జెనీవా: ఇరాన్‌పై ఆంక్షలు తొలగే అవకాశం ఏర్పడింది. అణు కార్యక్రమాలను తగ్గించుకునేందుకు అంగీకరిస్తూ ఆ దేశం శక్తిమంతమైన దేశాలతో అవగాహన కుదుర్చుకుంది. అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీలతో చర్చోపచర్చల తర్వాత సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు ఇరాన్ అంగీకరించిందని యురోపియన్ యూనియన్ అత్యున్నత ప్రతినిధి ఫ్రెడరికా మొగెరిని తెలిపారు. దీని వల్ల అణురంగంలో ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు తొలగుతాయని గురువారం స్విట్జర్లాండ్‌లోని లౌసానెలో తెలిపారు. ఈ అవగాహన ఇరాన్ చేపట్టే అణు పదార్థాల శుద్ధి కార్యక్రమాలకు, అణు నిల్వలకు చెక్ పెడుతుంది. నతాంజ్‌లో తప్ప మరెక్కడా అణు శుద్ధి కి వీలుండదు.