
ఇండోనేషియా రక్షణ శాఖ మంత్రి మహ్మద్ మహ్‌పుద్ ఎమ్‌డీ
జకార్తా : కరోనా లాక్‌డౌన్‌కు సంబంధించిన సడలింపులు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇండోనేషియా రక్షణ శాఖ మంత్రి మహ్మద్ మహ్‌పుద్ ఎమ్‌డీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కరోనాను ఎదురు తిరిగిన భార్యగా పోల్చటంపై మహిళా సంఘాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం ఎన్నిరోజులని ఇలా గిరిగీసుకుని కూర్చుంటాం. మనం మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవాలి. బాగా తెలిసిన ఓ వ్యక్తి నుంచి నిన్న నాకో మీమ్ వచ్చింది. అందులో.. ‘కరోనా వైరస్ మీ భార్య లాంటిది. మొదట్లో దాన్ని కంట్రోల్ చేద్దామని భావించారు. ( ‘రైలు కొనాలి.. రూ.3000 కోట్లు ఇస్తారా?’ )
కానీ, అది జరగని పనని అర్థమైంది. ఇక సర్దుకునిపోవటమే మేలని అనుకుంటున్నారు’’ అని ఉందన్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న మహిళా సంఘాలు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులు రాజకీయ నాయకుల చేతగాని తనానికి, మహిళల్ని కించపరిచే తత్వానికి నిదర్శనమని మహిళా సంఘ నాయకురాలు దిండ నిశ యూరా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment