నీటిపై పవన విద్యుదుత్పత్తి | Wind power on water | Sakshi
Sakshi News home page

నీటిపై పవన విద్యుదుత్పత్తి

Published Sun, Jul 30 2017 1:25 AM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM

నీటిపై పవన విద్యుదుత్పత్తి

నీటిపై పవన విద్యుదుత్పత్తి

గాలితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడాన్ని పవన విద్యుత్‌ అంటారనే విషయం మనకు తెలుసు. ఇందుకోసం కొండలు, గుట్టలు, మైదాన ప్రాంతాల్లో భారీ గాలి మరలను ఏర్పాటు చేస్తారు. గాలికి ఇవి తిరుగుతూ ఉంటే వాటికి బిగించిన టర్బైన్లు తిరగడం వల్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. అయితే గాలి వేగం మైదాన ప్రాంతాలు, కొండలు, గుట్టల కంటే సముద్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి చోట ఈ గాలిమరలను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని భావించిన లండన్‌ శాస్త్రవేత్తలు ఏకంగా సముద్రంలోనే తేలియాడే గాలిమరలను స్కాట్‌లాండ్‌ జలభాగంలో ఏర్పాటు చేశారు.

లండన్‌లోని బిగ్‌ బెన్‌ గడియారం కంటే ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ గాలి మరలతో ఏకంగా 20,000 గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. అయితే నీళ్లపై ఈ భారీ స్తంభాలు నిలబడేందుకు స్టాటాయిల్‌ అనే సంస్థ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిందని, ఈ టెక్నాలజీని మరింతగా, తక్కువ ఖర్చులో అందుబాటులోకి తీసుకువస్తే పవన విద్యుత్‌ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ లీఫ్‌ డెల్ప్‌ తెలిపారు. దీనికి హైవిండ్‌ ప్రాజెక్టుగా నామకరణం చేశామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement