మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్‌బాబు
కారేపల్లి : ఎన్నికల హామీలకు పాతరేసి, ఆర్భాటాలు, మాటల గారడీలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని వైస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్‌బాబు అన్నారు. మంగళవారం కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పుల బాధలతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేకుండా పోయిందని ఆరోపించారు. మండలంలోని కొత్తూరుతండాలో సఫావట్ సర్వన్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వ తరుపున ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేవారే కరువయ్యారన్నారు. మండలంలో కేవలం ఒకే ఒక్క గ్రామంలో 20 డబుల్ బెడ్‌రూంలు ఇచ్చి తూతూ మంత్రంగా వ్యవహరించారని, పేదవారిని విస్మరించి, అనర్హులకు డబుల్ బెడ్‌రూంలు కేటాయించారన్నారు. 4 ఏళ్లలో ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మండలంలో 3 ఎకరాల భూమి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడిచారని, ఇంటికో ఉద్యోగం ఎటు పోయిందని ఆయన ఆరోపించారు. వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ వైస్సార్‌సీపీ నుంచి గెలిచినవారేనని, ఎన్నికల సమయంలో భుజాలపై మోసి పని చేసిన కార్యకర్తలను కాదని టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారన్నారు. రానున్న ఎన్నికల్లో వైస్సార్‌సీపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని, కార్యకర్తలు గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తాళ్లూరి రాంబాబు, నాయకులు గుగులోతు మోతీలాల్, ఇల్లెందు మండల, పట్టణ అధ్యక్షులు కాళీచరణ్ అశోక్, రమణ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నాగారపు రాములు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు వేమిరెడ్డి రోషిరెడ్డి, నాయకులు బాదావత్ వీరునాయక్, కంటాల మోహన్‌రావు, మహేష్, మోహన్, సందీప్, సంపత్, పవన్, గుగులోతు సుమిత, ద్వాళి, హతిరాం, మంగ, లక్ష్మి, శారద, సోని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment