ఇదే ప్రపంచంలోని ఓల్డెస్ట్ పబ్ | World's oldest pub | Sakshi
Sakshi News home page

ఇదే ప్రపంచంలోని ఓల్డెస్ట్ పబ్

Published Thu, Apr 3 2014 3:43 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

ఇదే ప్రపంచంలోని ఓల్డెస్ట్ పబ్ - Sakshi

ఇదే ప్రపంచంలోని ఓల్డెస్ట్ పబ్

ఐర్లండ్ లోని ఈ బార్ ప్రపంచంలోనే అత్యంత పురాతన పబ్. షాన్స్ బార్ అనే ఈ పబ్ క్రీస్తు శకం 900 నుంచీ ఉందని రికార్డులు చెబుతున్నాయి. అంతే కాదు. 2004 లో గిన్నెస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్ట్స్ కూడా ఈ విషయాన్ని సాధికారికంగా ధ్రువీకరించింది.


ఐర్లండ్ లోని అథ్లోన్ లో షనన్ నది ఒడ్డున ఈ బార్ ఉంది. 1970 వ దశకంలో దీనికి మరమ్మత్తులు చేయిస్తూండగా పాత గోడలు బయటపడ్డాయి. వాటి నిర్మాణంలో వాడిన పదార్థాలను బట్టి ఇది తొమ్మిదో శతాబ్దం నాటిదని నిపుణులు నిర్ధారించారు. తొలి రోజు నుంచి ఇప్పటి వరకూ ఈ బార్ ఎవరి చేతుల్లో ఉంది, ఆ యజమానుల పేర్లేమిటన్న వివరాలన్నీ బార్ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయట.


ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుప్రసిద్ధ పాశ్చాత్య గాయకుడు బాయ్ జార్జి కూడా కొంతకాలం ఈ బార్ కి యజమానిగా ఉన్నాడట.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement