మీ ఫొటో ‘స్మార్ట్’గా తీసుకోవచ్చు...!
వాషింగ్టన్:చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో తన ఫొటో తానే తీసుకోవడాన్ని ‘సెల్ఫీ’అంటారనేది మనకు తెలిసిందే...కానీ, అలా చేయడం వల్ల మనం అనుకున్నరీతిలో ఫొటో రాదు.. అయితే ఈ సమస్యను అమెరికాకు చెందిన ఐ-స్టాటెజీ ల్యాబ్ అనే సంస్థ ‘స్మార్ట్’గా పరిష్కరించింది. వీళ్లు రూపొందించిన స్మార్ట్ మిర్రర్‌కు ఎవరైనా ఎదురుగా నిలబడి నవ్వితే చాలు... అది తనంతట తానుగా ఫొటో తీసుకుంటుంది.
సెల్ఫీ (సెల్ఫ్ ఎన్‌చాన్సింగ్ లైవ్ ఫీడ్ ఇమేజ్ ఇంజిన్)గా పిలిచే ఈ మిర్రర్‌లో ఒక కెమెరా, మనుషులను గుర్తుపట్టే సాఫ్ట్‌వేర్, వెబ్‌క్యామ్‌తో పాటు ఎల్‌ఈడీ లైట్‌లు అమర్చారు. ఈ సెల్ఫీ మిర్రర్‌ను కెమెరాలతో పాటు మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్‌లలోనూ అమర్చుకోవచ్చు. ఇది తనంతట తానుగా ఫొటో తీసేయడమే కాదు...తీసిన చిత్రాన్ని వెంటనే ట్విట్టర్‌లో కూడా అప్‌లోడ్ చేస్తుంది.