ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైన ప్రేమించటం పరిపాటి. ముఖ్యంగా నేటి తరం యువతీ,యువకులకు ప్రేమించటం ఒక అవసరం లాంటిది. అందుకే ఆ అవసరం తీరిపోగానే ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. కొంతమంది ప్రేమలో విజయం సాధిస్తే.. మరికొందరు విఫలమవుతున్నారు. విఫల ప్రేమికులు కొందరు క్రోదంతో తమను తాము బలిచేసుకోవటమో లేదా ఎదుటి వ్యక్తిని బలితీసుకోవటమో చేస్తున్నారు. ఆకర్షణ, మోహాలను ప్రేమగా పొరపడి తొందపాటుతో నేరాలు చేస్తున్నారు. నిజంగా ప్రేమించటం, ప్రేమించబడటం అన్నది అరుదుగా జరుగుతోంది. నిజమైన ప్రేమ అన్నది ఎదుటి వ్యక్తిని ఎప్పటికీ బాధించదని తెలుసుకోగలగాలి.
నిజమైన ప్రేమంటే?
అసలు నిజమైన ప్రేమ అంటే భాగస్వామి పట్ల అచంచలమైన, విడదీయలేని అనుబంధం, వాత్సల్యం కలిగి ఉండటమే అని చెప్పొచ్చు. ఇందులో ఎదుటి వారిపట్ల భావోద్వేగాలతో కూడిన శారీరక సంబంధం(శృంగారాన్ని మించినది) కలిగివుంటాము. వారినుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎదుటివ్యక్తి సంతోషం కోసం పరితపిస్తాము. అతడు/ఆమె లేకుండా జీవితాన్ని ఊహించుకోవటం అసాధ్యం అనిపిస్తుంది.
మీరు నిజంగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తుంటే..
వన్‌సైడ్ లవ్, టూ సైడ్ లవ్ రెండిటి విషయంలో.. భేషరతుగా ఎదుటివ్యక్తి బాగోగుల గురించి ఆలోచించగలగాలి. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉండగలగాలి. భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకోవాలి, వారితో మంచి,చెడులు, కష్టనష్టాల గురించిన విషయాలు దాపరికాలు లేకుండా పంచుకోగలగాలి. ఆ వ్యక్తి ముందు మనం మనలా ఉండగలగాలి.. నటన అన్నమాట పనికిరాదు. ఆ వ్యక్తిపై గౌరవం ఉండాలి. తన, మన బేధాలు ఉండకూడదు. ఎదుటి వ్యక్తి సంతోషాలకు ప్రాధాన్యత ఇవ్వగలగాలి. నిజమైన ప్రేమలో ‘‘నేను’’ అన్నది కాకుండా ‘‘మేము’’ అన్నది కనిపిస్తుంది. ప్రేమికులు ఇద్దరు ఓ జట్టుగా ఉండటం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment