durga temple flyover
-
బైక్ స్టంట్స్ చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు
-
దుర్గగుడి ఫ్లైఓవర్‌పై ఆకతాయిల ఆగడాలు
-
దేశ వ్యాప్తంగా కనకదుర్గా ఫ్లైఓవర్ అందాలు
సాక్షి, విజయవాడ : దేశంలోనే అతి పొడవైన కనకదుర్గా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఇందుకు సన్నాహక ఏర్పాట్లకు ఆదివారం అడుగులు పడ్డాయి. దేశంలోనే అత్యద్భుత ఫ్లై ఓవర్ కావటంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. సెప్టెంబరు 4వ తేదీన వర్చువల్ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఈ ఫ్లై ఓవర్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని పరిచయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్ బృందాన్ని విజయవాడకు పంపించింది.ఈ బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫ్లైఓవర్ అందాలను చిత్రీకరించింది. చిత్రీకరణలో ఆర్అండ్బీ స్టేట్ హైవేస్ విభాగం అధికారులతో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్టు) అధికారులు కూడా పాల్గొన్నారు. సెప్టెంబరు 4వ తేదీన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్‌కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో ఒంటి స్తంభంపై ఆరు వరసలతో నిర్మించిన ఫ్లై ఓవర్ కావటం చేత దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో ఢిల్లీ, ముంబయిల్లో మాత్రమే ఈ తరహా ఫ్లై ఓవర్లు ఉన్నాయి. అయితే ఆ రెండింటి కంటే అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు.పైగా దేశంలోనే అతి పొడవైనది. ఈ టెక్నాలజీలో వై పిల్లర్స్ ఉండటం, వీటి నిడివి ఎక్కువగా ఉండటం కూడా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీలో దేశంలోని అతి పొడవైన ఆరు వరసల ఫ్లై ఓవర్ కావటంతో దేశానికి గర్వకారణమైన విషయంగా కేంద్రం భావిస్తోంది. -
బోండా ఉమాపై మల్లాది విష్ణు ఫైర్
సాక్షి, విజయవాడ : నగరంలో కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర నిర్మించిన ఫ్లై ఓవర్‌పై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే పార్థ సారధి, తాను ఫ్లై ఓవర్ పూర్తి చేయాలని 2013లోనే కేంద్ర మంత్రిని కలిశామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నుంచే విజయవాడ అభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఉందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లై ఓవర్‌ను ఏడాదిలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు ఏమయ్యాయి?. దుర్గ గుడి ఫ్లై ఓవర్ విషయంలో మేము మొదటినుంచి అనుకూలంగానే ఉన్నాము. 2013లోనే దుర్గగుడి ఫ్లై ఓవర్‌కు తొలి అడుగు పడింది. ( దేవదాయ శాఖ నిధుల మళ్లింపు అవాస్తవం ) విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థకు 500 కోట్ల రూపాయలు వస్తే.. మీరు ఏం చేశారో తెలుసు. ఈ రోజు రాష్ట్రంలో 5 కోట్ల మందికి వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, అందుతున్నాయి. కోర్టుల పేరుతో ఈ రోజు పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నారు. విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాల్లో లక్ష మందికి ఇల్లు ఇస్తుంటే టీడీపీ వాళ్లు అడ్డుకుంటున్నారు. జక్కంపూడిలో 15 వేల ఇళ్ల నిర్మాణానికి 50 వేల నుంచి లక్ష రూపాయలు జమ చేయించకపోతే దక్కవని దోచుకున్నది టీడీపీ నేతలే’’నన్నారు. -
తీరనున్న బెజవాడ వాసుల చిరకాల స్వప్నం
సాక్షి, అమరావతి: బెజవాడ వాసుల చిరకాల స్వప్నం తీరనుంది. నగరంలో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఫ్లైఓవర్ ‘లోడ్ టెస్ట్’ నిమిత్తం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కుమ్మరిపాలెం నుంచి వినాయక గుడి వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. విజయవాడ వైపు వచ్చే భారీ వాహనాలు/ ఇతర వాహనాలు ఇబ్రహీంపట్నం-గొల్లపూడి-సితార సెంటర్-కబేలా-సీవీఆర్ ఫ్లై ఓవర్- ఇన్నర్ రింగ్‌రోడ్డు-పైపుల రోడ్ జంక్షన్- రామవరపడు రింగ్‌రోడ్డు మీదగా జాతీయ రహదారి 65కి మీదగా వెళ్లాలని నగర అదనపు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కృష్ణలంక పోలీస్‌స్టేషన్- పోలీస్ కంట్రోల్ రూమ్- పంజా సెంటర్- చిట్టినగర్- సొరంగం- గొల్లపూడి - ఇబ్రహీంపట్నం మీదగా వెళ్లాలని పేర్కొన్నారు. 15వ తేదీ సాయంత్రం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం 98 శాతం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 20 తర్వాత ట్రయల్ రన్ నిర్వహించాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. అంతకు ముందుగా ‘లోడ్ టెస్ట్’ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం నుంచి 48 గంటల పాటు లోడ్ టెస్ట్‌ను కొనసాగించనున్నారు. 24 లారీల్లో ఇసుక/ కాంక్రీటును నింపుతారు. ఒక్కో లారీపై 28.5 టన్నుల చొప్పున మొత్తం 684 టన్నుల బరువును వంతెనపై స్పాన్ల మధ్య ఉంచుతారు. 48 గంటల తర్వాత ఏమైనా లోపాలు కనిపిస్తే సరిచేస్తారు. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాక ఈనెల 20 తర్వాత ట్రయల్ రన్లో భాగంగా వాహనాలను అనుమతిస్తామని ఆర్ అండ్ బీ (క్వాలిటీ కంట్రోల్) సూపరింటెండింగ్ ఇంజినీర్ జాన్ మోషే తెలిపారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చివరి దశకు దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు
-
దుర్గగుడి ఫ్లైఓవర్ విజయవాడకు ప్రతిష్టాత్మకం
-
డిసెంబర్‌కల్లా దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి
సాక్షి, విజయవాడ: ఈ ఏడాది డిసెంబర్ నాటికి దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. పనుల జాప్యంపై మంత్రులు ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ.. దుర్గగుడి ఫ్లైఓవర్ విజయవాడ నగరానికే ప్రతిష్టాత్మకమని అన్నారు. తొలి ప్రాధాన్యతగా ఫ్లైఓవర్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. డిజైన్ మార్పుతో పాటు, వయాడక్ట్ ఏర్పాటు చేయడం లాంటి పనుల వల్ల బడ్జెట్ పెరిగిందన్నారు. ఫ్లైఓవర్ పనుల కోసం నెలరోజులపాటు ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. -
ఒక్క ఫ్లైఓవర్ కట్టలేకపోయారు..
సాక్షి, ఎలక్షన్ డెస్క్ : ప్రజలకు ఏం అవసరమో పాదయాత్ర ద్వారా స్వయంగా తెలుసుకుని.. ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకంతోనే వాటిని అమలు చేసిన మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంతకన్నా మెరుగైన పాలన అందించే దృఢ సంకల్పమున్న యువనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు ఘోరంగా మోసపోయారు. వందలాది హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి, ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నేత రాష్ట్రానికి అవసరం. అలాంటి విజన్, ఇచ్చిన హామీల్ని అమలుచేసే విశ్వసనీయత ఉన్న నాయకుడు వైఎస్ జగన్. ఆయన పాలనను రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు’ అని సినీ నటుడు కృష్ణుడు (అల్లూరి కృష్ణంరాజు) అంటున్నారు. ఎన్నికల వేళ ‘సాక్షి’తో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. రాజన్న పాలన గురించి అప్పుడు అర్థమైంది పాదయాత్రలో పాల్గొన్నప్పుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ప్రజలు అనేక సమస్యలు విన్నవించడం నేను ప్రత్యక్షంగా చూశాను. తమకు ప్రభుత్వం నుంచి పథకాల లబ్ధి అందడం లేదని వృద్ధులు, వికలాంగులు, మహిళలు చెప్తుంటే బాధనిపించింది. వైఎస్ హయాం అనంతరం ఇందిరమ్మ ఇళ్లు ఎవరికీ ఇవ్వలేదని జగనన్న దృష్టికి తీసుకొచ్చేవారు. డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ కాలేదని చాలామంది చెప్పుకుని బాధపడేవారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అందడంలేదని తల్లిదండ్రులు, విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకునేవారు. రాజన్న పాలన అంటే ఏంటో అప్పుడు అర్థమైంది. వైఎస్సార్ హయాంలోని సంక్షేమాన్ని చంద్రబాబు విస్మరించారు. మార్పు తప్పనిసరి వైఎస్ జగన్ జనంతో మమేకమై, వారి సమస్యలు వింటూ, వారిలో భరోసా నింపిన తీరు చూశాను. తాను సీఎం అయ్యాక అందరి కష్టాలు తీరతాయని ఆయన బాధిత ప్రజల్లో మనోధైర్యం నింపేవారు. అవన్నీ చూశాక రాష్ట్రానికి ఇలాంటి దార్శనికుడు, విజన్ ఉన్న నాయకుడు అవసరమనిపించింది. సింగపూర్‌ను తలదన్నే అమరావతి ఎక్కడ? అమరావతిని సింగపూర్‌లా చేస్తానని చంద్రబాబు భ్రమలు కల్పించారు. ఐదేళ్లు పూర్తికావస్తున్నా ఎక్కడా శాశ్వత నిర్మాణాలు లేవు. కనీసం కనకదుర్గ ఫ్లైఓవర్ నాలుగేళ్లుగా పూర్తి చేయలేదు. ఇక అమరావతి అభివృద్ధి చేస్తారంటే ఎలా నమ్మడం. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా! అని సీఎం అనడం ఎంత దుర్మార్గం. టీడీపీ నేతలు ఎస్సీ, బీసీ వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, అధికారులపై దాడులకు పాల్పడినా ఆయన కనీసం వాళ్లను మందలించలేదు. పోస్ట్ డేటెడ్ చెక్కుల పేరిట మోసం కేంద్రంతో కలిసున్నంత వరకూ మోదీని పొగిడి, తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రజల్ని మభ్యపెట్టే పథకాల్ని చంద్రబాబు తెరపైకి తెస్తున్నారు. నాకు తెలిసున్నంత వరకూ పోస్ట్ డేటెడ్ చెక్కులివ్వడం ఎన్నడూ చూడలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ఏదొక పార్టీతో పొత్తుపెట్టుకోవడం, అధికారంలోకి వచ్చాక అవన్నీ తుంగలో తొక్కడం అలవాటే. గత ఎన్నికల్లో బీసీలకు 120 హామీలు ఇచ్చి వేటినీ నిలబెట్టుకోలేదు. టీడీపీ, బీజేపీలు ప్రజల్ని మోసం చేశాయి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజల్ని మోసగించాయి. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు పదే పదే చెప్పారు. హోదా కోసం పోరాడిన వారిని అరెస్ట్ చేయించారు. ఉద్యమకారులను బెదిరించి, కేసులు కూడా పెట్టారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగకుండా పోరాడిన ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డే. బీజేపీతో నాలుగేళ్లకుపైగా అంటకాగి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మోదీకి సంబంధాలు అంటగట్టడం ఆయనకే చెల్లింది. పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసమే నిర్మాణ బాధ్యతల్ని చంద్రబాబు సర్కారు దక్కించుకుందనేది బహిరంగ రహస్యం. కేంద్రానికి అప్పగించి ఉంటే ఈపాటికి పోలవరం పూర్తయ్యేది. జగన్‌పై ప్రజలకు అపార నమ్మకముంది ఇచ్చిన హామీలు నెరవేర్చగల సత్తా ఉన్న వారే ముఖ్యమంత్రి పదవికి అర్హులు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఏ హామీలు నెరవేర్చలేదు. జగన్ మాత్రం ఆచరణ సాధ్యమైన హామీలిస్తూ.. ప్రజలకు చేరువయ్యారు. ఆయన సీఎం అయ్యాక ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. తాము కోరుకున్న నాయకత్వ లక్షణాలు జగన్‌లో ఉన్నాయని ప్రజలు నమ్ముతున్నారు. ఏ సమస్య వచ్చినా ఆయన ప్రజల తరఫున నిలబడుతున్నారు. గత 9 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. వైఎస్ జగన్‌లో సంకల్పబలం ఎక్కువ. వైఎస్ రాజశేఖరరెడ్డిగారి కన్నా ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంటారు. విలువలు, విశ్వసనీయతే జగనన్న ప్రాణం వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువలు, విశ్వసనీయతకు కట్టుబడ్డారు. ప్రతీ అంశంపై స్పష్టత ఉంది. అందుకే గత ఎన్నికల్లో ఆయన బూటకపు హామీలివ్వలేదు. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా లెక్కచేయని మనస్తత్వం. తండ్రిలాగే నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేసే నైజం ఆయనది. -
మీరిచ్చే భరోసా ఇదేనా?
సాక్షి, కైకలూరు : కిరణ్ : ఏరా.. త్రినాథ్.. జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయిరా.. ఈ సారి ఏవరెవరి మధ్య ప్రధాన పోటీ ఉంటుందంటావు.. త్రినాథ్ : అరే మూడు పార్టీల మ«ధ్యనే కదరా.. కిరణ్ : అరే.. చదువుకున్నోళ్లుగా మనం.. కొద్దిసేపు నిజాలు మాట్లాడుకుందాం.. త్రినాథ్.. నిజం చెప్పు.. మన మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి కావల్సింది 4,000 ఎకరాలు.. ప్రభుత్వం అనుబంధ పరిశ్రమల పేరుతో ఏకంగా 30,000 ఎకరాలు సేకరించింది.. పాపం 25 గ్రామాల ప్రజలు బాధపడుతున్నారా.. లేదా.. త్రినాథ్ : అరే.. మొన్నే కదరా.. పోర్టుకు శంకుస్థాపన మాపార్టీ వాళ్లు చేశారు.. టీవీ, పేపర్లో చూడలేదా? కిరణ్ : త్రినాథ్.. మరి అంత అడ్డగోలుగా.. మాట్లాడకురా.. నాలుగున్నరేళ్లు తర్వాత ఎన్నికలు కొన్ని నెలల్లో ఉండగా శంకుస్థాపన చేస్తారా.. ఏమిటీ రాజకీయం.. రాజేష్ : (కూర్చున్న పిట్ట గోడ నుంచి దిగుతూ) అరే.. కిరణ్.. నేను కూడా ఓ ప్రశ్న వేస్తానురా.. అదేంటంటే... మన విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.. పనులతీరుపై పలువురు ఆందోళన చేశారు. మనకేమో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు.. వినోద్ : ఈ ప్రశ్నకు నేను సమాధానం చెబు తా నురా.. అరే విజయవాడ తాత్కాలిక రాజధాని అయిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఈ ప్రాంతానికే ఇస్తున్నార్రా.. పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయంతే.. రాజేష్ : ఏరా.. నువ్వే చెబుతున్నావుగా.. తాత్కాలిక రాజధాని అని, రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతుంటే ఇంకెçప్పుడురా ఫ్లైఓవర్ కట్టేది.. త్రినాథ్ : ఏంట్రా.. మరీ అలా మాట్లాడుతారు.. టీడీపీ రైతులకు ఎంతో సాయం చేసింది తెలుసా.. మీరు లోపాలనే ఎత్తి చూపుతున్నారేంట్రా... కిరణ్: ఓరే.. త్రినాథ్.. ఏంట్రా రైతులకు ఒరి గింది.. కొద్దిసేపు వరి పక్కన పెడదాం.. 2015లో సుబాబుల్‌కు రూ.4,200, జామాయిల్‌కు రూ.4,500 గిట్టుబాట ధరగా అందిస్తామని మీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడెమో.. సుబాబుల్‌కు రూ.2,200, జామాయిల్‌కు రూ.2,600 అందిస్తున్నారు. రైతు టన్నుకు రూ.15,00 నష్టపోతున్నాడు.. ఇదేనా రైతులకు మీరేచ్చే భరోసా.. నువ్వే ఆలోచించు.. మహేష్: (కూర్చున్న వాడు ఆవేశంతో పైకి లేస్తూ) ఆరే ఏంట్రా.. మా పార్టీని అందరూ ఆడిపోసుకుంటారు.. ఏ రాష్ట్రంలోనైనా ఉచిత ఇసుక ఎక్కడైనా ఇచ్చారా.. దీనికి సమాధానం చెప్పండి.. కైలాష్ : అరే.. నీ ప్రశ్నకు మా వాళ్ల తరుపున నేను సమాధానం చెబుతాను.. విను.. ఏరా మన జిల్లాలో గన్నవరం వద్ద బ్రహ్మలింగయ్య చెరువు ఎలా ఉండేది.. అక్కడ కూడా ఇసుకను కొల్లగొట్టారు.. ఇక జగ్గయ్యపేట, మైలవరం, నూజివీడు, కైకలూరులలో అక్రమ ఇసుక దందాలకు అదుపే లేదు.. ఇదేనా మీ ఉచిత ఇసుక పథకం.. వినోద్ : ఒరే.. రాష్ట్రంలో మా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఏకంగా 18,500 టెంపరరీ ఉద్యోగాలు అందించింది.. ఇంతకన్నా ఏం కావాలి.. రాజేష్: ఉద్యోగాలు ఇచ్చింది.. ఇచ్చిందే కాకుండా.. తీసేసినవి కూడా చూడు.. మరి.. మొత్తం మీద ఏమైనా 23,500 ఉద్యోగాలు తీసేశారు.. నోటిఫికేషన్ విషయం తీసుకుంటే.. ఒకరు నోటిపికేషన్ ఇస్తారు.. మరొకరు తీసేస్తా్తరు.. ఏంటిరా.. ఈ పద్ధతి.. త్రినాథ్ : అరే ఇవన్నీ పక్కన పెట్టండిరా.. మా పాలనలో మహిళా సాధికారత సాధిస్తున్నాం.. కిరణ్ : అబ్బో.. బాగా చెప్పావురా.. మహిళలకు గౌరవమంటే.. తహసీల్దారుని జుట్టు పట్టుకు లాగడమా.. అంతెందుకురా.. కాల్‌మనీ కేసులో ఇక్కడ మహిళలకు ఏం న్యాయం జరిగిందో.. అందరికీ తెలుసురా.. మహేష్: అరే .. ఇది మాత్రం మా పార్టీకి అనుకూలంగా ఉంటుందిరా.. ఆస్పత్రులలో పేదలకు అనేక సేవలు అందిస్తున్నాం.. దీనిని ఎవరూ కాదనలేరు.. కైలాష్ : ఏంట్రా ఆస్పత్రుల్లో అభివృద్ధి.. మన విజయవాడ పాత ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిగా 1000 పడకలు అన్ని చెప్పారు. అక్కడ వైద్య సేవలు ఎలా ఉన్నాయో సామాన్య ప్రజలను అడగండి చెబుతారు.. అయినా మీ పాలనలో ఆస్పత్రిలో శిశువులను ఎలకలు కొరికిన సంఘటనలను.. జనాలు మర్చిపోయారనుకుంటున్నారా.. వినోద్ : అరే.. ఊరుకోండిరా.. ఎండ ఎక్కువ అవుతోంది.. పోదాం పదండి ఇళ్లకు.. -
‘అమ్మ’ తోడు.. అంతులేని వంతెన
సాక్షి, విజయవాడ : అమరావతిని రాజధానిగా ప్రకటించాక విజయవాడలో అద్దెలతోపాటు ట్రాఫిక్ కష్టాలూ రెట్టింపయ్యాయి. నగరంలోకి పెద్ద ఎత్తున రాకపోకలు సాగించే వాహనాలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇక్కడ చేపట్టిన తొలి ప్రాజెక్టు దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు. 11.6 కి.మీ దూరం ఉండే దేశంలోనే అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌వేని హైదరాబాద్‌లో 2005 చివరిలో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేశారు. దుర్గగుడి ఫ్లైఓవర్ దూరం కేవలం 2.6 కిలోమీటర్లే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా చంద్రబాబు సర్కారు ఓ వంతెన కూడా కట్టలేకపోవడంపై నగరవాసుల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలంటూ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు భారీ ధర్నా కూడా చేయడం గమనార్హం. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం మూడేళ్లుగా రాకపోకలపై ఆంక్షలు విధించడంతో చెన్నై నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేవారికి, మచిలీపట్నం పోర్టు నుంచి పుణె వెళ్లే భారీ వాహనాల డ్రైవర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్లో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్ నాని.. నాని ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ ‘నాని’లు రంగంలోకి దిగారు. ప్రధాన రాజకీయ పక్షాలైన వైఎస్సార్సీపీ, టీడీపీ తరఫున బరిలో నిలిచారు. మొత్తం ఐదుగురు ‘నాని’లు ఉండగా... వీరిలో ఒకరు లోక్‌సభకు, నలుగురు శాసనసభకు పోటీ చేస్తున్నారు. కొడాలి నాని (గుడివాడ), ఆళ్ల నాని (ఏలూరు), పేర్ని నాని (మచిలీపట్నం) వైఎస్సార్సీపీ నుంచి ప్రజాభిప్రాయం కోరుతుండగా... ఈలి నాని తాడేపల్లిగూడెం నుంచి శాసన సభకు, కేశినేని నాని విజయవాడ నుంచి లోక్‌సభకు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వీరంతా గత ఎన్నికలనూ ఎదుర్కొన్నారు. మరో విశేషమేమంటే... వీరంతా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల వారే కావడం. ఏదేమైనా తెలుగింటి చిన్నారులకు ముద్దు పేరైన ‘నాని’... రాజకీయాల్లోనూ వినిపిస్తుండటం విశేషం. రూ.11 కోట్లు మట్టి పాలు.. దుర్గ గుడి వంతెన డిజైన్లపైనా నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు వరుసల ఫ్లై ఓవర్ ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలని ఒత్తిళ్లు చేయడం కూడా నిర్మాణంలో అంతులేని జాప్యానికి కారణమని సమాచారం. ఇక పనులు పూర్తి కాకుండానే సుందరీకరణ పేరుతో రూ.11 కోట్లు ఖర్చు చేయడంతో ఇదంతా బూడిదలో పోసిన పన్నీరేనని పేర్కొంటున్నారు. మరోవైపు నగరంలోకి ప్రవేశించే భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా బెంజి సర్కిల్ వద్ద ఇటీవలే ప్రారంభమైన వంతెన నిర్మాణంలో కూడా చాలా జాప్యం జరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ కూడలి వద్ద వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. సైబరాబాద్‌ను తానే నిర్మించానని తరచూ చెప్పుకునే సీఎం చంద్రబాబు... విజయవాడలో ఓ వంతెన కూడా కట్టలేకపోయారని నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. -
‘అందుకు దుర్గగుడి ఫ్లైఓవరే ఉదాహరణ’
సాక్షి, విజయవాడ : కనకదుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా రీజనల్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ‘చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ గొప్పలు చెబుతున్నారు. వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. అందుకు దుర్గగుడి ఫ్లైఓవరే ఉదాహరణ. ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికే చంద్రబాబు తంటాలు పడుతున్నారు. నిర్ణీత గడువులోగా ఫ్లైఓవర్ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి విదేశాలతో సమానంగా రాజధాని నిర్మిస్తానంటున్నారు. ఒక్క ఫ్లైఓవరే నిర్మించలేకపోయారు, రాజధాని ఎలా కడతారు?’ అని సూటిగా ప్రశ్నించారు. -
డిసెంబర్ 5న దుర్గగుడి ఫ్లైఓవర్ శంకుస్థాపన
విజయవాడ : విజయవాడ నగరంలో దుర్గగుడి ఫ్లైఓవర్‌కు శంకుస్థాపనకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 5వ తేదీన ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితీన్ గడ్కరీ, వెంకయ్యనాయుడిలతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 464 కోట్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్మాణాన్ని కృష్ణా పురష్కరాల నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసునేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు.