![World Record of Achievers Students - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/9/wwwww.jpg.webp?itok=z8CGeSaW)
సప్తగిరికాలనీ (కరీంనగర్): కరీంనగర్‌లోని అచీవర్స్ స్కూల్ విద్యార్థులు పిరామింక్స్ ర్యూబిక్ క్యూబ్‌లో రికార్డు సాధించారు. తొలిసారిగా పిరామింక్స్ ర్యూబిక్ క్యూబ్ విభాగంలో పాఠశాలకు చెందిన 111 మంది విద్యార్థులు ఒకేసారి కేవలం 38 సెకన్లలో పరిష్కరించి ప్రపంచ రికార్డ్‌ను సృష్టించారు.
వండర్ బుక్ రికార్డ్స్ ఇండియా సమన్వయకర్త బింగి నరేందర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయకర్త స్వర్ణశ్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ హోల్డర్ విజయ భాస్కర్‌ల సమక్షంలో పిరామింక్స్ ర్యూబిక్ క్యూబ్‌ను 111 మంది విద్యార్థులు కేవలం 38 సెకన్లలో పూర్తి చేశారు. దీంతో వారు వండర్ బుక్ రికార్డ్‌లో పాఠశాల పేరు, పాఠశాల విద్యార్థులు చోటు సంపాదించారని ప్రకటించారు. అనంతరం వండర్ బుక్ రికార్డ్ సర్టిఫికెట్‌ను పాఠశాల డైరెక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సీహెచ్ పల్లవిలకు ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment