
జకార్త : రెండేళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యంత బరువున్న చిన్నారిగా అతని పేరిట రికార్డు ఉంది. ఆ సమయంలో మీడియాలో అతని కష్టాల గురించి వార్తలు బాగా చక్కర్లు కొట్టాయి. కట్ చేస్తే.. రెండేళ్లలో అనూహ్యంగా అతగాడు 70 కేజీలకు పైగా బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఇండోనేషియా వెస్ట్ జావాకు చెందిన అడే-రోకయ్ దంపతుల రెండో సంతానం ఆర్య పర్మానా. 10 ఏళ్ల వయసులో ఆర్య అక్షరాల 190 కేజీలతో అతను రికార్డుల్లోకెక్కాడు. అయితే కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారి రెండేళ్లలో భారీగానే బరువు తగ్గాడు. బాల భీముడి కథనం కోసం క్లిక్ చెయ్యండి
గతేడాది బారియాట్రిక్ శస్త్రచికిత్స ద్వారా 19 కేజీలు తగ్గాడు. అయితే ఈ క్రమంలో అతను జీర్ణకోశ సమస్యలతో బాధపడ్డాడు. అయినప్పటికీ డైట్ విషయంలో శ్రద్ధ వహిస్తూ క్రమక్రమంగా 76 కేజీలకు పైగా తగ్గిపోయి ఇలా మారిపోయాడు. ప్రస్తుతం 12 ఏళ్ల వయసున్న ఈ చిన్నారి మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడని అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.