భారత్‌-ఇరాన్‌ ప్రతిష్టాత్మక డీల్‌పై అమెరికా గుస్సా! | Why US is worried after PM Modi Chabahar port deal with Iran | Sakshi
Sakshi News home page

భారత్‌-ఇరాన్‌ ప్రతిష్టాత్మక డీల్‌పై అమెరికా గుస్సా!

Published Wed, May 25 2016 4:56 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

భారత్‌-ఇరాన్‌ ప్రతిష్టాత్మక డీల్‌పై అమెరికా గుస్సా! - Sakshi

భారత్‌-ఇరాన్‌ ప్రతిష్టాత్మక డీల్‌పై అమెరికా గుస్సా!

వాణిజ్య సహకారం కోసం దక్షిణ ఇరాన్‌లో చాబహర్‌ ఓడరేవు నిర్మాణం కోసం భారత్‌ ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెరికా సెనేటర్లు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇరాన్‌పై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించి మరీ భారత్‌ ఈ ఒప్పందం చేసుకుందా? అంటూ సెనేటర్లు ప్రశ్నించారు. దీంతో స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ ఈ ఒప్పందాన్ని నిశిత దృష్టితో పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇరాన్‌పై ఆంక్షలకు అనుగుణంగా భారత్‌ వ్యవహరిస్తుందని తాము భావిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ (మధ్య, దక్షిణాసియా వ్యవహారాలు) నిషా దేశాయ్‌ బిస్వాల్‌ తెలిపారు.

ఇరాన్‌లో చాబాహర్‌ ఓడరేవు అభివృద్ధికి  ఆ దేశ ప్రభుత్వంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 500 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. చైనాను అధిగమించి ఈ ఓడరేవు నిర్మాణాన్ని భారత్‌ చేజిక్కించుకోవడం ద్వైపాక్షికంగా భారత్‌-ఇరాన్‌కు ఎంతో కలిసిరానుంది. ఈ ఓడరేవు వల్ల పాకిస్థాన్‌, చైనాతో నిమిత్తం లేకుండానే భారత్‌ దక్షిణాసియా దేశాలతో వాణిజ్యం కొనసాగించగలదు. వ్యూహాత్మకంగా కీలకమైన చాబాహర్‌ పోర్టు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోవడం భారత్‌ దౌత్య విజయంగా భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement