సామాజిక దూరంతోనే మహమ్మారి దూరం | WHO Says COVID-19 Transmitted By Respiratory Droplets And Contact Routes | Sakshi
Sakshi News home page

సామాజిక దూరంతోనే మహమ్మారి దూరం

Published Fri, Apr 3 2020 6:50 PM | Last Updated on Fri, Apr 3 2020 7:13 PM

WHO Says COVID-19 Transmitted By Respiratory Droplets And Contact Routes - Sakshi

న్యూయార్క్‌ : కరోనా వైరస్‌ రోగి నోటి నుంచి వెలువడే తుంపరల ద్వారా మరొకరికి సంక్రమిస్తుందని, గాలి ద్వారా వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రోగి దగ్గినప్పుడు వెలువడే తుంపరల ద్వారా ఇతరులకు సంక్రమిస్తాయని ఓ నివేదికలో పేర్కొంది. ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తి దగ్గడం లేదా తమ్మిన సందర్భంలో ఒక మీటర్‌ దూరంలో ఉన్న వ్యక్తిపై ఆ తుంపరలు పడితే అవి నోరు, ముక్కు, కళ్ల ద్వారా మరొకరి శరీరంలో చేరి వైరస్‌ బారిన పడవేసే ముప్పు ఉందని తెలిపింది.

వైరస్‌ సోకిన వ్యక్తి వాడిన వస్తువులను, ఉపరితలాలను తాకడం ద్వారా కూడా ఈ వ్యాధి ఇతరులకు సంక్రమిస్తుందని వెల్లడించింది. తరచూ చేతులను శుభ్రపరుచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, సామాజిక దూరాలను పాటించడం ద్వారా ఈ మహమ్మారిని దూరం పెట్టవచ్చని సూచించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌ కేసులు పది లక్షలు దాటగా 53,975 మంది మహమ్మారి బారినపడి మరణించారని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడించాయి.

చదవండి : క‌రోనా: ఆసుప‌త్రిలో అమెరికా డాక్ట‌ర్ల డ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement