జకార్తా: చావు తప్పి కన్ను లొట్టపోవడమంటే ఇదేనేమో.. రోడ్డు మీద ఓ వ్యక్తి స్కూటర్‌పై వెళ్తున్నాడు. ఇంతలో పక్కనున్న భారీ కొండచరియలు ఒక్కసారిగా విరిగి పడ్డాయి. అదృష్టవశాత్తూ ఆ ప్రమాదాన్ని గమనించిన అతను స్కూటీ రూటు మల్లించాడు. అనంతరం స్కూటరు వదిలేసి పరిగెత్తాడు. ఆ కొండచరియలు స్కూటీని మింగేసినట్లుగా పూర్తిగా మట్టితో కప్పివేశాయి. క్షణం ఆలస్యం చేసినా అతని ప్రాణాలే ప్రమాదంలో పడేవి. ఈ ఘటన ఇండోనేషియాలో ఏప్రిల్ 9న చోటు చేసుకుంది. (ఏకంగా చెవిలోనే గూడు కట్టేసుకుంది!)
అప్పటి నుంచి ఈ వీడియో పలు మార్లు వైరల్ అవుతూ వస్తోంది. కొన్నిసార్లైతే ఏకంగా ఇది గోవాలోనే జరిగిందని, మరోసారి మేఘాలయలో జరిగిందంటూ తప్పుడు ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. "ఆయనకు భూమి మీద ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి", "రెప్పపాటులో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. (పెద్ద సీసాలో ఇరుక్కుపోయిన ఎలుగుబంటి తల)
#FakeNewsAlert
— Meghalaya Police (@MeghalayaPolice) May 21, 2020
A video clip of a Landslide which is being circulated on social media is from settlements of Chiangjur & Sukanagara in Indonesia, NOT from National Highway of Meghalaya.
We request citizens not to share or circulate the video clip with false content or caption. pic.twitter.com/evQ3UvZm0F
Comments
Please login to add a commentAdd a comment