కోవిడ్‌-19 : 18 నెలల్లో తొలి వ్యాక్సిన్‌  | WHO Says COVID-19 First Vaccine Could Be Ready In 18 Months | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19 : 18 నెలల్లో తొలి వ్యాక్సిన్‌ 

Published Wed, Feb 12 2020 2:53 PM | Last Updated on Wed, Feb 12 2020 4:16 PM

WHO Says COVID-19 First Vaccine Could Be Ready In 18 Months - Sakshi

జెనీవా : ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్‌ నిరోధక టీకాకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌-19 నిరోధకానికి సంబంధించిన మొదటి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్ చెప్పారు. అయితే ఈలోపు అందుబాటులో ఉన్న వనరులతోనే ఈ వైరస్‌పై పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని అన్ని దేశాలకు సూచించారు.

ఉగ్రవాద చర్య కంటే వైరస్‌ల వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని డాక్టర్‌ టెడ్రోస్‌ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ను ప్రజా శత్రువుగా చూడాల్సి ఉందన్నారు. కాగా, కోవిడ్‌-19పై పోరాటానికి డబ్ల్యూహెచ్‌ఓ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కోవిడ్‌-19 నిరోధక టీకాలు, మందుల పరిశోధనల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 400 మంది శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు ప్రాణాంతక కోవిడ్‌-19 చైనాలో కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఒకటి మంగశవారం బీజింగ్‌ను చేరుకుని వైరస్‌ నిరోధక చర్యల్లో సాయం అందించడం మొదలుపెట్టిందని చైనా ఆరోగ్య కమిషన్‌  ఒక ప్రకటనలో తెలిపింది.

చదవండి : ప్రాణాంతక కరోనా పేరు మార్పు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement