోషిగా తేలిన విషయం విదితమే. జూలై 11వ తేదీనే ట్రంప్ కేసు ముగింపుకొచ్చినా అధ్యక్షునిగా గెలిచిన వ్యక్తికి క్రిమినల్ కేసు విచారణ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ట్రంప్ న్యాయవాదులు ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవన్నీ చెల్లవంటూ న్యాయమూర్తి ఇవాళ తన తీర్పున వెలువరించారు.
కేటీఆర్‌పై మరో కేసు నమోదు
హైదరాబాద్: ఇప్పటికే ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై మరో కేసు నమోదైంది. నిన్న(గురువారం) ఏసీబీ(ACB) విచారణకు హాజరైన కేటీఆర్.. విచారణ ముగిసిన తర్వాత ర్యాలీగా వచ్చారు. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే కారణంతో కేటీఆర్‌పై నమోదైంది. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఏసీబీ విచారణ తర్వాత ఆ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకూ కేటీఆర్ ర్యాలీగా వచ్చారు. దీనిపైనే ఇప్పుడు కేసు నమోదైంది.తీవ్ర ఉత్కంఠ రేపిన కేటీఆర్ విచారణఏసీబీ విచారణకు కేటీఆర్ విచారణకు హాజరైన క్రమంలో తీవ్ర ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో విచారణ తర్వాత ఆయన తిరిగి వచ్చేవరకూ ఉత్కంఠ కొనసాగింది. విచారణ ముగించుకుని కేటీఆర్ బయటకు వస్తున్నారనే వార్తలు వచ్చిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.కేటీఆర్‌ను ఏసీబీ విచారించే క్రమంలో ముఖ్యనేతలంతా పార్టీ కార్యాలయంలోనే ఉండి చర్చల్లో మునిగితేలారు. గురువారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తును నందినగర్ నివాసానికి చేరుకుని ఏం జరుగుతుందో అనే అంశాన్ని నిశితంగా పరిశీలించారు.మరొకవైపు మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత నందినగర్ నుంచి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఇదీ కూడా చదవండి: ఇది తొలి పాడ్‌కాస్ట్.. కాస్త బెరుకుగా ఉంది: ప్రధాని మోదీ
స్పందించాల్సిన అవసరం లేదు.. పవన్‌కు టీటీడీ ఛైర్మన్ కౌంటర్
సాక్షి, తిరుపతి: క్షమాపణలు చెప్పితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?.. ఎవరో ఏదో చెప్పారని మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) కౌంటర్ ఇచ్చారు.తొక్కిసలాట ఘటనకు టీటీడీ(TTD) ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు, పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు చోద్యం చూసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసుల వైఫల్యంపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదన్నారు.కాగా, తొక్కిసలాట ఘటనపై ఇవాళ పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు.. ఈవో, ఎఈవో ఘటనకు భాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి ఘటనలో తాను దోషిగా నిలబడాలా? అంటూ వ్యాఖ్యానించారు.మరోవైపు, టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య వార్ కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. పాలకమండలి సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఈవోపై సభ్యులు మండినట్లు సమాచారం.ఇదీ చదవండి: పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి: బొత్సవైకుంఠ ఏకాదశి ఏర్పాట్లుపై సమాచారం పాలకమండలికి టీటీడీ అధికారులు ఇవ్వలేదని.. సమన్వయ లోపం కారణంగానే భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదంటు ఈవోని సభ్యులు నిలదీశారు. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 2 నుండి 5 లక్షలు టీటీడీ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు కేటాయింపుపై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. వైకుంఠ త్రయోదశి తర్వాత టోకెన్ లేకుండా సర్వదర్శనానికి అనుమతించాలని పాలకమండలిలో చర్చ జరిగింది.
ఇది నా తొలి పాడ్‌కాస్ట్.. కాస్త బెరుకుగా ఉంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తాను మనిషినేనని, దేవుణ్ని కాదని, మనుషలంతా ఏదొక తప్పు చేసినట్లు తాను కూడా తప్పులు చేస్తూ ఉంటానని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలిపారు. డబ్యూటీఎఫ్ సిరీస్‌లో భాగంగా జిరోడా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్(Podcast)లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘ తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. నేను కూడా కొన్ని తప్పులు చేసుంటాను. నేను కూడా మనిషినే కదా.. దేవుణ్ని అయితే కాదు. మనిషిని కాబట్టే తప్పులు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.సర్.. నాది బ్యాడ్ హిందీపాడ్కాస్ట్ ఆరంభంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిఖిల్ కామత్ మాట్లాడుతూ.. తనది ‘బ్యాడ్ హిందీ’ అని, తన హిందీ భాష సరిగా లేకపోతే క్షమించమంటూ మోదీకి విన్నవించాడు. ‘ నేను సౌత్ ఇండియన్. నేను ఎక్కువగా బెంగళూర్‌లో పెరిగాను. మా అమ్మది మైసూర్ కావడంతో అక్కడ వారంతా ఎక్కవగా కన్నడ మాట్లాడతారు. తండ్రిదేమో మంగళూరు. నేను స్కూల్లో హిందీ నేర్చుకున్నాను. కానీ భాషపై పట్టు సరిగా లేదు’ అని మోదీకి చెప్పారు నిఖిల్ కామత్.ఏం ఫర్లేదు.. ఇద్దరం కలిసి మేనేజ్ చేద్దాంమనమిద్దరం కలిసి మేనేజ్ చేద్దాం. నేను నీ ముందే కూర్చొని మాట్లాడం నాకు కాస్త బెరుకుగా ఉంది. ఇది నాకు ఒక కఠినమైన పరీక్ష. ఎందుకంటే ఇదే నా తొలి పాడ్‌కాస్ట్. ఇది ప్రజల్లోకి ఎలా వెళుతుందో అనేది నాకు తెలియదు’ అని మోదీ పేర్కొన్నారు.సుమారు రెండు గంటల పాటు సాగిన పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. తన బాల్యం, విద్య, రాజకీయం తదితర విషయాలను మోదీ షేర్ చేసుకున్నారు. తన కుటుంబ సభ్యుల మొత్తం దుస్తుల్ని తానే ఉతికేవాడినన్నారు. ఎందుకంటే ఊరి చెరువు దగ్గరకు వెళ్లడానికి మా వాళ్లు నాకు అనుమతి ఇచ్చారు కాబట్టి(నవ్వుతూ).. దుస్తులు ఉతికే బాద్యత తీసుకునేవాడినన్నారు.ఈ వీడియోను ప్రధాని మోదీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీన్ని అంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తు న్నట్లు మోదీ పేర్కొన్నారు. ‘ఈ పాడ్‌కాస్ట్‌ను మేము ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశామని, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని వీడియో కింద మోదీ కామెంట్ చేశారు.An enjoyable conversation with @nikhilkamathcio, covering various subjects. Do watch... https://t.co/5Q2RltbnRW— Narendra Modi (@narendramodi) January 10, 2025 ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ
గేమ్ ఛేంజర్ రిలీజ్.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సినిమాకు చాలామంది ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉందన్నారు. అప్పన్న, రామ్ నందన్ పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా చేశారని తనయుడిని కొనియాడారు. ఈ సందర్భంగా సక్సెస్ సాధించిన గేమ్ ఛేంజర్ చిత్రబృందానికి ఆయన అభినందనలు తెలిపారు. గొప్ప సినిమాను అందించిన దర్శకుడు శంకర్‌తో పాటు దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే.. మరికొందరేమో ఫర్వాలేదని కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.Delighted to see lots of appreciation for @AlwaysRamCharan who excels as Appanna ,the righteous ideologue & Ram Nandan, the determined IAS officer out to cleanse the system. Hearty Congrats to @iam_SJSuryah @advani_kiara @yoursanjali ,Producer #DilRaju @SVC_Official , above…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 10, 2025 నాలుగు పాటలకే రూ.75 కోట్లు..ఈ చిత్రంలోనే నాలుగు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పోస్ట్ చేశారు. కేవలం పాటలకే ఇంత భారీ బడ్జెట్ ఖర్చు చేయడంపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. అందువల్లే ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సినిమా రిలీజ్‌కు ముందే గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. మొదటి సాంగ్ జరగండి.. జరగండి అనే పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు 13 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఈ సాంగ్‌లో విజువల్స్ ఫ్యాన్స్‌ను అలరించాయి.గేమ్ ఛేంజర్ కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నెల కరెంట్ బిల్ రూ.200 కోట్లు: దెబ్బకు ఫ్యూజులు అవుట్
సాధారణంగా నెలకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మహా అయితే వేల రూపాయలోనే ఉంటుంది, కదా. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ వ్యక్తికి కరెంట్ బిల్ ఏకంగా రూ.200 కోట్ల కంటే ఎక్కువే వచ్చింది. కరెంట్ బిల్ ఏమిటి? రూ.200 కోట్లు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదివేయాల్సిందే..హిమాచల్‌ప్రదేశ్‌లోని బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన 'లలిత్ ధీమాన్' అనే వ్యాపారవేత్త.. తనకు వచ్చిన ఎలక్ట్రిక్ బిల్ చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన కరెంట్ బిల్ ఏకంగా రూ. 2,10,42,08,405. ఇప్పటి వరకు ఇంత కరెంట్ బిల్ బహుశా ఏ ఒక్కరికీ వచ్చి ఉండదు.రూ.2,10,42,08,405 కరెంట్ బిల్ రావడానికి ముందు నెలలో 'లలిత్ ధీమాన్'కు వచ్చిన బిల్లు రూ.2,500 మాత్రమే. భారీ మొత్తంతో కరెంట్ బిల్ రావడంతో అతడు ఫిర్యాదు చేసేందుకు విద్యుత్ బోర్డును సందర్శించాడు. సాంకేతిక లోపం వల్లనే ఈ బిల్లు వచ్చిందని.. విద్యుత్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత అతనికి సరైన కరెంట్ బిల్ ఇచ్చారు. నిజానికి అతనికి వచ్చిన కరెంట్ బిల్ రూ.4047 మాత్రమే.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!సాంకేతిక లోపాల వల్ల భారీ బిల్లులు రావడం ఇదే మొదటి సారి కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి 1,540 రూపాయల కరెంట్ బిల్ వస్తే.. విద్యుత్ శాఖ నుంచి 86 లక్షల రూపాయలకు పైగా బిల్లును స్వీకరించాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించి ఆయనకు సరైన బిల్ ఇచ్చారు.
అన్నేసి గంటలు పనిచేస్తే జరిగేది ఇదే!
భారత్‌లో పనిగంటల అంశం మరోసారి చర్చ తెర మీదకు వచ్చింది. ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారం మొత్తం మీద ఏకంగా 90 గంటలు పని చేయాల్సిందేనంటూ వ్యాఖ్యానించడం ఇందుకు కారణం. మొన్నీమధ్యే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి 70 గంటలు పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యం ‘అంతకుమించి’ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. ఈ దరిమిలా వీళ్లిద్దరి గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇంతకీ 70.. 90.. మనిషి శరీరం ఒక వారంలో అసలు ఎన్నేసి పనిగంటలను చేయగలదు?. ఏ మేర పని ఒత్తిడిని ఒక ఉద్యోగి భరించగలరు?. అలా గనుక పని చేస్తే.. శరీరంలో కలిగే మార్పులేంటి?. ఈ విషయంలో అసలు వైద్యులు ఏం చెబుతున్నారు?.. బిజినెస్ టైకూన్లు చెబుతున్న అంతటి పని భారం ఉద్యోగి మోయ తరమేనా?.. వారంలో 90 గంటలపని.. అంటే ఏడు రోజులపాటు 13 గంటల చొప్పున పని చేయాలన్నమాట. మిగిలిన 11 గంటల్లోనే నిద్ర, ఇతర పనులు, ప్రయాణాలు, ఆఖరికి కుటుంబ సభ్యులతో గడపడం లాంటి వాటితో సర్దుకుపోవాలన్నమాట. అయితే ఇది శారీరకంగానేకాదు.. మానసికంగానూ మనిషిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయం ప్రకారం.. వారంలో 55 గంటలకు మించి గనుక పని చేస్తే గుండె జబ్బుల బారినపడే అవకాశం ఉంటుందట. అలా పనిచేసే ఉద్యోగుల్లో వందలో 35 మంది స్ట్రోక్ బారినపడే అవకాశం ఉంది. వందలో 17 మంది ప్రాణమే పొగొట్టుకునే అవకాశం ఉంది అని ఆ స్టడీ వెల్లడించింది. ‘‘ఎక్కువసేపు పని చేయడమంటే గుండె మీద ఒత్తిడి పెంచడమే. దీనివల్ల కోర్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. తద్వారా బీపీ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయి. అలా హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌తో పాటు హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వారానికి 40 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడడమో లేదంటే కుంచిచుపోతాయి’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. ఉద్యోగుల పని గంటలు తగ్గాల్సిందే!.. ఇక ఎక్కువ గంటలు పని చేయడం డయాబెటిస్‌కు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఇది రక్తంలో షుగర్ స్థాయిపై అనేక రకాలుగా ప్రభావం చూపెడుతుంది. మహిళలు 45 గంటలకంటే ఎక్కువసేపు పని చేసినా.. పురుషులు 53 గంటలకు మించి పని చేసినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు తెలిపాయి కూడా. ఇక చాలాసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఇది ఒబెసిటీ(స్థూలకాయం)కి దారి తీయొచ్చు. అన్నింటికి మించి.. విపరీతమైన పనిభారం మానసిక ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. ఇది బంధాలకు బీటలు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే.. విశ్రాంతి లేకుండా శరీరానికి పని చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. జీరో రెస్ట్ వర్క్.. నిద్రాహారాలను నిర్లక్ష్యం చేయిస్తుంది. పని ఒత్తిడి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతిమంగా.. అనారోగ్యకరమైన జీవనశైలి వైపునకు అడుగులు వేయిస్తుందని అంటున్నారు. భారతీయుల్లో ఇప్పటికే గుండె జబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో అధిక పని గంటల నిర్ణయాలతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వారానికి మొత్తం 40 గంటలే పని ఉండాలి!ఇన్ఫోసిస్ మూర్తి(78) ఏమన్నారంటే..ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలి.తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మరోసారి ఆయన స్పందిస్తూ..ఇన్ఫోసిస్(Infosys)ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?.ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం(64) ఏమన్నారంటే..ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పనిచేస్తున్నాను. అయినా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటలు పని చేయాలి. అందుకోసం ఆదివారం సెలవులనూ వదిలేయాలి. ఇదీ చదవండి: 104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి
‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ
టైటిల్ : గేమ్ ఛేంజర్‌నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, నాజర్ తదితరులునిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్కథ: కార్తీక్ సుబ్బరాజ్‌దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: ఎస్. శంకర్‌సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: తిరువిడుదల: జనవరి 10, 2025సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’(Game Chnager Review) నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్ ఛేంజర్’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..శంకర్(Shankar) అద్భుతమైన ఫిల్మ్ డైరెక్టర్. అందులో డౌటే లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్ తర్వాత శంకర్ మేకింగ్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్(Game Changer Review)పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో పాటు శంకర్ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కమ్‌బ్యాక్ అవుతుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన రొటీన్ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించాడు. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్ కొట్టదు. మదర్ సెంటిమెంట్, తండ్రి ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి.ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో వచ్చే లవ్‌ట్రాక్ ఆకట్టుకోకపోగా.. కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్ వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌కి ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడంతో ఆ సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. కలెక్టర్, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్ పెట్టడం ఆకట్టుకుంటుంది.ఇంటర్వెల్ సీన్ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్‌గా సాగుతుంది. మోపిదేవి, రామ్ నందన్ మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ వార్ బాగానే ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్‌ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.ఎవరెలా చేశారంటే..రామ్ చరణ్(Ram Charan) నటన ఏంటో ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్ నటనతో ఆకట్టుకున్నాడు. అప్పన్న, రామ్ నందన్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్, ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పొలిటిషీయన్ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు, చరణ్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ భావోధ్వేగానికి గురి చేస్తుంది. రామ్ నందన్ ప్రియురాలు దీపికగా కియరా అద్వానీ మెప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్, సైడ్ సత్యంగా సునీల్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్‌తో పాటు వెన్నెల కిశోర్‌ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్లో కనిపిస్తారు. జయరాం, నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్ మార్క్ గ్రాండ్‌నెస్ ప్రతి పాటలోనూ కనిపించింది. సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్(Fun Bucket Bhargav)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. టిక్ టాక్‌తో ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్.. వెబ్ సిరీస్‌లలో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి బాలికను మోసం చేశాడు. దీంతో విశాఖ పోక్సో కోర్టు.. భార్గవ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది.14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ను 2021లో పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్‌టాక్ వీడియోల పేరుతో బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదయ్యింది.విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇదీ చదవండి: పుష్ప భామ శ్రీవల్లికి గాయం.. అసలేం జరిగిందంటే?ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఏప్రిల్ 16, 2021న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగింది. బాలికను భార్గవ్.. చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు తేలింది. దీంతో ఇవాళ విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.ఇదీ చదవండి: అల్లు అరవింద్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన పుష్పరాజ్.. పోస్ట్ వైరల్
హష్ మనీ కేసు: అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్
ఓటీటీకి హ్యాపీ డేస్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హాలీడే ట్రిప్‌లో పాలక్ తివారీ.. ఖుషీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
తగిన జాగ్రత్తలతో హెచ్ఎంపీవీ దూరం
ఎగ్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా - నెలపాటు గుడ్లు ఫ్రెష్
కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
గేమ్ ఛేంజర్ రిలీజ్.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
నెల కరెంట్ బిల్ రూ.200 కోట్లు: దెబ్బకు ఫ్యూజులు అవుట్
హరీష్‌ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్
మెరిసిపోతున్న సితార ఘట్టమనేని.. అక్కినేని కోడలు శోభిత న్యూ లుక్..!
‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ
‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ
తిరుపతి తొక్కిసలాట ఘటన - ఇద్ధరు అధికారులపై వేటు
కూటమి ఇంకా ఉందా?.. తెలియదే!
హ్యాట్రిక్ కొట్టిన పసిడి.. ఎగిసిన వెండి
ఈ రాశి వారికి కాంట్రాక్టులు లభిస్తాయి.. సంఘంలో గౌరవం..
Game Changer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇదేదో ముందే చెప్పొచ్చుగా!
బీఆర్ నాయుడే ముంచేశారు: అధికారుల సంచలన ఆరోపణలు
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
హష్ మనీ కేసు: అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్
ఓటీటీకి హ్యాపీ డేస్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హాలీడే ట్రిప్‌లో పాలక్ తివారీ.. ఖుషీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
తగిన జాగ్రత్తలతో హెచ్ఎంపీవీ దూరం
ఎగ్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా - నెలపాటు గుడ్లు ఫ్రెష్
కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
గేమ్ ఛేంజర్ రిలీజ్.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
నెల కరెంట్ బిల్ రూ.200 కోట్లు: దెబ్బకు ఫ్యూజులు అవుట్
హరీష్‌ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్
మెరిసిపోతున్న సితార ఘట్టమనేని.. అక్కినేని కోడలు శోభిత న్యూ లుక్..!
‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ
‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ
తిరుపతి తొక్కిసలాట ఘటన - ఇద్ధరు అధికారులపై వేటు
కూటమి ఇంకా ఉందా?.. తెలియదే!
హ్యాట్రిక్ కొట్టిన పసిడి.. ఎగిసిన వెండి
ఈ రాశి వారికి కాంట్రాక్టులు లభిస్తాయి.. సంఘంలో గౌరవం..
Game Changer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇదేదో ముందే చెప్పొచ్చుగా!
బీఆర్ నాయుడే ముంచేశారు: అధికారుల సంచలన ఆరోపణలు
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
సినిమా
దేశ సినీ చరిత్రలోనే మొదటిసారి.. ఆవిష్కరించిన రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశారు. మనదేశంలోనే మొట్టమొదటిసారి ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన డాల్బీ పోస్ట్ ప్రొడక్షన్(Dolby Technology)ను ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీలో ఇండియాలో ఇప్పటివరకు అందుబాటులో లేని డాల్బీ-సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. చిత్ర నిర్మాణంలో ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఆడియో, విజువల్ ఎఫెక్ట్స్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో సినిమాటిక్ అనుభూతిని కలిగించేలా సినిమాలను తెరకెక్కించనున్నారు. ఆడియన్స్‌కు సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. అది కూడా మన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించడం మరో విశేషం.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్ సమయంలో డాల్బీ విజన్‌లో సినిమాను అప్ గ్రేడ్ చేయాలనుకున్నా. కానీ ఆ టెక్నాలజీ మనదగ్గర లేదు. దాని కోసం మేము జర్మనీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. ఇది నాకు కొంత వరకు నిరుత్సాహానికి గురిచేసింది. నా సొంత దేశంలో నా సినిమాని డాల్బీ విజన్‌లో చూడలేకపోయానని నిరాశకు గురయ్యా. కానీ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ సదుపాయాన్ని చూసి థ్రిల్ అయ్యా. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే నా నెక్ట్స్ మూవీ విడుదలయ్యే సమయానికి భారతదేశం అంతటా బహుళ డాల్బీ సినిమాలు ఉంటాయి. డాల్బీ విజన్‌లో సినిమా చూడటం పూర్తిగా ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లోని కథనాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రేక్షకులు ఈ డాల్బీ సదుపాయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.అనంతరం నాగార్జున మాట్లాడుతూ..'వర్చువల్ ప్రొడక్షన్లో అగ్రగామిగా ఉండటం కోసం ఎల్లప్పుడు ముందుంటాం. దేశంలోనే మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సినిమాను వరల్డ్ మ్యాప్‌లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్ తన 50వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా డాల్బీని ఏర్పాటు చేయడం విశేషం. అత్యాధునికి టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలకు మరో ముందడుగు"అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్కు సంబంధించిన స్పెషల్ ఫుటేజ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రదర్శించారు.మహేశ్ బాబుతో రాజమౌళి..కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో జతకట్టనున్నారు మన జక్కన్న. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈనెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. జనవరి 2న హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది.హీరోయిన్‌పై చర్చ..కాగా.. మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై మరోవైపు రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అయింది.
పుష్ప భామకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!
పుష్ప భామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయాలైనట్లు సన్నిహితులు వెల్లడించారు. రష్మికను గాయాన్ని పరిశీలించిన వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం శ్రీవల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని సన్నిహిత వర్గాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.మరోవైపు సినిమాల విషయానికొస్తే.. పుష్ప-2 (Pushpa 2 The Rule) మూవీతో హిట్ కొట్టి శ్రీవల్లి.. బాలీవుడ్లో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా రష్మికకు గాయం కావడంతో ఈ మూవీ షూటింగ్ విరామం ప్రకటించారు. ఫుల్ యాక్షన్ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్లోనే థామా అనే చిత్రంలో కనిపించనున్నారు.తెలుగులో మరో మూడు చిత్రాలు..టాలీవుడ్లో ప్రస్తుతం కుబేర మూవీలో రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు. ఈ పాన్–ఇండియా మూవీని తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ కావాల్సిన కుబేర పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి బరిలో ఉంటుందని ఆడియన్స్ అంతా భావించారు. కానీ అలా జరగలేదు. మరి కొత్త ఏడాది ఫిబ్రవరిలోనైనా రిలీజ్ అవుతుందేమోనని ఆశిస్తున్నారు. అయితే కుబేర విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి..ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి గతేడాది దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు కొత్త ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్నా ఈ మూవీతో పాటు ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో కనిపించనుంది.
పుష్ప స్టైల్లో తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పిన ఐకాన్ స్టార్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. నాన్న అల్లు అరవింద్‌తో బన్నీ స్వయంగా కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలో బన్నీ భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్ కేక్ కట్ చేసిన ఫోటోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు బన్నీ. తాజాగా అలలు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.పుష్ప కా బాప్ అంటూ..ఈ పోస్ట్‌లో పుష్ప కా బాప్ అని రాసిన ఉన్న కేక్ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ కేక్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 జోరు..గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్‌పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈనెల 17 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..అయితే తాజాగా ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పుష్ప-2 ది రూల్ రీ లోడింగ్ వర్షన్ తేదీని మార్చారు. ముందుగా ఈనెల 11 నుంచే వస్తుందని ప్రకటించారు. కానీ ఆ డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల 11న పుష్ప-2 ఎక్స్ట్రా ఫైర్ చూడాలనుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. దంగల్ రికార్డ్‌పై గురి..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2', కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. ఈ లెక్కన చూస్కతే అమిర్ ఖాన్ దంగల్ మూవీ మాత్రమే పుష్ప-2 కంటే ముందుంది. ఈ మూవీ అదనపు సీన్స్ యాడ్ చేయడం చూస్తే దంగల్ రికార్డ్‌పైనే గురి పెట్టినట్లు తెలుస్తోంది.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. Happy Birthday Dad . Thank you for making our lives soo special with your gracious presence . pic.twitter.com/CgWYsbk2eF— Allu Arjun (@alluarjun) January 10, 2025
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు సీఎం మద్దతు.. !
బిగ్‌బాస్ రియాలిటీ షోకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఏ భాషలోనైనా ఈ షో పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల టాలీవుడ్‌లోనూ ఈ షో అత్యంత ప్రేక్షాదరణ దక్కించుకుంది. గతేడాది డిసెంబర్లో తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు.అయితే హిందీలోనూ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-18 నడుస్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షో దాదాపు చివరిదశకు చేరుకుంది. వచ్చే వారంలోనే బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ షోలో అరుణాచల్‌కు చెందిన చుమ్ దరాంగ్ అనే కంటెస్టెంట్ టాప్-9లో చోటు దక్కించుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ ఆమెకు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి చేసిన పోస్ట్‌ను కంటెస్టెంట్ తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది.ఈ రియాలిటీ షో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన చుమ్ దరాంగ్ టాప్-9లో నిలవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆమెకు ఓటు వేయాలని పౌరులకు సూచించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారుయ. కాగా.. బిగ్‌బాస్ సీజన్- 18 గ్రాండ్ ఫినాలే జనవరి 19న ప్రసారం కానుంది.ముఖ్యమంత్రి తన పోస్ట్‌లో రాస్తూ..'పాసిఘాట్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ కుమార్తె చుమ్ దరాంగ్ బిగ్‌బాస్ సీజన్-18 రియాల్టీ షోలో టాప్ 9లో చేరినందుకు సంతోషంగా ఉన్నా. ఆమెతో మీ అందరి మద్దతు కావాలి. ప్రతి ఒక్కరూ చుమ్కి ఓటు వేయడం మర్చిపోవద్దు. ఈ షోలో ఆమె విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావంతో ఉన్నాను. ఈ సందర్భంగా చుమ్ దరాంగ్కి నా శుభాకాంక్షలు.' అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ట్విట్‌ను షేర్ చేసిన చుమ్ దరాంగ్ టీమ్ స్పందించింది. సీఎం పెమా ఖండుకు కృతజ్ఞతలు తెలిపింది.చుమ్ దరాంగ్ టీమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..“గౌరవనీయులైన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సర్.. తనకు మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె అసాధారణమైన ప్రయాణం ప్రతి అరుణాచల్ వ్యక్తిని.. అలాగే ఈశాన్య భారతదేశాన్ని ఎంతో గర్వించేలా చేసింది. ఆమె సాధించిన విజయాలు.. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం మన రాష్ట్ర ప్రతిభను హైలైట్ చేయడమే కాకుండా ప్రపంచ దృష్టికి తీసుకెళ్తాయి. చుమ్ దరాంగ్ లాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె విజయం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. మీ నాయకత్వం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడం కొనసాగుతూనే ఉంటుంది.' అంటూ రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by Chum Darang (@chum_darang)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఐర్లాండ్ మహిళా జట్టుతో తొలి వన్డేలోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. కేవలం 29 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు సాధించింది.ఈ క్రమంలో స్మతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మార్కు అందుకున్న తొలి మహిళా ప్లేయర్‌గా నిలిచింది. కాగా ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు వన్డేలు ఆడేందుకు ఐర్లాండ్ భారత్ పర్యటన(India Women vs Ireland Women)కు వచ్చింది.కెప్టెన్‌గా స్మృతిఈ సిరీస్‌కు భారత మహిళా జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరం కాగా స్మృతి సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా వన్డే సిరీస్ ఆరంభమైంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ గాబీ లూయిస్ అద్భుత అర్ధ శతకం(92)తో చెలరేగగా.. మిడిలార్డర్లో లీ పాల్(59) కూడా హాఫ్ సెంచరీ సాధించింది. వీరిద్దరికి తోడు లోయర్ ఆర్డర్లో అర్లెనె కెలీ 28 పరుగులతో రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. టైటస్ సాధు, దీప్ది శర్మ, సయాలీ సట్ఘరే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు వేల పరుగుల పూర్తిఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్(Pratika Rawal) శుభారంభం అందించారు. మంధాన 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్రేయా సార్జెంట్ బౌలింగ్‌లో ఓర్లా ప్రెండర్‌గాస్ట్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుటైంది. అయితే, ఈ క్రమంలోనే స్మృతి వన్డేల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించింది.ఇంతకు ముందు భారత్ తరఫున మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించగా.. స్మృతి తాజాగా ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, మిథాలీ రాజ్ నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకోవడానికి 112 వన్డే ఇన్నింగ్స్ ఆడగా.. స్మృతి కేవలం 95 వన్డే ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించింది. తద్వారా అత్యంత వేగంగా 4 వేల వన్డే పరుగుల క్లబ్లో చేరిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.వన్డేల్లో వేగంగా నాలుగు వేల పరుగుల మైలురాయికి చేరుకున్న మహిళా క్రికెటర్లు👉బెలిండా క్లార్క్- ఆస్ట్రేలియా- 86 ఇన్నింగ్స్👉మెగ్ లానింగ్- ఆస్ట్రేలియా- 87 ఇన్నింగ్స్👉స్మృతి మంధాన- ఇండియా- 95 ఇన్నింగ్స్👉లారా వొల్వర్ట్- సౌతాఫ్రికా- 96 ఇన్నింగ్స్👉కరేన్ రాల్టన్- ఆస్ట్రేలియా- 103 ఇన్నింగ్స్👉సుజీ బేట్స్- న్యూజిలాండ్- 105 ఇన్నింగ్స్👉స్టెఫానీ టేలర్- వెస్టిండీస్- 107 ఇన్నింగ్స్👉టస్మిన్ బీమౌంట్- ఇంగ్లండ్- 110 ఇన్నింగ్స్👉మిథాలీ రాజ్- ఇండియా- 112 ఇన్నింగ్స్👉డేబీ హాక్లీ- న్యూజిలాండ్- 112 ఇన్నింగ్స్‌ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతికా రావల్ 89 పరుగులతో చెలరేగగా.. తేజస్ హసాబ్నిస్ 53 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొలి వన్డేలో ఐర్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
తమీమ్ ఇక్బాల్, అలెక్స్ హేల్స్ మధ్య తీవ్ర వాగ్వాదం.. కొట్టుకున్నంత పని చేశారు..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. రంగ్‌పూర్ రైడర్స్, ఫార్చూన్ బారిషల్ మధ్య నిన్నటి రసవత్తర మ్యాచ్ అనంతరం తమీమ్ ఇక్బాల్ (ఫార్చూన్ బారిషల్ కెప్టెన్), అలెక్స్ హేల్స్ (రంగ్‌పూర్ రైడర్స్) కొట్టుకున్నంత పని చేశారు. మ్యాచ్ అనంతరం జరిగే హ్యాండ్ షేక్ ఈవెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లా మీడియా కథనాల మేరకు.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునేందుకు ఎదురెదురుపడ్డాడు.ఈ సందర్భంగా తమీమ్ ఇక్బాల్, హేల్స్ మధ్య మాటామాటా పెరిగింది. తొలుత హేల్స్ తమీమ్‌ను రెచ్చగొట్టాడు. తమీమ్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు హేల్స్ అగౌరవంగా ప్రవర్తించాడు. హేల్స్ ప్రవర్తనను అవమానంగా భావించిన తమీమ్ తొలుత నిదానంగా సమాధానం చెప్పాడు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని తమీమ్ హేల్స్‌ను అడిగాడు. ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీద చెప్పు. ఇలా ప్రవర్తించడం సరికాదు. మగాడిలా ప్రవర్తించు అని తమీమ్ హేల్స్‌తో అన్నాడు.తమీమ్ తన అసంతృప్తిని వెలిబుచ్చుతుండగానే హేల్స్ ఏదో అన్నాడు. ఇందుకు చిర్రెతిపోయిన తమీమ్ సహనాన్ని కోల్పోయి హేల్స్ మీదకు వచ్చాడు. హేల్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరికి సర్ది చెప్పేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రయత్నించారు. గొడవ వద్దని వారు ఎంత వారిస్తున్నా తమీమ్, హేల్స్ ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.అయితే ఈ గొడవపై హేల్స్ మరోలా స్పందించాడు. ఇందులో తన తప్పేమీ లేదని అన్నాడు. గొడవను తొలుత తమీమే స్టార్ట్ చేశాడని చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్న సందర్భంగా తమీమ్ తనను ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నావా అని అడిగాడు. డ్రగ్స్ కారణంగా నిషేధించబడినందుకు (ఇంగ్లండ్) సిగ్గుపడుతున్నావా అని అడిగాడు. ఇలా మాట్లాడుతూనే చాలా దరుసుగా ప్రవర్తించాడని హేల్స్ చెప్పుకొచ్చాడు.కాగా, ఫార్చూన్ బారిషల్‌తో నిన్న జరిగిన రసవత్తర సమరంలో రంగ్‌పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమయ్యాయి. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్ బంతిని అందుకోగా.. నురుల్ హసన్ స్ట్రయిక్ తీసుకున్నాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన నురుల్.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్ మరో సిక్సర్ బాది రంగ్‌పూర్ రైడర్స్‌కు సంచలన విజయాన్నందించాడు. మొత్తంగా కైల్ మేయర్స్ వేసిన చివరి ఓవర్లో నురుల్ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్) చేశాడు.
వామిక, అకాయ్‌లతో బృందావనంలో విరాట్- అనుష్క! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma), పిల్లలు వామిక(Vamika), అకాయ్(Akaay)లతో కలిసి ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా కెరీర్ పరంగా కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ విఫలంముఖ్యంగా టెస్టుల్లో నిలకడలేమి ఆట తీరు, వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నాడు కోహ్లి. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తేలిపోయిన ఈ ‘రన్‌మెషీన్’.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాలోనూ చేతులెత్తేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రధాన కారణమయ్యాడు కోహ్లి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అంతేకాదు.. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి.. ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు.అంతేకాదు.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ప్రతిసారి బోల్తా పడి వికెట్ సమర్పించుకున్నాడు ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు.. ఈ పరాజయం కారణంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ రేసు నుంచి కూడా భారత జట్టు నిష్క్రమించింది.ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్లుతదుపరి ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానున్నాయి. ఆ తర్వాత వెంటనే చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి కోహ్లి భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ప్రశాంతతకై ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉన్న ప్రేమానంద్ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో భార్య అనుష్కతో పాటు.. కుమార్తె వామిక, చిన్నారి కుమారుడు అకాయ్ కూడా కోహ్లి వెంట ఉన్నారు.అనుష్క వల్లే కోహ్లి ఇలాఈ సందర్భంగా అనుష్క ప్రేమానంద్ మహరాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇక్కడికి వచ్చినపుడు నా మనసులోని కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు. ఈసారి ఇక్కడికి వచ్చినపుడు మాత్రం నా మనసులోని సందేహాలకు సమాధానం పొందాలని భావించాను. అయితే, ఈసారి కూడా వేరేవాళ్ల వల్ల నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇప్పుడు మాకు కేవలం మీ ఆశీస్సులు ఉంటే చాలు’’ అని పేర్కొంది.ఇక విరుష్క దంపతులు తన ముందు ప్రణమిల్లడం చూసి భావోద్వేగానికి గురైన ప్రేమానంద్ మహరాజ్.. ‘‘మీరు చాలా ధైర్యవంతులు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన తర్వాత కూడా దేవుడి పట్ల ఇంత అణకువగా ఉండటం అందరికీ సాధ్యం కాదు,.భక్తి మార్గంలో నడుస్తున్న అనుష్క ప్రభావమే కోహ్లి మీద కూడా ఉంటుందని మేము అనుకుంటూ ఉంటాం. విరాట్ కోహ్లి తన ఆటతో దేశం మొత్తానికి సంతోషాన్ని పంచుతాడు. అతడు గెలిస్తే దేశమంతా సంతోషంగా ఉంటుంది. అంతలా ప్రజలు అతడిని ప్రేమిస్తున్నారు’’ అంటూ కోహ్లిపై ప్రశంసలు కురిపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో వామిక, అకాయ్‌ల ముఖాలు కనిపించకుండా విరుష్క జోడీ జాగ్రత్తపడింది. కాగా ఈ జంట ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.చదవండి: భార్యను భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు: గుత్తా జ్వాల ఫైర్Virat Kohli and Anushka Sharma with their kids visited Premanand Maharaj. ❤️- VIDEO OF THE DAY...!!! 🙏 pic.twitter.com/vn1wiD5Lfc— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2025
డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం
బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఆడుతున్న ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్.. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో తన బ్యాట్‌తో తనే కొట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే.. హరికేన్స్‌తో మ్యాచ్‌లో సిడ్నీ థండర్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను రిలే మెరిడిత్ బౌలింగ్ చేశాడు. వార్నర్ స్ట్రయిక్‌లో ఉన్నాడు. తొలి బంతిని మెరిడిత్ డ్రైవ్ చేసే విధంగా ఆఫ్ స్టంప్ ఆవల బౌల్ చేశాడు. ఈ బాల్‌ను వార్నర్ మిడ్ ఆఫ్ దిశగా డ్రైవ్ చేశాడు. అయితే వార్నర్‌కు ఊహించిన ఫలితం రాలేదు. బౌలర్ స్పీడ్ ధాటికో ఏమో కాని డ్రైవ్ షాట్ ఆడగానే వార్నర్ బ్యాట్ హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది. క్రికెట్లో ఇలా జరగడం సాధారణమే. ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. బ్యాట్ విరగగానే రెండో భాగం కాస్త వార్నర్ తల వెనుక భాగాన్ని తాకింది. అదృష్టవశాత్తు హెల్మెట్ ధరించినందుకు గాను వార్నర్‌కు ఏమీ కాలేదు. ఇలా జరగ్గానే వార్నర్ గట్టి అరిచాడు. కామెంటేటర్లు సరదాగా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలలో వైరలవుతుంది.David Warner's bat broke and he's hit himself in the head with it 🤣#BBL14 pic.twitter.com/6g4lp47CSu— KFC Big Bash League (@BBL) January 10, 2025మ్యాచ్ విషయానికొస్తే.. కొత్త బ్యాట్ తీసుకున్న తర్వాత వార్నర్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో చాలా జాగ్రత్తగా ఆడిన వార్నర్ చివరి వరకు క్రీజ్‌లో నిలిచాడు. వార్నర్ అజేయ హాఫ్ సెంచరీ సాధించడంతో సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. వార్నర్ 66 బంతుల్లో 7 బౌండరీల సాయంతో 88 పరుగులు చేశాడు. థండర్ ఇన్నింగ్స్‌ను వార్నర్ ఒక్కడే నడిపించాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. సామ్ బిల్లింగ్స్ (15 బంతుల్లో 28; 4 ఫోర్లు), ఒలివర్ డేవిస్ (17 బంతుల్లో 17; ఫోర్) కాసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. థండర్ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. భారీగా బిల్డప్ ఇచ్చిన సామ్ కొన్‌స్టాస్ 9 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. మాథ్యూ గిల్కెస్ 7 బంతుల్లో 9, క్రిస్ గ్రీన్ 7 బంతుల్లో 8 పరుగులు చేశారు. అసిస్టెంట్ కోచ్ కమ్ ప్లేయర్ అయిన డేనియల్ క్రిస్టియన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌటయ్యాడు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టాన్లేక్, క్రిస్ జోర్డన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ దక్కించుకున్నారు.భీకర ఫామ్‌లో వార్నర్ఈ సీజన్లో సిడ్నీ థండర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వార్నర్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో వార్నర్ స్కోర్లు..7 (5)17 (10)19 (15)86 నాటౌట్ (57)49 (33)50 (36)88 నాటౌట్ (66)టాప్‌లో థండర్ప్రస్తుత బీబీఎల్ సీజన్లో సిడ్నీ థండర్ అద్భుత విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు (9 పాయింట్లు) సాధించింది. రెండింట ఓడిపోగా, ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. పాయింట్ల పట్టికలో థండర్ తర్వాతి స్థానాల్లో సిడ్నీ సిక్సర్స్ (9 పాయింట్లు), హోబర్ట్ హరికేన్స్ (9), బ్రిస్బేన్ హీట్ (7), పెర్త్ స్కార్చర్స్ (6), మెల్బోర్న్ రెనెగేడ్స్ (6), మెల్బోర్న్ స్టార్స్ (6), అడిలైడ్ స్ట్రయికర్స్ (4) ఉన్నాయి.
బిజినెస్
ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!
చేతిలో డబ్బు ఉంటే.. కొందరు గోల్డ్ కొనుగోలు చేస్తారు. మరి కొందరు రియల్ ఎస్టేట్ మీద పెడతారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఇలా ఎన్నెన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా.. చాలా మంది చూపు మాత్రం 'ఫిక్స్డ్ డిపాజిట్' (FD) వైపు వెళ్తుంది.రిస్క్ లేకుండా వడ్డీ పొందాలంటే.. ఫిక్స్డ్ డిపాజిట్ ఉత్తమమైన మార్గం. వడ్డీ అనేది బ్యాంకులు రెండు విధాలుగా అందిస్తాయి. ఇందులో ఒకటి రెగ్యులర్, మరొకటి సీనియర్ సిటిజన్. రెగ్యులర్ కింద అందరికీ ఒకేరకమైన వడ్డీ లభిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్లకు కొంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది.ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. చాలా బ్యాంకులు కొంతవరకు దాదాపు ఒకే విధమైన వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ.. 40 - 50 బేసిస్ పాయింట్ల స్వల్ప వ్యత్యాసం కూడా మీ డబ్బును పెంచడంలో సహాయపడుతుంది. మీ డబ్బును పెంచుకోవడానికి లేదా ఎక్కువ వడ్డీ పొందటానికి ఎన్ని సంవత్సలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామన్నది సహాయపడుతుంది.ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లు అందించే వడ్డీ రేట్లు➤హెచ్డీఎఫ్సీ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤ఐసీఐసీఐ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤యాక్సిస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం➤యెస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం➤స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం (ఈ వడ్డీ రేట్లు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి).➤బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం (ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 14, 2024 నుంచి అమల్లో ఉన్నాయి).ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్బ్యాంకులలో ఫిక్స్డ్ చేయాలనుకునే ఎవరైనా.. ముందుగా మీరు ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో, అక్కడ (బ్యాంకులో) వడ్డీ ఎంత ఇస్తున్నారనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ బ్యాంక్ ఇచ్చే వడ్డీని.. ఇతర బ్యాంకులతో కంపార్ చేసుకోవాలి. ఆ తరువాత మీకు నచ్చిన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసివచ్చు.
టెక్ దిగ్గజం కీలక రిపోర్ట్: వేలాది ఉద్యోగులు బయటకు
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం ఫలితాలను అధికారికంగా వెల్లడించింది. ఇందులో 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఏకంగా 5,370 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది.మొదటి రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్న టీసీఎస్.. మూడో త్రైమాసికంలో మాత్రం వేలాదిమందిని బయటకు పంపిది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య మొత్తం 6,07,354కు చేరింది. కరోనా మహమ్మారి తరువాత దాదాపు అన్ని కంపెనీలు కోలుకున్నాయి. దీంతో కొన్ని సంస్థలు కొత్త ఉద్యోగులను కూడా తీసుకోవడం మొదలుపెట్టాయి.ఈ త్రైమాసికంలో 25,000 మంది అసోసియేట్లను ప్రమోట్ చేసినట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రమోషన్ల సంఖ్య 1,10,000 కంటే ఎక్కువకు చేరిందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు. అంతే కాకుండా.. మేము ఉద్యోగి నైపుణ్యం, శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తామని.. వచ్చే ఏడాది అధిక సంఖ్యలో క్యాంపస్ నియామకాలకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.వచ్చే ఏడాది 40,000 ఉద్యోగాలు2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉంటాయని.. వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ (Milind Lakkad) అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం.19 ఏళ్లలో ఇదే మొదటిసారిడిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగుల వలసలు 13 శాతం పెరిగింది. అంతకు ముందు ఇది 12.3 శాతంగా ఉంది. ముంబై (Mumbai) కేంద్రంగా సేవలందిస్తున్న టీసీఎస్ కంపెనీ 2004లో మార్కెట్లోకి లిస్ట్ అయింది. అప్పటి నుంచి (19 సంవత్సరాల్లో) సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. 2023లో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 22,600 పెంచుకుంది. అంతకు ముందు 2022లో 1.03 లక్షల ఉద్యోగులను చేర్చుకుంది.టీసీఎస్ లాభం రూ.12,380 కోట్లుప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది.పండుగల సీజన్ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ.. భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయని కంపెనీ సీఈఓ కె కృతివాసన్ (K Krithivasan) పేర్కొన్నారు.
యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపు ఎలాగంటే..
ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రధానంగా యూపీఐని ఎక్కువ మంది వాడుతుండడంతో, క్రెడిట్ కార్డు(credit card) వినియోగదారులు కొనుగోళ్లు చేయడానికి డిజిటల్ చెల్లింపులను ఎంచుకుంటున్నారు. తిరిగి కార్డు బిల్లులు చెల్లించేందుకు కూడా యూపీఐను ఎంచుకుంటే మరింత సులువుగా పేమెంట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే యూపీఐ చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేయడం ఎలా?మొదటిసారి యూపీఐని ఉపయోగిస్తుంటే, డిజిటల్ చెల్లింపులు చేయడానికి, మీ క్రెడిట్ కార్డు(credit card)లను ఉపయోగించడానికి భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి.క్రెడిట్ కార్డును యూపీఐతో జత చేయాలి. అందుకు యాప్ ఓపెన్ చేసి ‘యాడ్ పేమెంట్ మెథడ్’ విభాగానికి వెళ్లాలి.క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకుని క్రెడిట్ కార్డ్ నంబర్, సివీవీ, ఎక్స్పైరీ తేదీ వంటి వివరాలను ఇవ్వాలి.తర్వాత మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. దాంతో యూపీఐకు కార్డు లింక్ అవుతుంది.క్రెడిట్ కార్డు ఖాతాను లింక్ చేసిన తర్వాత కార్డుతో యూపీఐ ఐడీని సృష్టించాలి. యూపీఐ ఐడీ అనేది సంఖ్యలు, అక్షరాలు, స్పెషల్ సింబల్స్ కలిగిన ఒక ప్రత్యేక గుర్తింపు. మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన ఈ ఐడీ యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడానికి, స్వీకరించడానికి సహాయపడుతుంది.యూపీఐ ఐడీ చెక్ చేసుకోవడానికి యాప్‌లోని ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లి ‘యూపీఐ ఐడీ’ని ఎంచుకోవాలి.ఇదీ చదవండి: మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయంక్రెడిట్ కార్డు చెల్లింపులు చేయడం ఎలా?క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. లేదా ‘పే ఫోన్ నంబర్’ లేదా ‘పే కాంటాక్ట్స్’ వంటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి.తర్వాత యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి. యాప్ క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్ లేదా కాంటాక్ట్ నంబర్‌ను ధ్రువీకరించిన తర్వాత, బదిలీ చేయాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి.తర్వాత చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.యూపీఐ పిన్ ఎంటర్ చేసి లావాదేవీ(UPI payments)ని పూర్తి చేయాలి.యాప్‌లో సంబంధిత చెల్లింపు ఎంపికల్లో ‘సెల్ఫ్ ట్రాన్స్ఫర్’ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.
మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం
మెటా గ్రూప్ తన ఆన్లైన్ సర్వీసులైన ఫేస్బుక్, థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఫ్యాక్ట్ చెకింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కంపెనీకి చుక్కెదురవుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్‌ను ఎలా డెలిట్ చేయాలని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు అనలిటిక్స్ ద్వారా తెలిస్తుంది. ప్రస్తుతం ఆయా అకౌంట్లను ఎలా నిలిపేయాలని అధిక సంఖ్యలో గూగుల్‌లో సెర్చ్ చేస్తుండడంతో ప్రస్తుతం అవి ట్రెడింగ్లో ఉన్నాయి. ఇందుకు ఇటీవల మెటా తీసుకున్న నిర్ణయమే కారణమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెటా యాప్స్‌లో థర్డ్‌పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్‌లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.ట్రంప్ మెప్పు పొందేందుకేనా..?ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్‌ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.కఠిన నిర్ణయాలు తప్పవురాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’తప్పుడు సమాచారం తగ్గుతుందా..?మార్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్‌పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.
ఫ్యామిలీ
వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రే
చలికాలంలో చర్మ సమస్యలు సాధారణం. వీటిలో పాదాల పగుళ్లు, ట్యాన్, తిమ్మిర్లు,పాదాల నుంచి వేడి ఆవిర్లు కమ్మినట్లు అనిపించడం వంటివి ఎదుర్కొంటూ ఉంటాం. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాదాలచర్మాన్ని కాపాడుకోవచ్చు.మృదువుగానూ మార్చుకోవచ్చు.తిమ్మిర్లు తగ్గడానికి...∙ఈ కాలం ఎక్కువసేపు కుర్చీ, సోఫాలో కూర్చునే వారికి తిమ్మిర్ల సమస్య ఎక్కువ. అలాంటప్పుడు గ్లాసు వేడినీళ్లలో స్పూన్ వెనిగర్ కలిపి, దానిలో దూదిముంచి, దాంతో రెండు పాదాలు పూర్తిగా తుడవాలి. దీనివల్ల తిమ్మిర్లు,పాదాల చర్మం ΄÷డిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. కాటన్ సాక్సులు వేసుకుంటే కాళ్ల తిమ్మిర్లు తగ్గుతాయి.పగుళ్ల నివారణకు...పాదాల చర్మం భరించగలిగేంత వేడినీటిలో రాళ్ల ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. స్పూన్ అలోవెరా జెల్, స్పూన్ గ్లిజరిన్, విటమిన్ – ఇ క్యాప్సుల్, కొంచెం రాక్ సాల్ట్... ఇవన్నీ బాగా కలపాలి. పాదాల పగుళ్లుపైన ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత పాలిథిన్ కవర్తోపాదం మొత్తం మూసేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కవర్ తీసేయాలి. దీనివల్ల పాదాల వేడి, నెమ్మదిగా పగుళ్లు తగ్గుతాయి.ట్యాన్ ఏర్పడితే...∙చలికాలం క్రీములు, లోషన్లు పాదాలకు ఎక్కువ రాస్తుంటాం. బయటకు వెళ్లినప్పుడు దుమ్ము, ఎండవల్ల ట్యాన్ ఏర్పడుతుంది. ఈ సమస్య నివారణకు.. స్పూన్ టమోటా రసంలో స్పూన్ బంగాళ దుంప రసం, స్పూన్ వెనిగర్, శనగపిండి లేదా కాఫీ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్నిపాదాలకు అప్లై చేసి, పదిహేను నిమిషాలు ఉంచి, వాటర్ స్ప్రే చేసి, కాటన్ క్లాత్‌తో తుడిచేయాలి. వారానికి 2–3 సార్లు చేసుకుంటే ట్యాన్ తగ్గిపోతుంది.శుభ్రమైన గోళ్లుపాదాల గోళ్లు శుభ్రంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కొద్దిగా కరిగించి, దాంట్లో విటమిన్– ఇ క్యాప్సుల్, గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలిపి రాత్రి పడుకునే ముందు గోళ్లచుట్టూ అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.మృదువైన చర్మానికి...రోజ్‌వాటర్, రోజ్మెరీ ఆయిల్, నీమ్ ఆయిల్, అలోవెరా ఆయిల్ అన్నీ సమపాళ్లలో కలిపి స్ప్రే బాటిల్లో పోయాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునే ముందు పాదాలకు స్ప్రే చేయాలి. ఇలా చేస్తే పాదాల చర్మం మృదువుగా అవుతుంది. – సంతోష్ కుమారి, బ్యూటీషియన్
'గోంద్ లడ్డు'..పోషకాల గని..!
కావలసినవి: గోంద్ (ఎడిబుల్ గమ్) – ము΄్పావు కప్పు; బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; రైజిన్స్ – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము– 2 కప్పులు; బెల్లం పొడి– ఒకటింపావు కప్పు; ఖర్జూరాలు (గింజలు తొలగించినవి) – అర కప్పు; గసగసాలు– 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్. తయారీ: మందపాటి బాణలిలో నెయ్యి వేడి చేసి గోంద్‌ను వేయించాలి. చల్లారిన తర్వాత చిదిమి పొడి చేయాలి లేదా చపాతీలు చేసే పీట మీద వేసి చపాతీల కర్రతో ΄పొడి చేయవచ్చు. చిన్న రోలు ఉంటే అందులో వేసి దంచి పొడి చేసుకోవచ్చు. ఒక బాణలిలో కొబ్బరి తురుము, గసగసాలు, కిస్మిస్, మిగిలిన గింజలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయిస్తూ, వేయించిన దినుసులన్నింటినీ ఒకే పాత్రలో వేయాలి. అందులో యాలకుల పొడి, ఖర్జూరాలు, గోంద్ పొడి వేసి సమంగా కలిసే వరకు స్పూన్‌తో కలపాలి. మరొక పాత్రలో బెల్లం పొడి వేసి మూడు టేబుల్ స్పూన్ల నీటిని ΄ోసి తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి అందులో గోంద్పొడి తోపాటు దినుసులన్నింటినీ కలిపిన మిశ్రమాన్ని వేసి కలపాలి. వేడి తగ్గే వరకు ఆగాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డులు చేయాలి. పై కొలతలతో చేస్తే 16 లడ్డులు వస్తాయి. గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: ఇది గోధుమ జిగురు. మార్కెట్లో గోంద్ కటిరా పేరుతో దొరుకుతుంది. ఒక్కో లడ్డులో పోషకాలు ఇలా ఉంటాయి..కేలరీలు – 120–130; కార్బోహైడ్రేట్లు – 15–18 గ్రాములు; ప్రోటీన్లు – 2–3 గ్రాములు;ఫ్యాట్ – 6–7 గ్రా.; ఫైబర్– 1–2 గ్రాములుప్రయోజనాలు..గోంద్ దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. చల్లటి వాతావరణంలో దేహానికి తగినంత వెచ్చదనాన్నిస్తుంది. గింజల నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, దేహానికి అవసరమైన మైక్రో న్యూట్రియెంట్స్ అందుతాయి.బెల్లంలో ఐరన్, జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంటుంది. కొబ్బరి తురుములో ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. ఖర్జూరాలు, రైజిన్స్లోని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ఉండటంతోపాటు అవి శక్తినిస్తాయి. (చదవండి: భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!)
పండగ కళ ఉట్టిపడేలా థీమ్ ఆర్ట్‌తో వెలిగిపోండి..!
గ్రాండ్‌గా వెలిగిపోయే వివాహ వేడుకైనా హుందాగా కదిలే సీమంతం ఫంక్షన్ అయినా ఆధునికంగా ఆలోచించే అమ్మాయిలు ఒకచోట చేరినా ఆ సందర్భంలో తమదైన ప్రత్యేకతను చూపాలనుకుంటారు. అందులో మరింత స్పెషల్‌గా నిలుస్తుంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్(Fabric Painting) ఫ్యాషన్ రంగంలో(Fashion) హ్యాండ్ వర్క్(Hand Work) ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. అవే ప్రతియేటా రూపును మార్చుకొని కొత్తగా మన మదిని ఆకట్టుకుంటాయి. వాటిలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లు ఈ ఏడాది స్పెషల్‌గా సందడి చేయనున్నాయి. పండగ థీమ్మనవైన పండగల వేళ సంప్రదాయం ఉట్టిపడాలంటే అందుకు తగినట్టు వేషధారణలోనూ ఆ కళ కనిపించాలని కోరుకుంటున్నారు. పండగలో ప్రత్యేకంగా నిలిచే అమ్మవార్ల రూపాలు, పాదాలు, ఆభరణాలు, ముగ్గులు పెయింటింగ్ చేయించడం వీటి ప్రత్యేకత. వీటిలో సాదాసీదాగా కనిపించే పెయింటింగ్స్ కొన్ని అయితే పెయింటింగ్ కాంబినేషన్‌తో చేసే ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, ప్యాచ్‌వర్క్‌లు అదనంగా జత కలుస్తున్నాయి.దంపతులకు ప్రత్యేకంవివాహ వేడుకలతో వధూవరుల దుస్తుల డిజైన్లు రిచ్‌గా కనిపించాలని కోరుకోని వారుండరు. దానితో పాటు తమ పెళ్లి ప్రత్యేకం అని చూపడానికి ఐదు రోజుల పెళ్లిలో ఏదో ఒకరోజు వధూవరుల రూపాలను పెయింటింగ్‌గా చిత్రించి, వాటిని ధరించడానికి ముచ్చట పడుతున్నారు. వీటిలో వారి వారి బడ్జెట్లను బట్టి ఎంపికలు ఉంటున్నాయి. సీమంతం వేడుకరాబోయే బిడ్డకు ఆహ్వానం పలకడానికి, తల్లీ–బిడ్డ క్షేమం కోసం చేసే ఈ వేడుకను... పెయింట్ చేసిన శారీస్, లెహంగాలతో ఎంతో సుందరంగా మార్చేస్తున్నారు. యశోదాకృష్ణ, గోపికా కృష్ణ, చిన్నారి ΄ాదాలు, కామధేను వంటి డిజైన్లు దుస్తులను అద్భుతంగా మార్చేస్తున్నాయి. తల్లిదండ్రులు–పిల్లల కాంబినేషన్ పెయింటింగ్స్ కూడా ఈ థీమ్‌లో చోటుచేసుకుంటున్నాయి.మోడరన్ మగువడెనిమ్స్, షర్ట్స్‌తో క్యాజువల్ వేర్‌గానూ, ఫ్రెండ్లీ గెట్ టు గెదర్ పార్టీల్లోనూ ప్రత్యేకంగా నిలవడానికి తమదైన థీమ్‌తో డిజైన్ చేయించుకుంటున్నారు. తమలోని ఆధునిక భావాలను డ్రెస్సింగ్ ద్వారా చూపుతున్నారు. దీనిలో భాగంగా పెయింటింగ్ చేసిన ఫ్యాబ్రిక్ ΄్యాచ్వర్క్ ఈ తరాన్ని బాగా ఆకట్టుకుంటోంది.
‘పురుషసూక్తం': పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళలే..
‘పురుషసూక్తం’.. ‘టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ ఎ బ్రీఫ్’.. రెండు నాటకాలు. ఇవి పురుష భావజాలంపై నటి ఝాన్సీ రూపొందించిన సంవాదాలు. ఆలోచనావీచికలు... మార్పుకై నివేదనలు. ఝాన్సీ తన టీమ్‌తో రవీంద్రభారతిలో జనవరి 12న ప్రదర్శించనున్న సందర్భంగా...‘తెలంగాణ థియేటర్ రీసెర్చ్ కౌన్సెల్ వాళ్లు 2019లో విమెన్స్ డేకి ‘విమెన్ డైరెక్టర్స్ ఫెస్టివల్’ను కండక్ట్ చేస్తూ నన్ను కూడా అడిగారు ఒక నాటకం ఇస్తాం.. డైరెక్ట్ చేయమని. వాళ్లిచ్చిన నాటకం కంటే నేను నా ఐడియాలజీని నాటకంగా ప్రెజెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దాన్నొక చాలెంజ్‌గా తీసుకున్నాను. నేను చదివిన, చూసిన, నేర్చుకున్న, ఏర్పర్చుకున్న దృక్పథాన్ని పేపర్ మీద పెట్టాను. అదే నా ఫస్ట్ ప్లే.. ‘పురుషసూక్తం.’ జెండర్ కళ్లద్దాలతో మాస్క్యులినిటీని మనమెలా చూస్తున్నాం, దాన్నెలా పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల పురుషుడు తాను మనిషినన్న విషయాన్ని మరచిపోయి, అనవసరపు బరువు బాధ్యతలను ఎలా మోస్తున్నాడు, ఆ పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళ ఎలా కోటగోడగా మారిందనే అంశాల మీద సీరియస్ చర్చే ఆ నాటకం’ అన్నారు ఝాన్సీ.రవీంద్రభారతిలో తన రెండు నాటకాలను ప్రదర్శించడానికి ఒకవైపు రిహార్సల్స్ చేస్తూ మరోవైపు సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ‘పురుషసూక్తం నాటకానికి 18 రోజు ల్లోనే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాను. డైరెక్ట్ చేయడమే కాక నటించాను కూడా. అంత సీరియస్ నాటకాన్ని రెండు పాత్రలతో ఎంతవరకు మెప్పించగలను అనుకున్నా! కానీ ఆశ్చర్యం.. కె. విశ్వనాథ్ లాంటి వారి మహామహుల ప్రశంసలు అందాయి. అది నాటక రచయితగా, దర్శకురాలిగా నా ప్రయాణాన్ని ఖరారు చేసుకునేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. థియేటరే నా మీడియమనీ అర్థమైంది’ అన్నారామె.టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ బ్రీఫ్ ‘కిందటేడు (2024) అక్టోబర్ 4న వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ డే సందర్భంగా స్త్రీల ఆరోగ్యం, పురుషుల బాధ్యత లాంటి విషయాలెన్నో చర్చకు వచ్చి.. అసలిలాంటి వాటి మీద మనమెందుకు అవసరమైనంతగా మాట్లాడట్లేదు, ఏదో ఒకటి చేయాలి అనిపించి ‘టిట్ ఫర్ టాట్.. ’ మొదలుపెట్టాను’ అన్నారు ఝాన్సీ. ఇది ‘పురుషసూక్తం’ తర్వాత ఆమె రాసి నటించి దర్శకత్వం వహించనున్న రెండోనాటకం.‘రెండు రోజులకే ఏం రాయాలో తెలిసింది గాని మొదట సగం స్క్రిప్టే రాయగలిగాను. దానికే ఇంకొన్ని ఆలోచనలు జోడించి ఇంట్లో పిల్లలనే చేర్చి, క్లోజ్ సర్కిల్ ముందు వేసి చూపించాను. అలా వర్క్ చేసుకుంటూ నాటకం రాసుకుంటూ వచ్చాను. పార్ట్స్ పార్ట్స్‌గా రాస్తూ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రదర్శించి ఫ్రెండ్స్‌కు చూపించాను. అందరికీ నచ్చింది. మెయిన్ షో ఎప్పుడని అడగడం మొదలుపెట్టారు. ‘టిట్ ఫర్ టాట్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ బ్రా అండ్ బ్రీఫ్’కి కూడా మూలం పురుషాధిపత్య విషతుల్య భావజాలమే. కాకపోతే అప్రోచ్ వేరు. ఇదొక సోషల్ సెటైర్. దీనికి టార్గెట్ ఆడియన్స్ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వాళ్లు. వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అందుకే హ్యూమర్‌ని, వ్యంగ్యాన్ని ఎంచుకున్నాను. సీరియస్‌ను పండించడం తేలికే. వ్యంగ్యం చాలా కష్టం. భాష కూడా జెన్ జీ జార్గాన్స్‌తో ఉంటుంది. వాళ్ల తాలూకు మీమ్స్ ఉంటాయి. పురుషసూక్తం.. మగవాడు మీదేసుకున్న బాధ్యతల బరువు మీద ఫోకస్ చేసింది. ఇదేమో ఆ బాధ్యతలను ఇంకా వేసుకోని వాళ్లకు వేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతుంది’ అన్నారామె.డిబేట్.. ‘రవీంద్రభారతి ప్రదర్శనలో ఈ రెండూ నాటకాలు మరింత మార్పు చేర్పులతో వస్తున్నాయి. పురుషసూక్తంలో కోరస్ యాడ్ అవుతోంది. ‘టిట్ ఫర్ టాట్.. ’ లో ట్రాన్స్ ఉమన్, ట్రాన్స్ మన్ ఇలా అన్ని వర్గాల వాళ్లు నటిస్తున్నారు. ప్రతివాళ్లు వాళ్ల వాళ్ల శరీర ధర్మాలను రిప్రెజెంట్ చేస్తూ తమ సహజమైన పాత్రలనే పోషిస్తున్నారు. అంటే ప్రకృతిలో ఇంత వైవిధ్యం ఉంటుంది.. దాన్ని మనం గౌరవించాలి.. వాళ్ల వల్నరబులిటీని అర్థం చేసుకోవాలని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం.. ప్రేక్షకులకే కాదు.. అందులో నటించిన నటీనటులకు కూడా! ఇందులో మా అమ్మాయి ధన్య పరిచయం అవుతోంది. నాటకాల ప్రదర్శన తర్వాత ఓపెన్ డిబేట్ ఉంటుంది’ అన్నారామె.రంగయాత్ర.. సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో నాటకానిదే ప్రధాన పాత్ర మొదటి నుంచీ! ఆ బాధ్యతను కొనసాగించాలనుకుంటున్నాం.. ‘రంగయాత్ర.. థియేటర్ ఫర్ సోషల్ డిబేట్’ పేరుతో! అందులో భాగంగానే రవీంద్రభారతిలో ప్రదర్శన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని కాలేజెస్‌కి వెళ్లి అక్కడ ఈ నాటకాలను ప్రదర్శించబోతున్నాం స్ట్రీట్ ప్లే తరహాలో. ప్రదర్శన తర్వాత విద్యార్థులతో డిబేట్ పెడతాం. జెండర్ మీద అవగాహన కల్పించే ప్రయత్నమే ఇదంతా!’ అంటూ ముగించారామె.– సరస్వతి రమకొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది ‘పురుషసూక్తం నన్ను థియేటర్ ఆర్టిస్ట్‌ని చేసింది. ఈ నాటకాన్ని మగవాడిని అర్థంచేసుకునే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఆ దిశగా .. పురుషాధిపత్య భావజాలంతో కండిషనింగ్ అయి ఉన్న మొత్తం సమాజాన్నే ఆత్మవిమర్శకు గురిచేస్తుంది ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది! రిహార్సల్స్‌లో ఎన్నిసార్లు నన్ను నేను తరచి చూసుకున్నానో! ఇది నాకొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్!’– వంశీ చాగంటి, హ్యాపీడేస్ ఫేమ్
ఫొటోలు
International View all
హష్ మనీ కేసు: అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్
లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన మంటలు బీభత్సాన్ని సృష్టించాయి.
నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్ టవర్స్ దాడి మాస్టర్‌మైండ్
వాషింగ్టన్ : అమెరికా చరిత్రలో అత్యంత విషాదాన్ని మిగిల
ఓ మై గాడ్.. అణు బాంబు పడిందా?
ఈ భూమ్మీద అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో అదొకటి. సినీ ప్రముఖులు, ధనవంతులకు నెలవుగా ఉండేదది.
ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ
ఒట్టావా : కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో (justin trudea
National View all
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్
పుణె: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (R
రాష్ట్రమంతా నకిలీ రూ.500 నోట్లు.. పోలీసుల అలర్ట్
రాష్ట్రమంతా నకిలీ 500 రూపాయల నోట్లు (Fake 500 rupee notes) చెలామణి అవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని బిహార్ (Bihar) పోలీ
ఇది నా తొలి పాడ్‌కాస్ట్.. కాస్త బెరుకుగా ఉంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తాను మనిషినేనని, దేవుణ్ని కాదని, మనుషలంతా
కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో
కాంగ్రెస్ నాయకుడు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకు సంబంధించి ఒక వీడియ
అమ్మల కోసం రూ.10 లక్షల వ్యయంతో ‘ఆణిముత్యాలు’
దాదర్: బహిరంగ ప్రదేశాల్లో పసిబిడ్డలకు పాలిచ్చేందుకు బాలింత
NRI View all
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
క్రైమ్
‘బయటి నేరగాళ్ల’కు చెక్ భారత్‌పోల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు కీలకపాత్ర పోషించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అమెరికాలో ఉన్న ఆయన్ను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించడానికి 8 నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, పోలీసు విభాగాలు అనునిత్యం ఏదో ఒక కేసులో నిందితుల ఆచూకీ కనుగొనడం, వారిని రప్పించే క్రమంలో ఇంటర్‌పోల్ సాయం కోరుతుంటాయి. ఇంటర్ పోల్గా పిలిచే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారానికి, నేరాల నియంత్రణకు కృషి చేస్తుంది. అయితే ఏదైనా పోలీసు విభాగం దీన్ని ఆశ్రయించడం అనేది ప్రస్తుతం ఓ సుదీర్ఘ, క్లిష్టతరమైన ప్రక్రియగా ఉంది. దీన్ని సులభతరం చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (సీబీఐ) అధీనంలోని నేషనల్ సెంట్రల్ బ్యూరో (ఎన్సీబీ) ఫర్ ఇంటర్‌పోల్ ఓ పోర్టల్‌ను రూపొందించింది. అదే భారత్‌పోల్. ఈ పోర్టల్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండురోజుల క్రితం ఢిల్లీలో ఆవిష్కరించారు.అనేక కేసుల్లో విదేశీ లింకులుఒకప్పుడు దేశ వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో విదేశాలతో లింకు ఉన్నవి అత్యంత అరుదుగా తెరపైకి వచ్చేవి. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు, భారీ ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా తదితర కేసులతో పాటు వ్యవస్థీకృత నేరాల్లో ‘విదేశీ లింకులు’ సర్వసాధార ణం అయ్యా యి. సూత్ర ధారులు విదేశాల్లో ఉండి ఇక్కడ నేరాలు చేయించడమో, ఇక్కడ నేరం చేసిన వారు విదేశాలకు పారిపోవడమో జరుగుతోంది. దీంతో పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడం అనివార్యంగా మారుతోంది. 195 దేశాల సభ్యత్వం కలిగిన ఇంటర్‌పోల్ ద్వారానే రెడ్ కార్నర్ సహా వివిధ రకాలైన నోటీసుల జారీ సాధ్యమవుతుంది.అంత ఈజీ కాదు..అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ పంజగుట్ట పోలీసుల వ్యయప్రయాసలు ఇంటర్‌పోల్ వ్యవహారానికి ఓ తాజా ఉదాహరణ. ఫోన్ ట్యాపింగ్ కేసు వినతి తొలుత వెస్ట్‌జోన్ డీసీపీ ద్వారా నగర పోలీసు కమిషనర్‌కు వెళ్లింది. పోలీసు కమిషనర్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ సీఐడీకి సిఫారసు చేశారు. అక్కడి నుంచి దేశంలో ఇంటర్‌పోల్‌కు నోడల్ ఏజెన్సీగా ఉన్న సీబీఐకి చేరింది. అక్కడి నుంచి ఇంటర్‌పోల్‌కు సదరు విజ్ఞప్తి చేరాల్సి ఉండగా.. అనేక వివరణలు, సందేహాలు, సమస్యలు ప్రక్రియ ముందుకు సాగేందుకు ఆటంకంగా మారాయి. ఈ కారణంగానే కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినా, 8 నెలలుగా హైదరాబాద్ పోలీసులు రకరకాలుగా ప్రయ త్నాలు చేస్తున్నా ఇప్పటికీ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించే ప్రయత్నం సఫలం కాలేదు. దేశంలోని అనేక ఏజెన్సీలు, పోలీసు విభాగాలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి. దీనికి పరిష్కారంలో భాగంగానే భారత్‌పోల్ తెరపైకి వచ్చింది.ఇకపై సులభంగా..ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అన్ని పోలీసు విభాగాలు, ఏజెన్సీలకు ఇంటర్‌పోల్‌తో సంప్రదింపులు సులువు అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. వివిధ రకాలైన కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ, అందుకు అవసరమైన పత్రాలు, నమూనాలను ఈ పోర్టల్‌లో పొందుపరిచారు. అధికారులకు వచ్చే సందేహాలు, వాటికి సమాధానాలను ఆన్లైన్లో పొందేలా డిజైన్ చేశారు. ఈ పోర్టల్ వినియోగంపై త్వరలో సీబీఐ దేశ వ్యాప్తంగా పోలీసులు, ఏజెన్సీలకు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది.భారత్‌పోల్.. 5 ఉపయోగాలు1 దేశంలోని అన్ని ఏజెన్సీలు, పోలీసు విభాగాలతో పాటు కొన్ని విదేశీ ఏజెన్సీలు సైతం ఈ పోర్టల్ ద్వారాసంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.2 వివిధ వ్యవస్థీకృత నేరాలు,నేరగాళ్లకు సంబంధించిన వివరాల్ని ఇందులో పొందుపరిచారు.3 బ్రాడ్ కాస్ట్ విధానంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వాంటెడ్ నేరగాళ్ల వివరాలను తేలిగ్గా ఇచ్చిపుచ్చుకునే ఆస్కారం ఏర్పడింది.4 వ్యవస్థీకృత నేరాలు, నేరగాళ్ల సమా చారం, నేరం చేసే విధానం, ప్రభావం ఉన్న ప్రాంతాలు తదితరాలను తేలిగ్గా గుర్తించేలా ఈ పోర్టల్ రూపొందింది.5 క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టం కంటే సమర్థంగా నేరగాళ్ల కదలికలు, వివరాలు తెలుసుకునేందుకు భారత్‌పోల్ ఉపయోగపడనుంది.
వివాహమైన 3 వారాలకే సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
రాజేంద్రనగర్: పెళ్లయిన 3 వారాలకే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన అరుణ్ (28) ఇదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని (21)తో 21 రోజుల క్రితం వివాహం జరిగింది. అనంతరం వీరు హైదర్‌గూడలో అద్దె ఇంట్లోకి వచ్చారు. అరుణ్‌కు నైట్ షిఫ్ట్ కాగా.. ఆయన భార్య ఉదయం షిఫ్ట్ ముగించుకుని మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా.. గది తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఘటన స్థలానికి చేరుకొని డోర్ తెరిచి చూడగా అరుణ్ ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడైనా వణకలేదు!
బంజారాహిల్స్ (హైదరాబాద్): సైబర్ నేరగాళ్లు బెదిరిస్తే చదువుకున్నవాళ్లు, ఐటీ ఉద్యోగులు, యువతే బెదిరిపోయి వారి వలలో ఇరుక్కుని లక్షల్లో నష్టపోతున్నారు. అయితే ఓ 80 ఏళ్ల వృద్ధుడు మాత్రం వాళ్ల మోసాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా, భారీ ఆర్థిక నష్టం నుంచి తప్పించుకున్నాడు. వివరాలు...బంజారాహిల్స్ రోడ్డునంబర్ 12లో నివాసం ఉండే పెంచికల రఘునందన్‌రెడ్డి (80)ని శంకర్‌కుమార్ అనే వ్యక్తి సంప్రదించాడు. ప్రోస్టేట్ కేన్సర్‌కు ఆయుర్వేద చికిత్స గురించి తెలియజేస్తూ, తన తండ్రికి పూర్తిగా నయమైందంటూ నమ్మబలికాడు. ఆ తర్వాత అశోక్ యాదవ్ అనే వ్యక్తి 4వ తేదీన రఘునందన్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. మీ గురించి శంకర్‌కుమార్ చెప్పాడని, ఇంట్లో ఆయుర్వేద కషాయాన్ని తయారుచేయమని వృద్ధుడిని బలవంతం చేశాడు. అనంతరం రఘునందన్‌రెడ్డిని వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఓ ఆయుర్వేద దుకాణానికి తీసుకువెళ్లాడు. అక్కడ మనోజ్ అనే వ్యక్తి వివిధ మూలికలతో కూడిన మందుల ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆ మొత్తం దాదాపు రూ.9,26,820 కాగా, అడ్వాన్స్‌గా రూ.76,800ల నగదు, రూ.7,50,000లకు చెక్కును రఘునందన్‌రెడ్డి ఇచ్చాడు. అయితే శంకర్‌కుమార్ తన తండ్రి చికిత్సకు రూ.40 వేలు మాత్రమే ఖర్చయ్యాయని చెప్పిన విషయం రఘునందన్‌రెడ్డికి గుర్తుకువచ్చి తనను మోసం చేశారని గ్రహించాడు. దీంతో బ్యాంకుకు వెళ్లి చెక్కు చెల్లింపులను నిలిపివేయించాడు.లైన్లోకి సైబర్ నేరగాళ్లు..దీంతో నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆ తర్వాత నుంచి ఢిల్లీ పోలీసులమని, సీబీఐ అధికారినంటూ కొందరు రఘునందన్‌రెడ్డికి ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. నీపై మనీ లాండరింగ్ యాక్ట్ కేసు నమోదైందని, వెంటనే రూ.25 లక్షలు పంపించకపోతే డిజిటల్ అరెస్టు చేస్తామంటూ బెదిరించారు. వీడియో కాల్లో సైబర్ నేరస్తుడు పోలీసు ఆఫీసర్ డ్రెస్‌లో బెదిరించి దడదడలాడించినా రఘునందన్‌రెడ్డి తొణకలేదు. ఇలా గంట, రెండు గంటలు కాదు..ఏకంగా ఐదున్నర గంటల పాటు వృద్ధుడిని ఇబ్బంది పెట్టారు. ఇదంతా సైబర్ మోసగాళ్ల పనిగా గ్రహించిన వృద్ధుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేన్సర్‌కు ఆయుర్వేద మందు పేరుతో తనను మోసగించిన వ్యక్తులే తన నుంచి పూర్తి వివరాలు రాబట్టి సైబర్ మోసగాళ్లకు సమాచారం ఇచ్చి లక్షలు లాక్కోవాలని పథకం వేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శంకర్‌కుమార్, అశోక్‌యాదవ్, మనోజ్‌లతో పాటు రాపిడో ఏజెంట్‌పై కేసు నమోదు చేశారు.
నేపాలీ జంట కోసం ఇంటర్‌పోల్‌కు మొర
యశవంతపుర: నగల షాపు యజమాని ఇంట్లో పనిచేస్తూ రూ.15.15 కోట్ల విలువగల బంగారాన్ని దోచుకెళ్లిన నేపాలీ జంట ఆచూకీ లేదు. కొన్ని నెలల కిందట సురేంద్రకుమార్ జైన్ ఇంటిలో నేపాల్‌కు చెందిన నేమిరాజ్ దంపతులు పనిచేస్తూ నమ్మకంగా ఉండేవారు. నవంబర్ 1న జైన్ కుటుంబం గుజరాత్లో ఇంటి పండగుక వెళ్లినప్పుడు నేమిరాజ్ దంపతులు డబ్బు బంగారంతో ఉడాయించారు. అప్పటినుంచి పోలీసులు గాలిస్తున్నా జాడ లేదు. నేపాల్‌కు పారిపోయి దాక్కున్నట్లు అనుమానం. బెంగళూరు పోలీసులకు కష్టతరంగా మారడంతో ఇంటర్‌పోల్‌కు సమాచారమిచ్చారు. వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని అభ్యర్థించారు.