వాషింగ్టన్ : అమెరికా చరిత్రలో అత్యంత విషాదాన్ని మిగిల్చిన ట్విన్ టవర్స్(twin towers) కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేలాది మంది అమయాకుల్ని పొట్టనపెట్టుకున్న ఖలీద్ షేక్ మహమ్మద్ (Khalid Sheikh Mohammed) ఉరిశిక్ష నుంచి తనకు ఉపశమనం కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌పై విచారణ జరగకుండా జోబైడెన్ (joe biden) ప్రభుత్వం అడ్డుకుంది.
ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా అమెరికాలో 2001, సెప్టెంబరు 11న న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై దాడి చేసింది. ఈ దాడికి వ్యూహరచన చేసిన ఖలీద్ షేక్ మహమ్మద్ ఉరిశిక్ష నుంచి ఉపశమనం కల్పిస్తూ తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరగకుండా జోబైడెన్ ప్రభుత్వం సఫలమైంది.
ముస్లిం దేశాల్లో యుద్ధాలకు అమెరికా, దాని మిత్ర దేశాలే కారణమని ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా అమెరికాలో 9/11 దాడికి పాల్పడింది. ఈ దాడి ఎలా చేయాలి? విమానాల్ని ఎలా హైజాక్ చేయాలి? అనే కుట్రకు ఖలీద్ షేక్ మహమ్మద్ ప్రణాళికలు చేశాడు. మారణ హోమం తర్వాత ఖలీద్‌ను అమెరికా సజీవంగా పట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జైలుగా అభివర్ణించే గ్వాంటనామో బేకు తరలించింది. నాటి నుంచి అదే జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.
Lawyers for Khalid Sheikh Mohammed, the accused 9/11 mastermind, are urging to proceed with a guilty plea to expedite resolution of his long-delayed case. The plea could impact sentencing terms and avoid a full trial. The case has faced extensive delays due to legal and… pic.twitter.com/qIhnfHDgXC
— Monte White (@montewhiteiam) January 10, 2025
ఈ కేసును గ్వాంటనామో బే కోర్టులో విచారణ కొనసాగుతోంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఖలీద్‌కు ఉరిశిక్ష విధించింది. అయితే ఆ ఉరిశిక్ష నుంచి తనకు ఉపశమనం కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ గతేడాది జులై తర్వాత ఇవాళ విచారణకు రావాల్సి ఉంది. అయితే ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టకుండా కేసు దర్యాప్తు చేసేందుకు తమకు మరింత సమయం కావాలని,షెడ్యూల్ ప్రకారం గ్వాంటనామో బే కోర్టులో షెడ్యూల్ ప్రకారం పిటిషన్ చేపట్టకుండా గడువు విధించాలని త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు.
అదే సమయంలో ఖలీద్ తరుఫు వాదిస్తున్న న్యాయవాదులు 20 ఏళ్లుగా కేసు విచారణలో అమెరికా మిలటరీ, అమెరికా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వాదించారు. తన క్లయింట్ ఖలీద్ కోరినట్లుగా ఉరిశిక్ష నుంచి ఉపశమనం కల్పించాలని కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. చివరకు అమెరికా ప్రభుత్వ విజ్ఞప్తిని అంగీకరించింది. ప్రభుత్వ అభ్యర్థనలో వాదనలను పూర్తిగా పరిశీలించినంత కాలం మాత్రమే స్టే కొనసాగుతుందని, తుది తీర్పుగా పరిగణించరాదని నొక్కి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment