
సాక్షి, విజయవాడ : కనకదుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా రీజనల్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ‘చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ గొప్పలు చెబుతున్నారు. వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. అందుకు దుర్గగుడి ఫ్లైఓవరే ఉదాహరణ. ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికే చంద్రబాబు తంటాలు పడుతున్నారు. నిర్ణీత గడువులోగా ఫ్లైఓవర్ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి విదేశాలతో సమానంగా రాజధాని నిర్మిస్తానంటున్నారు. ఒక్క ఫ్లైఓవరే నిర్మించలేకపోయారు, రాజధాని ఎలా కడతారు?’ అని సూటిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment