
ప్రతీకాత్మక చిత్రం
నేనతన్ని మర్చిపోవడానికి పూజలు చేయించారు. దాని కోసం దాదాపు రూ. 30 వేలు..
నా జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో నేను చాలా క్లారిటీగా ఉంటాను. నా కెరీర్ గోల్స్‌కు సంబంధించి అయితే మరింత కచ్చితంగా ఉంటాను. డాక్టర్ అవ్వాలన్నది నా జీవితాశయం. కానీ, విధి నన్ను ఇంజనీర్‌ను అయ్యేలా చేసింది. అప్పుడే అతడు నాకు పరిచయం అయ్యాడు. అతడు నన్ను బాగా అర్థం చేసుకుంటాడు, నా ఫ్యామిలీని గౌరవిస్తాడు, మా కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుంటాడు, నా ఆశయాలను గౌరవిస్తాడు. అందుకే అతడంటే నాకు ప్రేమ. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. కొద్ది రోజులకే మా ప్రేమ విషయం మా ఫ్యామిలీస్‌కు తెలిసి పోయింది. కులాలు వేరు కావటంతో రెండు కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది అన్ని ప్రేమ జంటల విషయంలో మామాలే అయినా మా కుటుంబంలో మాత్రం జాతకాల పట్టింపులు ఎక్కువ. జాతకాలు నిజమో కాదో నాకు తెలియదు. ఓ వ్యక్తి మంచివాడా.. చెడ్డవాడా అన్నది జాతకాలను బట్టి ఎలా డిసైడ్ చేస్తారు. మా ఇంట్లో వాళ్లను ఒప్పించటానికి శతవిధాల ప్రయత్నించాను. మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.
ఇంకో సిల్లీ విషయం ఏంటంటే నేనతన్ని మర్చిపోవడానికి పూజలు చేయించారు. దాని కోసం దాదాపు రూ. 30 వేలు ఖర్చు చేశారు. అంధవిశ్వాసాల కారణంగా నిజమైన ప్రేమ ఎలా చచ్చిపోతుంది చెప్పండి. ఇరు కుటుంబాలు మా ప్రేమను అర్థం చేసుకుంటాయనే ఆశిస్తున్నాను. కులాల కారణంగా, మూడనమ్మకాల కారణంగా ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా చచ్చిపోతుంది. మేము మా పెద్దవాళ్లకు భావాలకు గౌరవిస్తున్నాము. కేవలం కులం, జాతకాల పేరుతో వాళ్లు మమ్మల్ని దూరం చేస్తున్నారు.
- సౌభాగ్య, ఢిల్లీ
చదవండి : మా మధ్య ప్రేమ, గొడవలు పీక్స్‌కు వెళ్లిపోయాయి
మా పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారా?
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి