
సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి గురువారం సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ ఖోరాతో భేటీ అయ్యారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచనల మేరకు ప్రదీప్ సింగ్‌ను బాలశౌరి కలిశారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారానికి రెండు సార్లు విజయవాడ- హైదరాబాద్-దుబాయ్ ల మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడపాలనిఘీ సందర్భంగా ప్రదీప్ సింగ్‌ను బాలశౌరి కోరారు. బాలశౌరి విజ్ఞప్తి మేరకు.. ఎయిర్ ఇండియా సర్వీసులు నడపడానికి ప్రదీప్ సింగ్ సానుకూలత వ్యక్తం చేశారు.
ఇందుకోసం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో త్వరతగతిన పర్మినెంట్ బిల్డింగ్లు, ఏరో బ్రిఢ్జిల పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గన్నవరంకి ఎయిర్ కనెక్టివిటీ అంశంపై చర్చించానంటూ హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. త్వరలోనే విజయవాడ-దుబాయ్ కి ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని కేంద్రం హామీ ఇవ్వడం ఆనందంగా వుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment