
కరీంనగర్‌కార్పొరేషన్/కరీంనగర్‌సిటీ: ప్రపంచస్థాయి నగరాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన స్మార్ట్ సిటీలపై ఇతర దేశాల దృష్టి పడింది. దేశంలోని వంద నగరాల జాబితాలో తెలంగాణ నుంచి స్మార్ట్ సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్‌లో శనివారం బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పర్యటించారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన ఫ్లెమింగ్‌కు మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ శశాంక స్వాగతం పలికారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నగరపాలక సంస్థలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగర అభివృద్ధి, స్మార్ట్ సిటీ ప్రణాళికలపై వివరించారు.
కమిషనర్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన నగరాల నుంచి ఎంతో నేర్చుకునేది ఉంటుందని, కరీంనగర్‌ను సిస్టర్‌సిటీగా భావించి ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాంల నిర్వహణకు సహకరించాలని ఫ్లెమింగ్‌ను కోరారు. కమిషనర్ ప్రజెంటేషన్‌తో సంతృప్తి చెందిన ఫ్లెమింగ్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. నగర పరిసరాలు, అభివృద్ధిని బట్టి చూస్తే కరీంనగర్ అందమైన నగరంగా త్వరలోనే అవతరించబోతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కమలాకర్, సతీష్‌బాబు, ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ రమేశ్, కమిషనర్ శశాంక, ట్రేడ్ కోఆర్డినేటర్ ప్రవళిక, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన అండ్రూ ఫ్లెమింగ్
కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యేలు కమలాకర్, సతీష్‌బాబును ఫ్లెమింగ్ కలిశా రు. స్మార్ట్ సిటీ ఉద్దేశాలు, కరీంనగర్ వనరులు, వాణిజ్య పెట్టుబడుల అవకాశాల పై అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ కార్యాలయానికి చేరుకొని మహిళా రాజకీయ నా యకుల ప్రాతినిథ్యం, చదువుకు దూరంగా ఉన్న పిల్లలు, బాల్య వి వాహాల గురిం చి జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీటీసీ లు శరత్‌రావు, అన్నపూర్ణ, కోఆప్షన్ సభ్యుడు జమీలొద్దీన్, సీఈవో పద్మజారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment